Beetroot Paratha Recipe । బ్రేక్‌ఫాస్ట్‌లో బీట్‌రూట్‌ పరాఠా.. రుచికి, ఆరోగ్యానికి దీనిని బీట్ చేసేది లేదు!-beetroot paratha breakfast to reboot your system in the morning recipe here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /   Beetroot Paratha Breakfast To Reboot Your System In The Morning, Recipe Here

Beetroot Paratha Recipe । బ్రేక్‌ఫాస్ట్‌లో బీట్‌రూట్‌ పరాఠా.. రుచికి, ఆరోగ్యానికి దీనిని బీట్ చేసేది లేదు!

HT Telugu Desk HT Telugu
Oct 23, 2022 07:58 AM IST

పిండిలో బీట్‌రూట్‌ను కలిపి బీట్‌రూట్ పరాఠా చేసుకుంటే రంగు, రుచి, ఆరోగ్యం ఈ మూడూ మీ సొంతం. Beetroot Paratha Recipe ఇక్కడ ఉంది చూడండి.

Beetroot Paratha Recipe
Beetroot Paratha Recipe (Slurrp)

పరాఠాలు సాయంత్రం సమయంలోనే కాదు, ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్ చేయటానికి కూడా ఎంతో బాగుంటాయి. లంచ్ లో కూడా తినవచ్చు. పరాఠాలు చేయటానికి చాలా తక్కువ పదార్థాలు అవసరం అవుతాయి, త్వరగానూ తయారవుతాయి. ఇంకా ఇవి తినటానికి కూరలు, చట్నీలు లేకపోయినా, అలాగే తినటానికి రుచిగానూ ఉంటాయి. ఎంతో బలమైన ఆహారం కూడా.

గోధుమపిండిని నీటితో కలిపి ముద్దగా చేసి, అందులో మన మనసుకు నచ్చిన ఫిల్లింగ్‌తో స్టఫ్ చేసి, రోల్ చేసి, తవాపై తేలికగా రోస్ట్ చేసి వేడివేడిగా తింటూ ఉంటే వెచ్చని రుచిని ఆస్వాదించవచ్చు. రెగ్యులర్ పరాఠాలను మరింత పోషకభరితం చేసేలా బీట్‌రూట్‌ను కలిపి బీట్‌రూట్ పరాఠా చేసుకుంటే రుచిలో, ఆరోగ్యంలో ఈ రెసిపీని బీట్ చేసేది వేరే ఏది ఉండదు. మరి స్పెషల్ గులాబీ రంగు పరాఠాలు చేయటానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకోండి. బీట్‌రూట్ పరాఠా రెసిపీని ఇక్కడ చూడండి.

Beetroot Paratha Recipe కోసం కావలసినవి

  • 1 కప్పు గోధుమ పిండి
  • 1 టేబుల్ స్పూన్ నెయ్యి
  • 1 బీట్‌రూట్
  • మిరియాల పొడి
  • కారం
  • ఉప్పు రుచికి తగినంత

బీట్‌రూట్ పరాఠా రెసిపీ- తయారీ విధానం

  1. ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి, ఒక టీస్పూన్ ఉప్పు, నెయ్యి తీసుకోవాలి. ఆపై గోరువెచ్చని నీళ్లతో ఈ పిండిని కలపాలి.
  2. మెత్తని పిండి ముద్దగా చేసి ఒక 15 నిమిషాలు దీనిని పక్కన పెట్టండి. ఈలోపు ఫిల్లింగ్‌ను సిద్ధం చేయండి.
  3. ఒక గిన్నెలో బీట్‌రూట్‌ను తురుముగా చేయండి. ఈ తురుములో ఉప్పు, కారం, మిరియాల పొడి కలపండి.
  4. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పిండి ముద్దను చిన్నచిన్న ముద్దలుగా చేసుకొని అందులో బీట్‌రూట్‌ మిశ్రమం నింపండి.
  5. ఆపై రోల్ చేసి, పెనం మీద పరాఠాలుగా కాల్చండి. కొంచెం క్రిస్పీగా, ముదురు రంగు వచ్చేవరకు కాల్చాలి.

అంతే బీట్‌రూట్‌ పరాఠా రెడీ, వేడివేడి చాయ్ తాగుతూ ఈ పరోటాలను ఆస్వాదించండి.

WhatsApp channel

సంబంధిత కథనం