cucumber curd rice: దోసకాయ పెరుగన్నంతో.. పొట్ట నిండుగా, చల్లగా-cooking process of summer special cucumber curd rice ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cucumber Curd Rice: దోసకాయ పెరుగన్నంతో.. పొట్ట నిండుగా, చల్లగా

cucumber curd rice: దోసకాయ పెరుగన్నంతో.. పొట్ట నిండుగా, చల్లగా

Koutik Pranaya Sree HT Telugu
May 13, 2023 12:30 PM IST

cucumber curd rice: మామూలు పెరుగన్నం కన్నా దోసకాయతో పెరుగన్నం ఒకసారి ప్రయత్నించి చూడండి. రుచిలో భిన్నంగా ఉంటుంది. దోసకాయ ఆరోగ్యానికి మంచిది కూడా.

దోసకాయ పెరుగన్నం
దోసకాయ పెరుగన్నం (unsplash)

ఎండాకాలంలో చల్లదనం కోసం ఎలాంటి వంటకాలు చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ చల్లని దోసకాయ పెరుగన్నం ప్రయత్నించండి. కడుపు నిండుగా, చల్లగా ఉంటుంది. 5 నిమిషాల్లో ఈ దోసకాయ పెరుగన్నం సిద్ధమవుతుంది.

కావాల్సిన పదార్థాలు:

1 కప్పు ఉడికించిన అన్నం

1 కప్పు పెరుగు

1 కప్పు కీర దోస తరుగు

1 రెబ్బ కరివేపాకు

2 పచ్చిమిర్చి

తరిగిన కొత్తిమీర కొద్దగా

4 చెంచాల దానిమ్మ గింజలు

2 చెంచాల పల్లీలు

1 చెంచా మిరియాల పొడి

1 చెంచా జీలకర్ర పొడి

సగం టీస్పూన్ ఇంగువ

రెండు స్పూన్ల నెయ్యి

తగినంత ఉప్పు

తయారీ విధానం:

  1. ముందుగా పెరుగును బాగా గిలకొట్టుకోవాలి. దీంట్లో కీరదోస తురుము కలిపి పెట్టుకోవాలి.
  2. దీంట్లో ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి.
  3. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని పొడిపొడిగా చేసుకుని మసాలాలు కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో కలుపుకోవాలి.
  4. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాత్ర పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. వేడయ్యాక జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి , కరివేపాకు, పల్లీలు వేసుకుని వేగనివ్వాలి.
  5. ఈ తాలింపును ముందుగా పెరుగు కలిపి పెట్టుకున్న అన్నంలో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. పైన దానిమ్మ గింజలు వేసుకుంటే సరిపోతుంది.
  6. దీన్ని వేడివేడిగా వడ్డించొచ్చు లేదా కాసేపు ఫ్రిజ్ లో పెట్టుకుని తింటే చల్లగా రుచి బాగుంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. సులువుగా చేసుకోవచ్చు కూడా.

Whats_app_banner