Cabbage Pakodi: సాయంత్రానికి క్యాబేజీ పకోడీ ఇలా చేసేయండి, టేస్టీగా ఉంటుంది-cabbage pakodi recipe in telugu know how to make pakodi ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cabbage Pakodi: సాయంత్రానికి క్యాబేజీ పకోడీ ఇలా చేసేయండి, టేస్టీగా ఉంటుంది

Cabbage Pakodi: సాయంత్రానికి క్యాబేజీ పకోడీ ఇలా చేసేయండి, టేస్టీగా ఉంటుంది

Haritha Chappa HT Telugu
Jan 30, 2024 03:35 PM IST

Cabbage Pakodi: క్యాబేజీలు ఆరోగ్యానికి మంచివి. వీటితో కూరలే కాదు, పకోడీ కూడా చేసుకుని తినవచ్చు. క్యాబేజీ పకోడీ రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.

క్యాబేజీ పకోడి
క్యాబేజీ పకోడి (Dindigul Food Court/youtube)

Cabbage Pakodi: ఎక్కువగా పెళ్లిళ్లు, వేడుకల్లో క్యాబేజీ పకోడిని వడ్డిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలోని పెళ్లిళ్లలో పకోడీ కచ్చితంగా కనిపిస్తుంది. దీన్ని ఇంట్లో చాలా సులువుగా చేసుకోవచ్చు. సాయంత్రం పూట స్నాక్ గా తింటే ఇంకా మంచిది. ఈ క్యాబేజీ పకోడీలు నూనె తక్కువగానే పిలుస్తాయి. కాబట్టి దీన్ని అప్పుడప్పుడు తినడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు. ఈ క్యాబేజీ పకోడీలను ఒకసారి టిష్యూ పేపర్లో ఉంచితే నూనెను ఆ పేపర్ పీల్చుకుంటుంది. ఆ తరువాత తింటే మంచిది.

క్యాబేజీ పకోడీ రెసిపీకి కావలసిన పదార్థాలు

క్యాబేజీ తరుగు - పావు కిలో

పుదీనా ఆకులు - ఒక కట్ట

కరివేపాకులు - గుప్పెడు

అల్లం తరుగు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

వాము - ఒక స్పూను

శెనగపిండి - ఒక కప్పు

నూనె - సరిపడినంత

పచ్చిమిర్చి - నాలుగు

క్యాబేజీ పకోడీ రెసిపీ

1. ఒక గిన్నెలో క్యాబేజీని సన్నగా తరిగి అందులో వేయాలి.

2. పచ్చిమిర్చిని, అల్లం, పుదీనా, కరివేపాకులు వీటిని కూడా సన్నగా తరిగి క్యాబేజీలో కలపాలి.

3. తర్వాత వాము, శెనగపిండి, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలపాలి.

4. అవసరమైతే కాస్త నీళ్లు వేయవచ్చు.

5. నీరు మరీ ఎక్కువగా వేసేస్తే అవి నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి.

6. కాబట్టి తక్కువ నీటిని వేయడమే మంచిది.

7. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చేయాలి.

8. ఆ నూనెలో క్యాబేజీ మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోవాలి.

9. అవి రంగు మారేవరకు ఉంచి తరువాత తీసి టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి.

10. అవి నూనెను పీల్చుకున్నాక సాస్ లో ముంచుకుని తింటే టేస్టీగా ఉంటాయి.

క్యాబేజీని తరచూ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దీనిలో విటమిన్ ఏ, ఫోలేట్, విటమిన్ బి అధికంగా ఉంటాయి. కాబట్టి దీని తినడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. క్యాబేజీ తరచూ తినేవాళ్లులో గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. కాబట్టి వారానికి కనీసం రెండు నుంచి మూడుసార్లు క్యాబేజీని తినడం అలవాటు చేసుకోండి. క్యాబేజీ పకోడీని అప్పుడప్పుడు చేసుకుంటే మంచిది. పిల్లలకి స్నాక్స్ గా ఉపయోగపడుతుంది.

Whats_app_banner