Basmati Rice Idli Recipe । బాస్మతి రైస్ ఇడ్లీ.. దీని రుచికి పోతుంది మీ మతి!-weekend special basmati rice idli check out tasty and healthy recipe inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Basmati Rice Idli Recipe । బాస్మతి రైస్ ఇడ్లీ.. దీని రుచికి పోతుంది మీ మతి!

Basmati Rice Idli Recipe । బాస్మతి రైస్ ఇడ్లీ.. దీని రుచికి పోతుంది మీ మతి!

HT Telugu Desk HT Telugu
May 28, 2023 06:06 AM IST

Basmati Rice Idli Recipe: క్లాసిక్ ఇడ్లీని బాస్మతి బియ్యంతో కూడా తయారు చేయవచ్చు. బాస్మతి రైస్ ఇడ్లీ రెసిపీని ఈ కింద ఇచ్చాము, మీరూ ట్రై చేయండి మరి.

Basmati Rice Idli Recipe
Basmati Rice Idli Recipe (Unsplash)

Healthy Breakfast Recipes: ఇడ్లీ అనేది భారతీయ వంటకాలలో ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇది నూనె లేకుండా చేసే వంటకం కాబట్టి కొలెస్ట్రాల్ సమస్య ఉండదు. ఇప్పుడంటే ఇడ్లీలను ఇన్ స్టంట్ గా దొరికే రవ్వను నానబెట్టి త్వరగా చేసేస్తున్నారు. కానీ క్లాసిక్ ఇడ్లీ రెసిపీ అంటే చిన్న ధాన్యపు బియ్యంను, ప్రోటీన్ అధికంగా ఉండే మినపప్పును రుబ్బి, పిండిని పులియబెట్టి తయారు చేస్తారు.

క్లాసిక్ ఇడ్లీని బాస్మతి బియ్యంతో కూడా తయారు చేయవచ్చు. బాస్మతి రైస్ ఇడ్లీ రెసిపీని ఈ కింద ఇచ్చాము, సూచనలు చదివి సులభంగా తయారు చేసుకోవచ్చు, మీరూ ట్రై చేయండి మరి.

Basmati Rice Idli Recipe కోసం కావలసినవి

  • 1 కప్పు బాయిల్డ్ రైస్
  • 1 కప్పు బాస్మతి రైస్
  • 1/2 కప్పు మినపపప్పు/ మినపగుళ్ళు
  • 1/4 కప్పు అటుకులు
  • 1/2 టేబుల్ స్పూన్ మెంతులు
  • రుచికి తగినంత ఉప్పు

బాస్మతి రైస్ ఇడ్లీ ఎలా తయారు చేయాలి

  1. ముందుగా మినపపప్పు, మెంతులను నీటిలో 2-3 సార్లు కడగండి. అలాగే బాయిల్డ్ రైస్, బాస్మతి రైస్ రెండింటిని నీటిలో కలిపి 3-4 సార్లు కడిగి శుభ్రం చేసుకోండి.
  2. అనంతరం మినపపప్పు, మెంతులు, అటుకులు కలిపి 1కప్పు నీటిలో 4-5 గంటలు నానబెట్టండి. మరోవైపు బియ్యం మిశ్రమాన్ని కూడా 2-కప్పుల నీటిలో కలిపి 4-5 గంటల పాటు విడిగా నానబెట్టండి.
  3. ఇప్పుడు నానబెట్టిన మినపపప్పును మెత్తని పేస్టులాగా రుబ్బుకోండి, అలాగే బియ్యం మిశ్రమాన్ని విడిగా ముతక పిండిలాగా రుబ్బుకోవాలి. అనంతరం ఈ రెండింటిని కలిపేసి అందులో కొద్దిగా ఉప్పు వేసి 8-10 గంటల పాటు పులియబెట్టండి.
  4. ఇప్పుడు సిద్ధమైన ఇడ్లీ బ్యాటర్‌ను, ఇడ్లీ స్టీమర్‌ అచ్చులలో వేసి ఆవిరి మీద ఉడికించండి.

అంతే, రైస్ ఇడ్లీలు రెడీ. కొబ్బరి చట్నీ, సాంబార్ తో కలిపి తింటే ఈ ఇడ్లీల రుచి వేరే ఏ ఇడ్లీలకు ఉండదు.

WhatsApp channel

సంబంధిత కథనం