Makhana Kaju Kheer Recipe : జీడిపప్పు.. మఖానా ఖీర్.. దీపావళి స్పెషల్ రెసిపీ..-today diwali special recipe makhana kaju kheer here is the making process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Today Diwali Special Recipe Makhana Kaju Kheer Here Is The Making Process

Makhana Kaju Kheer Recipe : జీడిపప్పు.. మఖానా ఖీర్.. దీపావళి స్పెషల్ రెసిపీ..

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 21, 2022 07:13 AM IST

Makhana Kaju Kheer Recipe : ఈ మధ్య కాలంలో మఖానాను చాలామంది తమ డైట్లో భాగం చేసుకుంటున్నారు. ఇది హెల్త్​కి చాలా మంచిదని చెప్తున్నారు. మొదట్లో ఇది నార్త్ వాళ్లు మాత్రమే ఎక్కువ చేసుకునేవాళ్లు. అయితే దీని హెల్త్ బెనిఫిట్స్ తెలిసిన ప్రతి ఒక్కరూ వీటిని తీసుకుంటున్నారు. దీనిని స్వీట్​గా కూడా తీసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా?

మఖానా కాజు ఖీర్
మఖానా కాజు ఖీర్

Makhane Kaju Kheer Recipe : పండుగ సమయాల్లో మీరు తయారు చేసే స్వీట్స్ హెల్తీగా కూడా ఉండాలంటే.. మఖానాతో చేసే ఓ అద్భుతమైన రెసిపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీడిపప్పు, మఖానేతో తయారు చేసే.. ఖీర్.. మీ పండుగను అద్భుతంగా మార్చేస్తుంది. మరి ఈ రెసిపీని ఏవిధంగా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* మఖానా - 1 కప్

* జీడిపప్పు - 1 కప్

* పాలు - అర లీటర్

* నెయ్యి - 2 టేబుల్ స్పూన్స్

* ఖోయా - 3 టేబుల్ స్పూన్లు

* చక్కెర - అరకప్పు (గ్రైండ్ చేయండి)

* ఏలకుల పొడి - పావు టీస్పూన్

* బాదం - 1 టేబుల్ స్పూన్ (తరిగినది)

* పిస్తా - 1 టేబుల్ స్పూన్ (తరిగినది)

తయారీ విధానం

ముందుగా స్టౌవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ తీసుకోండి. దానిని స్టౌవ్ మీద పెట్టి.. నెయ్యి వేసి వేడి చేయండి. మరో పాన్​లో పాలు మరిగించండి. మొదటి పాన్‌లో నెయ్యి వేడి అవ్వగానే.. మఖానా, జీడిపప్పును వేసి ఫ్రై చేయండి. పాలల్లో ఖోయా, చక్కెర వేసి తక్కువ వేడి మీద మరిగించాలి. అనంతరం మఖానా, కాజు వేసి కలపాలి. లేదంటే జీడిపప్పును గ్రైండ్ చేసి ఆ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మిశ్రంలో యాలకుల పొడి, బాదం, పిస్తా వేసి బాగా కలపాలి. అంతే ఖీర్ రెడీ. దీనిని స్టౌవ్ మీద నుంచి దించేసి.. గది ఉష్ణోగ్రతకు, రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకుని.. చల్లగా మారిన తర్వాత తినవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్