Curd Dosa: మెత్తని పెరుగు దోశెలు ఇలా చేశారంటే కొబ్బరి చట్నీతో అదిరిపోతాయి
Curd Dosa: పెరుగు దోశెలను పుల్లట్లు అని కూడా పిలుస్తారు. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
Curd Dosa: రోడ్ల పక్కన బల్లమీద పుల్లట్లు అమ్ముతూ ఉంటారు. ఆవంటే ఎంతో మందికి ఇష్టం. వాటిని అక్కడే కొనుక్కొని తినక్కర్లేదు, ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇది పెరుగుతో చేసే దోశలు కాస్త పులుపుగా ఉంటాయి. కాబట్టి కొబ్బరి చట్నీతో తింటే చాలా కమ్మగా ఉంటాయి. మెత్తగా ఉండే ఈ దోశలు పిల్లలు బాగా ఇష్టపడతారు. వీటిని తయారు చేయడం చాలా సులువు.
పెరుగు దోశ రెసిపీకి కావలసిన పదార్థాలు
బియ్యం - ఒక కప్పు
అటుకులు - అర కప్పు
పుల్లని మజ్జిగ - ఒక కప్పు
మెంతులు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
పెరుగు దోశ రెసిపీ
1. ఒక గిన్నెలో బియ్యాన్ని, అటుకులను, మెంతులను వేసి శుభ్రంగా కడగాలి.
2. అందులో పుల్లని మజ్జిగ వేసి నానబెట్టాలి.
3. అలా నాలుగు గంటల పాటు నానబెట్టాక వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
4. ఒక గిన్నెలో వేసి బయటనే ఎనిమిది గంటల పాటు వదిలేయాలి.
5. ఆ పిండి పులిసి చక్కగా పుల్లట్లు వస్తాయి. రుచికి సరిపడా ఉప్పును అందులో వేసి కలుపుకోవాలి.
6. స్టవ్ మీద పెనం పెట్టి వీటిని దోశెల్లా వేసుకోవాలి.
7. రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నాక తీసి ప్లేట్లో వేయాలి.
8. అంతే పెరుగు దోశె లేదా పుల్లట్లు రెడీ అయినట్టే. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మెత్తగా ఉంటాయి. కనుక పిల్లలు కూడా సులువుగా తినగలరు. మెత్తగా ఉన్న దోశెలు మనకు తెలియకుండానే ఎక్కువగా తినేస్తాము. నోట్లో పెట్టగానే కరిగిపోయేలా ఉంటాయి ఇవి.