Curd Combinations । పెరుగు తినండి కానీ, పెరుగులో ఇవి కలిపి తినకండి!-curd is healthy when not combine with these foods ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Curd Is Healthy When Not Combine With These Foods

Curd Combinations । పెరుగు తినండి కానీ, పెరుగులో ఇవి కలిపి తినకండి!

HT Telugu Desk HT Telugu
May 12, 2023 11:20 AM IST

Curd Combinations:పెరుగు తినడం ఆరోగ్యకరమే కానీ పెరుగులో కొన్నింటిని కలపకూడదు. పెరుగుతో పాటు కలపకూడని పదార్థాలేమిటో ఇక్కడ తెలుసుకోండి.

Curd Combinations:
Curd Combinations: (Unsplash)

Curd Combinations: ఎండాకాలంలో ప్రతిరోజూ పెరుగు తినడం ఆరోగ్యకరం. పెరుగు మంచి ప్రోబయోటిక్, మీ పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అయితే పెరుగును ఎలాపడితే అలా తినకూడదు. కొన్నిరకాల ఆహార పదార్థాల కలయికలు కూడా ఆరోగ్యానికి చేటు చేస్తాయి. పెరుగులో పండ్లు కలుపుకొని తినవచ్చు, సలాడ్, రైతా వంటివి చేసుకొని తినవచ్చు. కానీ ఇవి చేసే విషయంలో పెరుగులో కొన్నింటిని కలపకూడదు. పెరుగుతో పాటు కలపకూడని పదార్థాలేమిటో ఇక్కడ తెలుసుకోండి.

మామిడి -పెరుగు

మామిడి అనేది వేసవిలో ప్రసిద్ధి చెందిన సీజనల్ ఫ్రూట్. ఇందులో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇతర విలువైన పోషకాలు ఉంటాయి, కానీ మామిడి వేడి గుణాలు కలిగి ఉంటుంది. పెరుగు చలువ గుణాలు కలిగి ఉంటుంది. ఈ రెండింటి కలయిక శరీరంలో వేడి, చల్లని అసమతుల్యతను కలిగిస్తుంది. ఇది చర్మ సమస్యలను కలిగిస్తుంది, చర్మంపై దద్దుర్లు, మొటిమలు ఏర్పడటానికి దారితీస్తుంది. శరీరంలో టాక్సిన్స్ ఉత్పత్తిని పెంచుతుంది.

పెరుగు- పాలు

పాలను పులియబెట్టినపుడు పెరుగు అవుతుంది. కానీ పెరుగు, పాలు కలిపి తీసుకోవడం సరైన కాంబినేషన్ కాదు. ఈ రెండింటిని కలపి తీసుకోవడం వల్ల అసిడిటీ, ఉబ్బరం, గుండెల్లో మంటకు దారితీస్తుంది. విరేచనాలు కూడా కలగవచ్చు. గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను పెంచుతుంది. ఎందుకంటే పాలు భారంగా ఉంటాయి, కడుపు నిండినట్లు అవుతుంది. అయితే పెరుగు తేలికగా , సులభంగా జీర్ణమవుతుంది. అందువల్ల కలిపి తీసుకోవద్దు.

పెరుగు - ఆయిల్ ఫుడ్స్

పెరుగుతో పాటు నెయ్యి, నూనెతో కూడిన ఆహారాలు తీసుకోవద్దు. ఇవన్నీ పరిస్పరం విరుద్ధమైన ఆహారాలు. పెరుగుతో పాటు ఆయిల్ ఫుడ్స్‌ను తీసుకున్నప్పుడు మీ జీర్ణక్రియ నెమ్మదిస్తుంది, నిద్రమత్తు ఎక్కువ ఉంటుంది. దీంతో మీరు రోజంతా మీరు సోమరితనం అనుభూతి చెందుతారు.

పెరుగు - ఉల్లిపాయ

పెరుగు, ఉల్లిపాయలను చాలాసార్లు కలిపి తీసుకుంటారు. కానీ ఈ రెండు కలిపితీసుకుంటే అవి అలెర్జీలను ప్రేరేపిస్తాయి. గ్యాస్, అసిడిటీ, వాంతులను కూడా కలిగిస్తాయి. కారణం పెరుగు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ఉల్లిపాయ దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఫలితంగా, ఈ రెండు ఆహారాలను కలపడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మనలో చాలామంది పెరుగు, ఉల్లిపాయలను కలిపి చేసినా రైతా వంటివి ఎక్కువ తీసుకుంటారు. కానీ ఇది మంచిది కాదు.

చేపలు- పెరుగు

మాంసాహారం వండేటపుడు మాంసాన్ని పెరుగుతో మెరినేట్ చేస్తారు. కానీ చేపలు, సీఫుడ్ లతో పెరుగును కలపకూడదు. పెరుగు- చేపలు కలిపి తీసుకోవడం వలన ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశం ఉంటుంది .

WhatsApp channel

సంబంధిత కథనం