Blood Group: బ్లడ్ గ్రూపును బట్టి వ్యాధులు వచ్చే అవకాశం, ఏ బ్లడ్ గ్రూపు వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటే
Blood group: వ్యక్తి బ్లడ్ గ్రూపును బట్టి వారికి వచ్చే రోగాల జాబితా ఆధారపడి ఉంటుంది. ఏ బ్లడ్ గ్రూపుకు ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందో తెలుసుకోండి.
ప్రతి వ్యక్తి తమ బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బ్లడ్ గ్రూప్ ను బట్టి కొన్ని వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. సిడ్నీకి చెందిన డైలీ టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం, శాస్త్రవేత్తలు క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు వంటివి కొన్ని బ్లడ్ గ్రూపు కలిగి ఉన్న వ్యక్తులకు వచ్చే అవకాశం ఉంది. 'O' బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి ఇతర రక్త వర్గాలతో పోలిస్తే వారికి వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. వీరికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. 'A', 'B', 'AB' బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఇతర అధ్యయనాలు చెబుతున్నాయి.
గుండె జబ్బులు
'A', 'B', 'AB' అనే బ్లడ్ గ్రూపులు ఉన్న వారికి ‘డీప్ సిర థ్రాంబోసిస్’ (DVT) వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తం గడ్డకట్టి సిరలు లేదా ధమనుల్లో థ్రోంబోసిస్ సంభవిస్తుంది. దీని లక్షణాలు ఒక కాలులో నొప్పి, వాపు, ఛాతీ నొప్పి, శరీరం ఒక వైపు తిమ్మిరి పట్టడం వంటివి కనిపిస్తాయి. థ్రోంబోసిస్ వల్ల స్ట్రోక్ లేదా గుండెపోటు వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. దీనికి ప్రధాన కారణం పెరిగిన ‘విల్లెబ్రాండ్’. ఇది ఒక రకమైన ప్రోటీన్. ఇది రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. ఇది 'O' బ్లడ్ గ్రూపు వారి రక్తంలో తక్కువగా ఉంటుంది. కాబట్టి వారికి స్ట్రోక్ వంటి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తక్కువ.
అంటు వ్యాధులు
బ్లడ్ గ్రూప్ ‘O’ ఉన్నవారికి అంటు వ్యాధులు త్వరగా సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా హెలికోబాక్టర్ పైలోరి ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఎక్కువ. ఈ ఇన్ఫెక్షన్ పొట్ట, చిన్న ప్రేగులకు సోకుతుంది. అలాంటి వారు కలరా, ఎస్చెరిచియా కోలి, నోరో వైరస్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అయితే 'ఓ' బ్లడ్ గ్రూప్ ఉన్నవారు మలేరియా వంటి వ్యాధుల నుంచి త్వరగా కోలుకుంటారు.
పిల్లలు పుట్టకపోవడం
'O' బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల్లో పునరుత్పత్తి సమస్య అధికంగా వచ్చే అవకాశం ఉంది. వారిలో ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (మహిళల్లో అండోత్సర్గముకు కారణమయ్యే హార్మోన్ ఇది) ఉందని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. అధిక స్థాయిలో విటమిన్ డి గర్భధారణ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. దీనివల్ల తక్కువ అండాలు ఉత్పత్తి అవుతాయి. అయితే మరో అధ్యయనంలో 'O' బ్లడ్ గ్రూప్, 'A' బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల కంటే 'B' బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల్లో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
మెమరీ లాస్
'AB' బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి అభిజ్ఞా బలహీనతలు వచ్చే అవకాశం 82 శాతం ఎక్కువ అని తెలుస్తోంది. అభిజ్ఞా బలహీనత అంటే ఒక వ్యక్తికి ఆలోచించే, నేర్చుకునే, గుర్తుంచుకునే, నిర్ణయాలు సామర్థ్యం. వారు నిర్ణయాలు కూడా సరిగా తీసుకోలేరు. జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఏకాగ్రతలో ఇబ్బంది వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
టైప్ -2 డయాబెటిస్
బ్లడ్ గ్రూప్ 'A' , 'B' ఉన్నవారికి టైప్ -2 డయాబెటిస్ వచ్చే అవకాశం 20 శాతం ఎక్కువ. కాబట్టి ఈ బ్లడ్ గ్రూపులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
పైన చెప్పిన సమాచారం ప్రకారం ఒక బ్లడ్ గ్రూపు వ్యాధులు రావడానికి పూర్తి బాధ్యతను వహించవు. కానీ వచ్చే అవకాశాన్ని మాత్రం పెంచుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారం తింటే వ్యాధులతో పోరాడే శక్తి అందుతుంది.