Chilli Cheese Toast Recipe । అర్ధరాత్రి ఆకలేస్తే.. అప్పటికప్పుడే చిల్లీ టోస్ట్ చేసుకు తినేయండి!
Chilli Cheese Toast Recipe: అందుబాటులో ఉన్న కొన్ని పదార్ధాలతో సులభంగా తయారు చేయగలిగే అనేక మిడ్ క్రేవింగ్ స్నాక్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. చిల్లీ చీజ్ టోస్ట్ రెసిపీ ఇదిగో.
రాత్రిపూట డిన్నర్ చేయడం మిస్ అయితే అలాగే నిద్రపోకండి, ఎందుకంటే నడి రాత్రిలో మీకు బాగా ఆకలి వేస్తుంది. ఇలా ఆకలితో మీరు సరిగ్గా నిద్రపోలేరు. ఈ సమయంలో బయట నుంచి ఏదీ ఆర్డర్ చేసుకోలేరు, ఒకవేళ ఆర్డర్ చేసినా, అది మీ చేతికి వచ్చే సరికి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేయొచ్చు. ఈ సమయంలో మీ ఫ్రిజ్‌లో వెతికి ఏదో ఒకటి తినే బదులు, మీ ఆకలిని తీర్చుకోవడానికి ఏదైనా తయారు చేసుకోవడం మేలు.
మీరు ఏ సమయంలోనైనా అందుబాటులో ఉన్న కొన్ని పదార్ధాలతో సులభంగా తయారు చేయగలిగే అనేక మిడ్ క్రేవింగ్ స్నాక్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. అందులో ఒక రెసిపీని మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాం.
చిల్లీ చీజ్ టోస్ట్ అర్ధరాత్రి స్నాక్స్‌గా చాలా మంది ఎంచుకునే అల్పాహారం. ఈ రెసిపీని మీరు కేవలం 10-15 నిమిషాల్లో సిద్ధం చేసుకొని తినేయచ్చు, మరి చిల్లీ చీజ్ టోస్ట్ తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి.
Chilli Cheese Toast Recipe కోసం కావలసినవి
- 6 శాండ్‌విచ్ బ్రెడ్ ముక్కలు
- 4 టేబుల్ స్పూన్ల వెన్న
- 2-3 ఎర్ర మిరపకాయలు -
- ఉప్పు - 1 స్పూన్
- 200 గ్రా తురిమిన చీజ్
- 2-3 వెల్లుల్లి ముక్కలు
- 1 tsp రెడ్ చిల్లీ ఫ్లేక్స్
చిల్లీ చీజ్ టోస్ట్ తయారీ విధానం
- ముందుగా బ్రెడ్‌కు ఒక వైపు మాత్రమే వెన్నను పూయండి.
- ఆపైన సన్నగా తరిగిన మిరపకాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలను బ్రెడ్ మీద చల్లాలి.
- తర్వాత కొంచెం ఉప్పు చల్లుకొని, చీజ్ తురుముకోవాలి.
- చివరగా మీద నుంచి చిల్లీ ఫ్లేక్స్ చల్లుకోవాలి.
- ఇప్పుడు లోతైన పెనంలో కొద్దిగా నూనె లేదా వెన్న వేడి చేసి అందులో బ్రెడ్ ముక్కలు ఉంచాలి, మూతపెట్టి తక్కువ మంటపై ఉడికించాలి. అంతే చిల్లీ చీజ్ టోస్ట్ రెడీ.
మీరు దీనిని పెనంలో కాకుండా ఒవెన్‌లో కూడా బేక్ చేయవచ్చు. ముందుగా ఒవెన్‌ను 200 డిగ్రీ సెల్సియస్ ప్రీహిట్ చేసి 4-5 నిమిషాలు బేక్ చేస్తే సరి.
సంబంధిత కథనం