Baby Carrots: బేబీ క్యారెట్లు తినడం ద్వారా మీ చర్మపు రంగును పెంచుకోవచ్చా? చర్మాన్ని మెరిపించుకోండిలా-can eating baby carrots improve your skin tone make the skin glow ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Baby Carrots: బేబీ క్యారెట్లు తినడం ద్వారా మీ చర్మపు రంగును పెంచుకోవచ్చా? చర్మాన్ని మెరిపించుకోండిలా

Baby Carrots: బేబీ క్యారెట్లు తినడం ద్వారా మీ చర్మపు రంగును పెంచుకోవచ్చా? చర్మాన్ని మెరిపించుకోండిలా

Haritha Chappa HT Telugu
Sep 05, 2024 09:30 AM IST

Baby Carrots: బేబీ క్యారెట్లు మార్కెట్లో ఎక్కువగానే దొరుకుతాయి. ఇవి సాధారణ క్యారెట్లతో పోలిస్తే జ్యూసీగా ఉంటాయి. వారానికి మూడు సార్లు ఈ క్యారెట్లు పచ్చిగా తింటే మీ చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

బేబీ క్యారెట్లు తినడం వల్ల లాభాలు
బేబీ క్యారెట్లు తినడం వల్ల లాభాలు (Pixabay)

క్యారెట్లు చూడగానే నోరూరించేలా ఉంటాయి. క్యారెట్లలో ఒక రకం బేబీ క్యారెట్లు. ఇవి పొట్టిగా, జ్యూసీగా ఉంటాయి. సాధారణ క్యారెట్ల కన్నా ఇవి కాస్త తీపిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో శరీరపోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో అవసరం. ఈ విషయం మేము చెప్పడం కాదు… తాజా అధ్యయనం కూడా చెబుతోంది. సామ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మేరీ హార్పర్ సిమన్స్ నేతృత్వంలోని ఈ అధ్యయనం చేశారు. బేబీ క్యారెట్లు తినడం వల్ల ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చని అధ్యయనం తేల్చింది.

స్కిన్ కెరోటినాయిడ్ల స్థాయిలు పెరగడం

బేబీ క్యారెట్లను రోజుకొకటి తింటే ఎంతో ఆరోగ్యం. వారానికి కనీసం మూడు సార్లు వీటిని అల్పాహారంగా తీసుకోవచ్చు. యువత రోజూ బేబీ క్యారెట్లు తినడం వల్ల చర్మ కెరోటినాయిడ్ల స్థాయిలను పెంచడంలో సహాయపడతాయని న్యూట్రిషన్ 2024 కాన్ఫరెన్స్‌లో అధ్యయనం నివేదిక చెబుతోంది. క్యారెట్లలో ఉన్న అధిక కెరోటినాయిడ్ స్థాయిలు, యాంటీఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం వచ్చే అవకాశం తగ్గించడానికి సహాయపడుతుంది. స్కిన్ కెరోటినాయిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంమొత్తం రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇవి సహాయపడతాయి.

అందమైన మెరిసే చర్మం కోసం ప్రతిరోజూ పండ్లు, కూరగాయలతో పాటూ బేబీ క్యారెట్లు తినడం అలవాటు చేసుకోండి. ప్రతి రోజూ క్యారెట్లు తినడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది. నలుపుగా ఉన్న తెల్లగా మారిపోరు కానీ, చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. చూడగానే చర్మం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కాబట్టి బేబీ క్యారెట్లు ప్రతిరోజూ రెండు తినడం అలవాటుగా మార్చుకోండి.

కెరోటినాయిడ్లు ఎందుకు అవసరం?

పండ్లు, కూరగాయలలో ప్రకాశవంతమైన ఎరుపు, నారింజ, పసుపు రంగులకు కెరోటినాయిడ్లు బాధ్యత వహిస్తాయి. పండ్లు, కూరగాయలలో కెరోటినాయిడ్లు అధికంగా ఉంటాయి. బేబీ క్యారెట్లను క్రమం తప్పకుండా తినే వ్యక్తులలో వారి చర్మ కెరోటినాయిడ్ స్థాయిలు 10 శాతం పెరిగాయని అధ్యయనం చూపించింది. బేబీ క్యారెట్లు, మల్టీ విటమిన్లను రోజూ వినియోగించే వారిలో చర్మం కెరోటినాయిడ్ స్థాయిలు 21 శాతం పెరుగుతాయి.

బీటా కెరోటిన్ కలిగిన మల్టీవిటమిన్ తీసుకోవడం చర్మ కెరోటినాయిడ్ స్థాయిలను పెంచడంలో సహాయపడదని అధ్యయనం పేర్కొంది . అలా బీటా కెరాటిన్ కోసం విటమిన్ మాత్రలు వేసే బదులు బేబీ క్యారెట్లను తింటే సరిపోతుంది. బోలెడన్నీ పోషకాలు అందుతాయి.

రోజుకో క్యారెట్ తినడం వల్ల కంటి చూపు సమస్యలు కూడా తగ్గుతాయి. రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. హైబీపీతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ క్యారెట్ తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. షుగర్ పేషెంట్లకు కూడా ఇది మేలు చేసే ఆహారమే. క్యారెట్లు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. బరువు తగ్గేవారి ఇది ఉత్తమ ఆహారం. క్యారెట్లను వండకుండా నేరుగా తింటేనే అన్ని పోషకాలు అందుతాయి.

క్యారెట్లలో ఉండే ఫైబర్ త్వరగా పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తుంది. అందుకే ఇతర ఆహారాలు తినాలనిపించదు. కాబట్టి ఇతర ఆహారాలు తినకుండా ఉంటారు. అలాగే క్యారెట్లు తినడం వల్ల జంక్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలనే కాంక్ష పెరుగుతుంది.