Fruits for kidneys: ఈ 5 పండ్లు తింటే ఒంట్లో ఉన్న విషాలన్నీ బయటకే.. కిడ్నీ ఆరోగ్యం పెంచే పండ్లు ఇవే-eat these 5 fruits regularly for better kidneys health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fruits For Kidneys: ఈ 5 పండ్లు తింటే ఒంట్లో ఉన్న విషాలన్నీ బయటకే.. కిడ్నీ ఆరోగ్యం పెంచే పండ్లు ఇవే

Fruits for kidneys: ఈ 5 పండ్లు తింటే ఒంట్లో ఉన్న విషాలన్నీ బయటకే.. కిడ్నీ ఆరోగ్యం పెంచే పండ్లు ఇవే

Fruits for kidneys: మూత్రపిండాలు దెబ్బతినకుండా ఉండాలంటే సరైన ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచే 5 పండ్లు తప్పకుండా ఆహారంలో చేర్చుకోండి.

కిడ్నీ ఆరోగ్యం పెంచే పండ్లు (Shutterstock )

మూత్రపిండాలు శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం. అది పనిచేసే విధానంలో ఏదైనా సమస్య ఉంటే, అది అంతర్గత ఆరోగ్యానికి సమస్య కావచ్చు. శరీరంలోని విషాన్ని తొలగించి శరీరాన్ని అనేక వ్యాధులకు దూరంగా ఉంచడమే కిడ్నీ పని. ఈ విష పదార్థాలు బయటకు రాకపోతే కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, కిడ్నీ స్టోన్స్ వంటి సమస్యలు వస్తాయి. మూత్రపిండాలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, బలంగా ఉండాలనుకుంటే ఈ 5 పండ్లు తినడం ప్రారంభించండి. మూత్రపిండాల ఆరోగ్యానికి అధిక యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, తక్కువ పాస్ఫరస్, సోడియం ఉన్న పండ్లను తినడం మంచిది.

దానిమ్మ పండు:

ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అదే సమయంలో ఇది కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిదే. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. పాస్ఫరస్, సోడియం తక్కువగా ఉంటుంది.

ఆపిల్స్:

ఆపిల్స్‌లో పొటాషియం, పాస్ఫరస్ కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి ఉత్తమమైన పండుగా పరిగణించబడుతుంది. మీకు మలబద్ధకం లక్షణాలు ఉంటే, మీరు పచ్చి ఆపిల్స్ లేదా ఉడకబెట్టిన ఆపిల్స్ కూడా తినవచ్చు. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది.

నారింజ:

నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లను తినడం చాలా మంచిది. అవి విటమిన్ సి కి మంచి మార్గాలు. అదే సమయంలో, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించడంలో ఇవి సహాయపడతాయి. రోగ నిరోధక శక్తినీ పెంచుతాయివి.

బొప్పాయి:

మూత్రపిండాలకు, జీర్ణక్రియకు చాలా బొప్పాయి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బొప్పాయిలో ఫైబర్ కూడా ఉంటుంది.

బెర్రీలు:

బెర్రీలు మూత్రపిండాలకు చాలా మంచివిగా భావిస్తారు. వీటిలో సోడియం, ఫాస్పరస్ తక్కువగా ఉంటాయి. స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలలో విటమిన్ సి, మాంగనీస్, ఫోలేట్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది.