Healthy Cooking Oils । వంటకాలకు ఈ 7 నూనెలు ఉత్తమమైనవి, ఆరోగ్యకరమైనవి!-know what is smoke point check out 7 healthy cooking oils that are best for meal preparation ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Cooking Oils । వంటకాలకు ఈ 7 నూనెలు ఉత్తమమైనవి, ఆరోగ్యకరమైనవి!

Healthy Cooking Oils । వంటకాలకు ఈ 7 నూనెలు ఉత్తమమైనవి, ఆరోగ్యకరమైనవి!

HT Telugu Desk HT Telugu
May 24, 2023 06:45 PM IST

Healthy cooking oils: కొన్ని రకాల వంటనూనెలు అధిక వేడిని కూడా తట్టుకుని పోషకాలను అందించగలవు, అలాంటి ఆరోగ్యకరమైన వంట నూనెల గురించి ఇక్కడ తెలుసుకోండి.

Healthy cooking oils
Healthy cooking oils (stock pic)

Healthy Cooking Oils: మనం ప్రతిరోజూ అనేక రకాల వంటలకు నూనెను ఉపయోగిస్తాం. కానీ మనం వంటచేసే నూనెతోనే మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా నూనెను వేడి చేసిన తర్వాత రసాయన చర్యలు జరుగుతాయి. అనంతరం విడుదలయ్యే సమ్మేళనాలు మన ఆరోగ్యానికి హానికరంగా ఉంటాయి. వేడి చేసిన తర్వాత ఆ నూనె తినడానికి ఆరోగ్యకరమైనది కాదా అని పరిగణనలోకి తీసుకోవడం కూడా ముఖ్యం. ఎందుకంటే ఒక్కో వంట నూనె దాని ఒక నిర్ధిష్టమైన స్మోక్ పాయింట్లు లేదా ఉష్ణోగ్రతల పరిధిని కలిగి ఉంటాయి, ఆ పరిధి దాటితే అవి స్థిరంగా ఉండవు. మీరు వాటి స్మోక్ పాయింట్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినపుడు ఆ వంట నూనెలను ఉపయోగించకుండా ఉండాలి.

రీఫైన్డ్ ఆయిల్స్ అధిక స్మోక్ పాయింట్ కలిగి ఉన్నప్పటికీ పోషకాలు ఉండవు, నాన్- రీఫైన్డ్ నూనెలు అధిక మొత్తంలో పోషకాలు కలిగి ఉన్నప్పటికీ అవి వేడికి విచ్ఛిన్నమవుతాయి అందువల్ల ఉపయోగం లేదు. వేడికి చాలా రకాల నూనెలు రంగు, రుచి వాసనతో పాటు నాణ్యతను కోల్పోతాయి. అయితే కొన్ని రకాల నూనెలు అధిక వేడిని కూడా తట్టుకుని పోషకాలను అందించగలవు, అలాంటి ఆరోగ్యకరమైన వంట నూనెల గురించి ఇక్కడ తెలుసుకోండి.

కనోలా ఆయిల్

కనోలా మొక్క విత్తనాల నుండి ఈ నూనెను తీస్తారు. ఈ నూనెలో సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది, అధిక స్మోక్ పాయింట్ కలిగి ఉంటుంది, ఇది చాలా రకాలుగా వండే పద్ధతులకు అనుకూలంగా ఉంటుంది. ఇది తటస్థ రుచిని కలిగి ఉంటుంది.

కొబ్బరి నూనె

ఈ నూనెలో మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్‌లు (MCTలు) ఉంటాయి, అధిక స్మోక్ పాయింట్‌ను కలిగి ఉంటుంది. ఇది వేయించడం, బేకింగ్ చేయడం వంటి అధిక వేడిలో వంటచేసే పద్ధతులకు కూడా అనుకూలంగా ఉంటుంది. కొబ్బరి నూనె వంటలకు ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది.

నువ్వుల నూనె

నువ్వుల నూనె రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి లేత రంగులో ఉంటే మరొకటి ముదురు రంగులో ఉంటుంది. . లేత నువ్వుల నూనె అధిక స్మోక్ పాయింట్‌ను కలిగి ఉంటుంది. వేయించడానికి, అధిక వేడి వంటకు అనుకూలంగా ఉంటుంది, అయితే ముదురు నువ్వుల నూనెను ప్రధానంగా వంటలలో సువాసనగా ఉపయోగిస్తారు.

గ్రేప్సీడ్ ఆయిల్

ద్రాక్ష గింజల నుండి గ్రేప్సీడ్ ఆయిల్ తయారవుతుంది, గ్రేప్సీడ్ ఆయిల్ అధిక స్మోక్ పాయింట్ కలిగి ఉండటమే కాకుండా తేలికపాటి రుచిని కలిగి ఉంటుంది. ఇది తరచుగా వేయించడానికి, బేకింగ్ చేయడానికి ఉపయోగిస్తారు.

వాల్‌నట్ ఆయిల్

ఈ నూనె గొప్ప రుచిని కలిగి ఉంటుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. సలాడ్ డ్రెస్సింగ్‌లు, మెరినేడ్‌లు, వండిన వంటలలో కలుపుకోవడానికి ఉత్తమంగా ఉంటుంది, ఎందుకంటే ఇది తక్కువ పొగ పాయింట్‌ను కలిగి ఉంటుంది.

ఆలివ్ ఆయిల్

మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నందున ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఒక ప్రసిద్ధమైన నూనె. ఇది తక్కువ నుండి మధ్యస్థమైన వేడి వంటకు అనుకూలంగా ఉంటుంది, సలాడ్ డ్రెస్సింగ్‌లు , మెరినేడ్‌లలో బాగా పని చేస్తుంది.

అవోకాడో ఆయిల్

అవోకాడో ఆయిల్ అధిక స్మోక్ పాయింట్ ను కలిగి ఉంటుంది. తేలికపాటి రుచిని అందిస్తుంది. అందువల్ల ఈ నూనె వేపుళ్లకు, రోస్ట్ చేయడానికి, గ్రిల్ చేయడం వంటి వివిధ వంట పద్ధతులకు అనువైనది. ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వులు , విటమిన్ ఇ ఉంటాయి.

WhatsApp channel

సంబంధిత కథనం