Egg Paratha Recipe | బ్రేక్‌ఫాస్ట్‌లో కోడిగుడ్డు పరాఠా.. తింటే ఎంతో ఆరోగ్యమట!
Egg Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ లో ఎగ్ పరాఠా తినడం చాలా బలవర్థకమైన ఆహారం అని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. ఎగ్ పరాఠా ఎలా చేయవచ్చో ఇక్కడ రెసిపీ ఉంది చూడండి.
శీతాకాలంలో గుడ్లు తినడం చాలా ఆరోగ్యకరం. గుడ్లు నాణ్యమైన ప్రోటీన్లకు పవర్‌హౌస్ లాంటివి. ఒక గుడ్డులో 13 విభిన్న విటమిన్లతో పాటు, మినరల్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మీ మొత్తం మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను ఆరోగ్యంగా ఉంచడానికి గుడ్లు సరైన ఆహారం. ఆరోగ్యకరమైన మెదడు పనితీరుకు కూడా గుడ్లు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముంబైలోని క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో న్యూట్రిషనిస్ట్ అయిన జాగృతి శీతాకాలంలో గుడ్లను ఆహారంగా తప్పకుండా తీసుకోవాలని సూచించారు. గుడ్లు జింక్‌కి మూలం, జలుబు లేదా ఫ్లూ వంటి సాధారణ శీతాకాల వ్యాధులతో పోరాడడంలో సహాయపడతాయి. మీ రోగనిరోధక శక్తి అంతగా లేనప్పుడు, గర్భధారణ సమయంలో ఇవి మీకు మంచి బలాన్ని అందిస్తాయి. శీతాకాలంలో రక్తంలో pH తగ్గుతుంది, గుడ్లు రక్తంలో pHని పెంచడంలో సహాయపడతాయి, తద్వారా మీరు లోపలి నుండి వెచ్చగా ఉండేలా చేస్తుంది.అలాగే, గుడ్డులో విటమిన్ B6, B12 ఎక్కువ ఉంటాయి. ఈ రెండు విటమిన్లు రోగనిరోధక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో పాత్ర పోషిస్తాయి. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ కోసం అయినా ఎప్పుడైనా గుడ్లు తినవచ్చు.
బ్రేక్‌ఫాస్ట్ కోసం మీరు ఎగ్ పరాఠా తినడం చాలా బలవర్థకమైన ఆహారం అని న్యూట్రిషనిస్ట్ జాగృతి సూచించారు. ఎగ్ పరాఠా ఎలా చేయవచ్చో ఇక్కడ రెసిపీ ఉంది చూడండి.
Egg Paratha Recipe కోసం కావలసినవి
- 2 గుడ్లు
- 1 కప్పు గోధుమ పిండి
- 1 టేబుల్ స్పూన్ నూనె/నెయ్యి
- 1/4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- 1/4 స్పూన్ ధనియాల పొడి
- 1/4 టీస్పూన్ కారం
- తరిగిన పచ్చి మిరపకాయలు
- తరిగిన ఉల్లిపాయలు
- ఉప్పు రుచికి తగినట్లుగా
ఎగ్ పరాఠా తయారీ విధానం
- ముందుగా పిండిలో కొన్ని నీళ్లు కలుపుకొని చపాతీ పిండిలాగా ముద్దగా చేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో, రెండు గుడ్లు పగలగొట్టి, పైన పేర్కొన్న మసాలా దినుసులు, తాజాగా తరిగిన పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు వేసి, నురుగు వచ్చేవరకు బాగా కలుపుతూ ఉండండి.
- పాన్‌ను వేడి చేసి నెయ్యితో గ్రీజుగా చేయండి, అదే సమయంలో చపాతీలా చేయడానికి పిండిని కొంచెం మందంగా రోల్ చేయండి. పాన్ మీద ఈ చపాతీ వేసి, రెండు వైపులా కాల్చండి.
- సగం కాల్చిన తర్వాత చపాతీ పొరలు కొద్దిగా తెరుచుకుంటాయి, ఇప్పుడు జాగ్రత్తగా చపాతీ పొరలలో గుడ్డు మిశ్రమం పోయాలి.
- ఇప్పుడు రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు కాల్చాలి.
రుచికరమైన గుడ్డు పరాఠా / ఎగ్ పరాఠా తినడానికి సిద్ధంగా ఉంది. టీ తాగుతూ రుచిని ఆస్వాదించండి.
సంబంధిత కథనం