Cabbage Pulao: సులువుగా చేసే క్యాబేజీ పులావ్ రెసిపీ, లంచ్ బాక్స్‌కి మంచి ఎంపిక-cabbage pulao recipe in telugu know how to make cabbage rice ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cabbage Pulao: సులువుగా చేసే క్యాబేజీ పులావ్ రెసిపీ, లంచ్ బాక్స్‌కి మంచి ఎంపిక

Cabbage Pulao: సులువుగా చేసే క్యాబేజీ పులావ్ రెసిపీ, లంచ్ బాక్స్‌కి మంచి ఎంపిక

Haritha Chappa HT Telugu
Feb 07, 2024 11:45 AM IST

Cabbage Pulao: క్యాబేజీ కూర తినాలంటే బోర్ కొడుతుందా? అయితే ఒకసారి క్యాబేజీ పులావ్ నే చేసుకుని చూడండి. క్యాబేజీ పులావ్ లేదా క్యాబేజీ రైస్ మీరు ఎలా పిలుచుకున్నా.. ఇది రుచిలో మాత్రం అదిరిపోతుంది. ఆరోగ్యానికి మంచిది.

క్యాబేజీ పులావ్ రెసిపీ
క్యాబేజీ పులావ్ రెసిపీ (youtube)

Cabbage Pulao: లంచ్ బాక్స్ కు ఏం వండాలా? అని ఆలోచిస్తున్నారా ఒకసారి క్యాబేజీ రైస్ లేదా క్యాబేజీ పులావ్ ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీ కూర తినడం ఇష్టం లేకపోతే ఇలా క్యాబేజీ పులావ్ వండుకుంటే మంచిది. బాస్మతి బియ్యంతో ఉంటే దీని రుచి ఇంకా అదిరిపోతుంది. క్యాబేజీ కూరను తినడానికి ఇష్టపడని పిల్లలకు క్యాబేజీ రైస్ చేసి పెడితే వారు ఇష్టంగా తినేస్తారు. ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాబేజీ పులావ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

బాస్మతి బియ్యం - ఒక కప్పు

క్యాబేజీ తరుగు - ఒక కప్పు

ఉల్లిపాయ - ఒకటి

టమోటో - ఒకటి

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

పచ్చిమిర్చి - రెండు

నూనె - రెండు స్పూన్లు

జీలకర్ర - ఒక స్పూన్

లవంగాలు - మూడు

యాలకులు - రెండు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

బిర్యాని ఆకులు - రెండు

నీరు - సరిపడినంత

కొత్తిమీర - ఒక కట్ట

ఉప్పు - రుచికి సరిపడా

క్యాబేజీ పులావ్ రెసిపీ

1. బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నీటిలో నానబెట్టాలి.

2. క్యాబేజీని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి నూనె వేయాలి.

4. అందులో జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చి యాలకులు, బిర్యానీ ఆకులు వేసి వేయించాలి.

5. అవి వేగుతున్నప్పుడు అవి మంచి వాసన వస్తాయి.

6. ఆ సమయంలోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలను, నిలువుగా తరిగిన పచ్చిమిర్చిని వేసి బాగా వేయించాలి.

7. ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించాలి.

8. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి.

9. టమోటోలను సన్నగా తరిగి వేయాలి. అవి మెత్తబడే వరకు చిన్న మంట మీద ఉడికించాలి.

10. తర్వాత క్యాబేజీలను వేసి వేయించాలి. కాస్త ఉప్పు వేస్తే క్యాబేజీ త్వరగా మెత్తబడుతుంది.

11. క్యాబేజీ సన్నగా తరిగాము కాబట్టి త్వరగానే ఇది ఉడికిపోతుంది.

12. మూత పెట్టి క్యాబేజీ మెత్తగా ఉడికే దాకా ఉంచాలి.

13. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి, బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లను వేయాలి.

14. అవసరమైతే కాస్త ఉప్పు కలుపుకోవచ్చు. పైన కొత్తిమీర ఆకులను చల్లుకోవాలి.

15. కుక్కర్ మీద మూత పెట్టి ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి.

16. తర్వాత స్టవ్ కట్టేసి 10 నిమిషాలు వదిలేయాలి.

17. కుక్కర్ మూత తీస్తే టేస్టీ క్యాబేజీ పులావ్ లేదా క్యాబేజీ రైస్ రెడీ అయిపోతుంది. పైన కాస్త నెయ్యిని చల్లుకొని ఒకసారి కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది. లంచ్ బాక్స్ కి ఇది బెస్ట్ ఎంపిక అని చెప్పవచ్చు.

క్యాబేజీ తరచూ తింటే ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. దీనిలో విటమిన్ ఏ, ఫోలేట్, పీచు పదార్థం అధికంగా ఉంటుంది, కాబట్టి జీర్ణ క్రియ సవ్యంగా సాగుతుంది. అలాగే క్యాబేజీ తినడం వల్ల గుండెకు రక్షణ లభిస్తుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఈ క్యాబేజీ రైస్ లేదా క్యాబేజీ పులావ్ వంటి రెసిపీలను వండుకొని తింటే ఈ పోషకాలు అన్ని శరీరానికి అందుతాయి.

Whats_app_banner