Chanakya Niti Telugu : మీ భార్యలో ఈ 6 లక్షణాలు ఉంటే జర పైలం
Chanakya Niti Telugu : చాణక్యుడు భార్యాభర్తల గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. వివాహ సంబంధంలో స్త్రీ పురుషులు ఎలా ఉండాలో వివరించాడు. చాణక్య నీతి శాస్త్రంలో చెప్పిన విషయాలను ఇప్పటికీ పాటించేవారూ ఉన్నారు.
వివాహం ఒక అద్భుతమైన సంబంధం. వివాహం తర్వాత, ఒక స్త్రీ తన భర్త కుటుంబ ఆనందానికి బాధ్యత వహిస్తుంది. భార్య తన భర్త ఇంట్లోకి కోడలిగా మాత్రమే ప్రవేశించదు. కాబట్టి వివాహిత స్త్రీ ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. భార్య సత్ప్రవర్తన కలిగి ఉంటే, ఆమె చెడు స్వభావం గల వ్యక్తిని కూడా మార్చగలదు. తన భర్త వైఫల్యాలను విజయాలుగా మార్చే శక్తి భార్యకు ఉందని నమ్ముతారు.
కానీ భార్య ప్రవర్తన అస్థిరంగా ఉంటే, కుటుంబంలోని ప్రతి ఒక్కరూ దాని పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుంది. వారి వైవాహిక జీవితం అశాంతిగా మారుతుంది. భార్యకు చెడ్డ స్వభావాలు ఉంటే ఆమెను మార్చుకోవాలి. లేదంటే చాలా సమస్యలు వస్తాయని చాణక్యుడు చెప్పాడు. భార్య సరిగా ఉంటే.. ఇంట్లో ధనలక్ష్మి ఉంటుందనేది చాణక్యుడి అభిప్రాయం. భార్యే ఇంటిని కాపాడే.. దేవత.
చాణక్యుడు ప్రకారం, కొంతమంది భార్యలు తమ మాటలను అదుపులో ఉంచుకోరు. ఏది పడితే అది మాట్లాడేస్తారు. దీంతో ఇంట్లో చికాకులు వస్తాయి. చాలా కఠినమైన పదాలను ఉపయోగించి భర్త మనసుకు హాని చేస్తుంది. అలాంటి భార్యతో మీ జీవితాన్ని గడపడం మిమ్మల్ని పాడు చేస్తుంది. ఎందుకంటే అలాంటి భార్యతో మీ కుటుంబ బంధం సరిగా ఉండదు. అలాంటి వారు ఇతరుల భావాలను పట్టించుకోరు.
కోపం అనేది సహజమైన మానవ భావోద్వేగం. కానీ అనవసరంగా కోపగించుకున్నప్పుడు, ఆమె చుట్టూ ఉన్నవారికి జీవితం కష్టం అవుతుంది. అందుకే చాణక్యుడు తన సంతోషం కోసం కోపగించుకునే భార్యతో జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. ఆమె కోపం తగ్గేందుకు ప్రయత్నాలు చేయాలని వివరించాడు.
ఇంట్లో గొడవలు సృష్టించే భార్యతో కలిసి జీవించడం వల్ల శాంతి ఉండదు. భార్యకు ఉండే ఈ ప్రవర్తనతో పరిణామాలను మొత్తం కుటుంబం అనుభవించవలసి ఉంటుంది. ఎందుకంటే అలాంటి స్త్రీలు తమ పిల్లలకు మంచి లక్షణాలను నేర్పించలేరు. పిల్లల జీవితాలు కూడా పాడైపోతాయి. ఇంట్లో ఎప్పుడూ అశాంతి ఉంటుంది.
చాణక్యుడు ప్రకారం, స్త్రీలు తమ స్వలాభం కోసం అబద్ధాలు చెబుతారు. చాణక్యుడు చెప్పిన ప్రకారం, ఈ అలవాటు చిన్నప్పటి నుండి కొంతమందికి ఉంటుంది. కొన్ని పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి మహిళలు అబద్ధాలు చెప్పడానికి వెనుకాడరు. అలాంటి మహిళలు ద్రోహం చేయడానికి వెనుకాడరనేది చాణక్యుడి మాట. అందుకే మీ భార్య నిజాలు మాట్లాడేలా చేసుకోండి. అప్పుడే మీరు ఆనందంగా ఉంటారు.
కొంతమంది భార్యలు భర్తలను మోసం చేస్తారు. తాత్కలికంగా వారు ఆనందం పొందుతున్నా.. దీర్ఘకాలంలో చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబంపై భారం పడుతుంది. చాణక్యుడు ప్రకారం, కొంతమంది స్త్రీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరులను తీపి కబుర్లు చెబుతారు. వారికి అవసరమైనప్పుడు మాత్రమే తియ్యగా మాట్లాడుతారు. కొన్నిసార్లు.. అవసరం తీరిపోయాక పట్టించుకోరు. తమకు కావాల్సిన దానికోసం ఏదైనా చేసేందుకు కొందరు రెడీగా ఉంటారు. అలాంటి భార్యతో జాగ్రత్తగా ఉండాలి. వారిని మార్చుకోవాల్సిన బాధ్యత భర్తదే.
స్త్రీలు ప్రతి విషయాన్ని చక్కగా నిర్వహించుకుంటారు. ఈ లక్షణం చాలా మంది మహిళల్లో ఉన్నప్పటికీ, ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరిక మహిళల్లో ఉంటుంది. స్త్రీలకు పురుషుల కంటే అత్యాశ ఎక్కువ. అయితే డబ్బును ఎలా ఖర్చు చేయాలో నిర్వహించే విషయంలో మహిళలు గ్రేట్. ఈ విషయం వరకూ ఓకే కానీ.. కొందరు అత్యాశతో ఉంటారు. డబ్బు ఎలాగైనా సంపాదించాలనుకుంటారు. ఇలా ఉంటే.. కుటుంబం చాలా సమస్యల్లోకి వెళ్తుంది.