Acne Problem: మీకు మొటిమలు రావడానికి కారణం రక్తపరీక్ష ద్వారా తెలిసే అవకాశం, త్వరలోనే అమల్లోకి ఈ రక్తపరీక్ష
Acne Problem: మొటిమల సమస్య యువతను తీవ్రంగా వేధిస్తున్న సమస్య. ఒక్కొక్కరికీ ఒక్కో కారణం వల్ల మొటిమలు వస్తాయి. దాని కారణాన్ని రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.
మొటిమలు… ఎంతోమందిని కౌమారదశ నుంచి పెద్దల వరకు బాధిస్తున్న సమస్య. ఈ మొటిమలు తగ్గడానికి ఓవర్ ది కౌంటర్ క్రీముల నుండి ప్రిస్క్రిప్షన్ మందుల వరకు ఎన్నో చికిత్సలను ప్రయత్నిస్తారు. ఏదేమైనా, ఈ చర్మవ్యాధి ఎందుకు వస్తుందో తెలుసుకుంటే… దానికి చికిత్స చేయడం సులభం అవుతుంది. ఎప్పుడైతే మూలం తెలుస్తుందో… దాన్ని ఎలా తగ్గించాలో వైద్యులకు అర్థమవుతుంది.
సాధారణంగా మొటిమలు హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల, చర్మంలో అధిక నూనె ఉత్పత్తి వల్ల, చర్మంపై బ్యాక్టీరియా పెరుగుదల వల్ల వస్తాయి. ఇవే ప్రధాన కారకాలుగా చెప్పుకుంటారు. వీటితో పాటూ చర్మం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. ఆ కారణాలు తెలుసుకోవడానికి ఒక సాధారణ రక్త పరీక్ష రాబోతోంది. మొటిమలు రావడానికి అంతర్లీన కారణాలను కనుగొనడంలో ఈ పరీక్ష సహాయపడుతుంది.
ఈ రక్తపరీక్షలో కాంప్రహెన్సివ్ మెటబాలిక్ ప్యానెల్ (సిఎంపి) ఒకటి అని వైద్యులు చెబుతున్నారు. "ఈ పరీక్ష గ్లూకోజ్ స్థాయిలు, ఎలక్ట్రోలైట్లు, మూత్రపిండాల పనితీరుతో సహా రక్తంలోని వివిధ పరీక్షలను అంచనా వేస్తుంది. వీటికి మొటిమలతో సంబంధం లేనప్పటికీ, వీటిలోని అసాధారణతలు చర్మ సమస్యలకు మూల కారణాన్ని కనిపెట్టేందుకు సహకరిస్తాయి. రక్త పరీక్ష వెల్లడించగల మరొక విషయం ఏమిటంటే, మీకు మీ శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ ఉందో లేదో కూడా తేల్చేస్తుంది. ఇన్ ఫ్లమ్మేషన్ అనేది గాయం లేదా సంక్రమణకు మీ శరీరం నుంచి వచ్చే ఒక సహజ ప్రతిస్పందన. కానీ ఇది నియంత్రణలో లేనప్పుడు, మొటిమలు వంటివి వస్తాయి.
ఈ రక్త పరీక్ష ద్వారా ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లు లేదా ఖనిజాలు లోపించినా తెలిసిపోతుంది. ఉదాహరణకు, విటమిన్ డి లోపించినా కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంది. మీ రక్త పరీక్ష ద్వారా పోషకాహారం లోపం బయటపడుతుంది. దాన్ని బట్టి మీ చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడటానికి మీ డాక్టర్ సప్లిమెంట్లను సిఫారసు చేయవచ్చు.
రక్త పరీక్ష మీ మొటిమల కారణాన్ని ఎలా కనిపెడుతుందో వివరిస్తున్నారు వైద్యులు.
1. మొటిమల వల్గారిస్: టీనేజీ యువతలో సంభవించే సాధారణ సమస్యలు మొటిమలు. సాధారణంగా 9-30 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా మొటిమలు రావచ్చు. కాబట్టి వారికి మొటిమలు వచ్చినా రక్త పరీక్ష అవసరం లేదు. తరువాత అవి ఎలాగూ తగ్గిపోతాయి.
2. హార్మోన్ల మొటిమలు: పెద్దల్లో మొటిమలు రావడాన్ని ‘యాక్నే టార్డా’ (30 సంవత్సరాల వయస్సు తర్వాత మొటిమలు ప్రారంభమవుతాయి) అంటారు. దీన్ని సమస్యగానే పరిగణించవచ్చు. ఇవి రావడానికి కారణాన్ని కనుగొనేందుకు రక్త పరీక్ష అవసరం. సాధారణ పరీక్షలలో స్త్రీ హార్మోన్లు, పురుష హార్మోన్లు, ఆండ్రోజెన్లు, ఇన్సులిన్ నిరోధకత, థైరాయిడ్ వంటి హార్మోన్లను చెక్ చేస్తారు. ఈ పరీక్షలు చర్మవ్యాధి నిపుణుడికి హార్మోన్ల అసమతుల్యత మూల కారణాన్ని కనుగొనడంలో సహాయపడతాయి.
3. తక్కువ విటమిన్ డి: శరీరంలో విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్నా కూడా మొటిమలు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. రక్త పరీక్షల్లో విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్నట్టు తేలితే విటమిన్ డి క్యాప్సూల్ ఇస్తారు.
టాపిక్