Mango Recipes । మ్యాంగో టీ, కాఫీ ఏదైనా చేయండి.. మామిడి రుచులతో వేసవిని ఆనందంగా ముగించండి!-delicious mango recipes to end this summer on a sweet note ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mango Recipes । మ్యాంగో టీ, కాఫీ ఏదైనా చేయండి.. మామిడి రుచులతో వేసవిని ఆనందంగా ముగించండి!

Mango Recipes । మ్యాంగో టీ, కాఫీ ఏదైనా చేయండి.. మామిడి రుచులతో వేసవిని ఆనందంగా ముగించండి!

HT Telugu Desk HT Telugu
Jun 08, 2023 05:08 PM IST

Mango Recipes: మామిడిపండ్లతో మీరు రూపొందించగల అద్భుతమైన రెసిపీలను ఇక్కడ తెలుసుకోండి, వీటిని ఇంటి వద్ద మీరూ ప్రయత్నించి ఈ వేసవి కాలాన్ని ఆనందంగా ముగించండి.

Mango Recipes
Mango Recipes (stock pic)

Mango Recipes: మామిడిపండ్ల సీజన్ అయిపోవస్తుంది, కానీ వేడి మాత్రం అలాగే ఉంది. మరి ఈ వేడి తగ్గే వరకు మామిడిపండ్లపై దాడి కొనసాగించాల్సిందే, పండు రుచిని పూర్తిస్థాయిలో ఆస్వాదించాల్సిందే. వేసవిలో రిఫ్రెష్‌గా, చల్లగా ఉండటానికి మామిడి పానీయాలు అద్భుతమైన ఎంపిక. మామిడిపండుకు ఉండే సహజమైన తీపి, క్రీమీ ఆకృతి కారణంగా మామిడిని వివిధ పానీయాలు, డెజర్ట్‌లు, స్మూతీలుగా ఎలా కావాలంటే అలా సిద్ధం చేసుకోవచ్చు. అదనంగా విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు మొదలైన పోషకాలు పొందుతూ మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

మామిడిపండ్లతో మీరు రూపొందించగల అద్భుతమైన రెసిపీలను ఇక్కడ తెలుసుకోండి, వీటిని ఇంటి వద్ద మీరూ ప్రయత్నించి ఈ వేసవి కాలాన్ని ఆనందంగా ముగించండి.

మ్యాంగో స్మూతీ

మామిడిపండు ముక్కలను పెరుగు, పాలు లేదా కొబ్బరి నీళ్లతో కలిపి మీకు నచ్చిన స్వీటెనర్‌తో కలపండి. అంతే మ్యాంగో స్మూతీ రెడీ అవుతుంది. మీరు చల్లని స్మూతీ కోరుకుంటే కొన్ని ఐస్ క్యూబ్‌లను కూడా కలుపుకోవచ్చు.

మ్యాంగో లస్సీ

మామిడిపండు గుజ్జు, పెరుగు, పంచదార, చిటికెడు యాలకుల పొడిని బ్లెండర్‌లో వేసి కలపండి. మృదువుగా వరకు బ్లెండ్ చేయండి, ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేయండి. మీరు తరిగిన పిస్తాపప్పులు లేదా కుంకుమపువ్వుతో కూడా అలంకరించవచ్చు.

మ్యాంగో ఐస్‌డ్ టీ

మ్యాంగో ఐస్‌డ్ టీ తయారు చేసేందుకు మొదటగా కొన్ని నీళ్లలో టీ పొడి వేసి డికాక్షన్ తయారు చేయండి, ఆపై దానిని చల్లబరచండి, ఆపై తాజా మామిడి రసం, కొన్ని ఐస్ క్యూబ్స్ కలపండి. మ్యాంగో ఐస్‌డ్ టీ రెడీ. మరింత రుచికోసం నిమ్మకాయ రసం, స్వీటెనర్ కలుపుకోవచ్చు.

మ్యాంగో ఐస్‌డ్ కాఫీ

ఒక స్ట్రాంగ్ కప్ కాఫీని బ్రూ చేసి చల్లారనివ్వండి. బ్లెండర్‌లో, చల్లబడిన కాఫీ, మామిడి ముక్కలు, పాలు, స్వీటెనర్‌ను కలపండి. బాగా బ్లెండ్ చేసి, ఐస్ వేసి కలపాలి

మ్యాంగో మోజిటో

ఒక గ్లాసులో తాజా పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలను వేయండి. ఆపై మామిడిపండు రసం, ఒక స్ల్పాష్ సోడా నీరు, క్రష్ చేసిన ఐస్ వేసి కలపండి, కావాలనుకుంటే స్వీటెనర్ కలుపుకో మెవచ్చు. మెల్లగా కలుపుతూ, పుదీనా రెమ్మతో అలంకరిస్తే మ్యాంగో మోజిటో రెడీ.

మామిడి కొబ్బరి నీరు

తాజా మామిడి ప్యూరీ, కొబ్బరి నీరు, కొద్దిగా నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలపండి. షేక్ చేయండి లేదా బాగా కదిలించండి, అంతే. ఈ హైడ్రేటింగ్ ట్రాపికల్ డిలైట్ ను చల్లగా సర్వ్ చేయండి.

మ్యాంగో మార్గరీటా

ఒక బ్లెండర్‌లో, తాజా మామిడిపండు ముక్కలు, టేకిలా, నిమ్మరసం, ఆరెంజ్ లిక్కర్, ఐస్ కలపండి. మృదువైనంత వరకు కలపండి, దీనిని సాల్ట్-రిమ్డ్ గ్లాసుల్లో పోయాలి. నిమ్మకాయ ముక్క లేదా మామిడికాయ ముక్కతో అలంకరించండి.

Whats_app_banner

సంబంధిత కథనం