Blood Group : ఈ బ్లడ్ గ్రూపులు ఉన్న వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలెక్కువట!-this blood group is at a higher risk of heart attack study ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Blood Group : ఈ బ్లడ్ గ్రూపులు ఉన్న వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలెక్కువట!

Blood Group : ఈ బ్లడ్ గ్రూపులు ఉన్న వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలెక్కువట!

HT Telugu Desk HT Telugu
Jun 17, 2022 05:53 PM IST

ప్రపంచవ్యాప్తంగా గుండె(Heart) సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారి పెరుగుతోంది. గుండె సంబంధిత వ్యాధులు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, ఆహారం వంటి ఎన్నో అంశాలు వంటి అంశాలు ఉన్నాయి. ఈ వ్యాధిని ముందుగా గుర్తించడం చాలా కష్టం. అయితే బ్లడ్ గ్రూపు(Blood Group) ద్వారా గుండె జబ్బులను ముందుగానే అంచనా వేయొచ్చని పరిశోధకులు అంటున్నారు.

<p>&nbsp;heart attack</p>
heart attack

A, B, AB, బ్లడ్ గ్రూపులు కలిగిన వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధనలో తెలింది. ఈ అధ్యయనానికి సంబంధించిన పలు విషయాలను సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లుక్వి వెల్లడించారు. A, B లేదా AB బ్లడ్ గ్రూపులు ఉన్న వ్యక్తులకు ఇతర బ్లడ్ గ్రూప్‌ల కంటే ఎక్కువగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపారు.

అధ్యయనం ఎలా జరిగింది

సుమారు 89,550 మంది పెద్దలపై 20 సంవత్సరాల వ్యవధిలో రెండు దీర్ఘకాల పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు... ఇతర వ్యక్తుల కంటే AB బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం 23 శాతం ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. బ్లడ్ గ్రూప్ బి ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 11 శాతంగా.. టైప్ A బ్లడ్ ఉన్నవారికి 5 శాతం గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందిని వెల్లడించారు.

గుండె జబ్బులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు

Group O బడ్ల్ గ్రూప్ కలిగిన వారికి  గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనంలో కనుగొన్నారు. అంతే కాకుండా పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తక్కువ ఉంటాయట. A బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి మాత్రం పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అలాగే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్, (సాధారణంగా కడుపులో కనిపించే బ్యాక్టీరియా) A బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ బ్యాక్టీరియా వాపు, అల్సర్‌లకు కారణమవుతుంది. అదనంగా, AB బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి జ్ఞాపకశక్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చని, A బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ వల్ల ఎక్కువ ప్రమాదం కలిగి ఉంటారని పరిశోధకులు తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం