Butter Chicken Recipe : చికెన్ చికెన్.. బటర్ చికెన్ చాలా సింపుల్​గా చేసేయొచ్చు..-butter chicken recipe for lunch and healthy snack here is the making process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Butter Chicken Recipe : చికెన్ చికెన్.. బటర్ చికెన్ చాలా సింపుల్​గా చేసేయొచ్చు..

Butter Chicken Recipe : చికెన్ చికెన్.. బటర్ చికెన్ చాలా సింపుల్​గా చేసేయొచ్చు..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 16, 2022 01:13 PM IST

Butter Chicken Recipe : మీరు స్ట్రీట్ స్టైల్ ఫుడ్​ని ఇష్టపడేవారు అయితే.. ముఖ్యంగా చికెన్ ప్రియులు అయితే ఈ డిష్ మీకోసమే. అదే బటర్ చికెన్. లంచ్ సమయంలో కానీ.. స్నాక్స్ టైమ్​లో కానీ.. నైట్ డిన్నర్​లో కూడా మీరు దీనిని తీసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బటర్ చికెన్
బటర్ చికెన్

Butter Chicken Recipe : చికెన్ అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే నాన్​వెజ్​ ప్రియులను బటర్ చికెన్ అంటే ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. చాలామందికి దీనిని ఎలా తయారు చేసుకోవాలో తెలియదు. అయితే ఇది చాలా రుచికరమైన డిష్. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* చికెన్ - 500 గ్రాములు (బోన్ లెస్)

* బటర్ - 250 గ్రాములు

* చాట్ మసాలా - 1 టేబుల్ స్పూన్

* కారం - 1 టీస్పూన్

* ఉప్పు - రుచికి తగినంత

* పెప్పర్ పౌడర్ - 1 టీస్పూన్

* అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

* పెరుగు - 1/2 కప్పు

* చికెన్ మసాలా - 1 టీస్పూన్

* ధనియా పొడి - 1 టీస్పూన్

తయారీ విధానం

ముందుగా బోన్‌లెస్ చికెన్ ముక్కలను మెరినేట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని.. దానిలో పెరుగు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, నూనె, నిమ్మరసం, మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపండి. దానిలో చికెన్ ముక్కలను వేసి బాగా కలిపి.. మ్యారినేట్ చేసుకోండి. 3 నుంచి 4 గంటలు ఫ్రిజ్‌లో ఉంచేయండి.

అనంతరం గ్రిల్ పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల వెన్న వేడి చేసి.. మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత.. ఒక గిన్నెలోకి అన్ని ముక్కలను తీయండి. దానిపై వెన్న కరిగించి పోయండి. దానిపై చాట్ మసాలా చల్లుకోండి. ఉల్లిపాయ, నిమ్మకాయలతో సర్వ్ చేసుకుని.. హ్యాపీగా లాగించేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం