Deepika Padukone: ఓపెన్ బ్లేజర్, బోల్డ్ దుస్తుల్లో దీపికా పదుకొణ్ ప్రెగ్నెన్సీ ఫొటోషూట్‌, లుక్స్ వివరాలివే-bold pics of deepika padukone meternity photo shoot see looks details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Deepika Padukone: ఓపెన్ బ్లేజర్, బోల్డ్ దుస్తుల్లో దీపికా పదుకొణ్ ప్రెగ్నెన్సీ ఫొటోషూట్‌, లుక్స్ వివరాలివే

Deepika Padukone: ఓపెన్ బ్లేజర్, బోల్డ్ దుస్తుల్లో దీపికా పదుకొణ్ ప్రెగ్నెన్సీ ఫొటోషూట్‌, లుక్స్ వివరాలివే

Koutik Pranaya Sree HT Telugu
Sep 03, 2024 10:30 AM IST

Deepika Padukone: బోల్డ్ ఓపెన్ బ్లేజర్స్, షీర్ దుస్తుల్లో దీపిక పదుకొణ్ ప్రెగ్నెన్సీ ఫొటోషూట్‌ ఫొటోలు చూశారా? ఈ షూట్ లో వేసుకున్న ప్రతి డ్రెస్ వివరాలు డీకోడ్ చేద్దాం.

దీపిక పదుకొణ్ మెటర్నిటీ ఫొటోషూట్
దీపిక పదుకొణ్ మెటర్నిటీ ఫొటోషూట్ (Instagram/@deepikapadukone)

దీపికా పదుకొణె తన లేటెస్ట్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఎమోటికాన్స్‌తో పాటు కొన్ని అద్భుతమైన ఫోటోలను షేర్ చేసి అభిమానులను అలరించింది. దాంతో ఆమె ఫోటోషూట్ క్షణాల్లో వైరల్ గా మారింది. రణ్‌వీర్ సింగ్ తో కలిసి దిగిన ఫొటోల్లో ఈ అద్భుతమైన కెమిస్ట్రీ మరోసారి కనిపించింది . మెటర్నిటీ స్టైల్ కు దీపికా బోల్డ్ లుక్ ఇవ్వడంతో ఒక ఫ్యాషన్ సెన్సేషన్ అయ్యాయీ ఫొటోలు.

దీపికా పదుకొణె ప్రెగ్నెన్సీ లుక్స్:

తన ప్రెగ్నెన్సీ లుక్స్ కోసం దీపికా చాలా సింపుల్ వస్త్రాలు ఎంచుకున్నారు. అవన్నీ చాలా తేల్లిగా గాల్లోకి ఎగిరే దుస్తులు. నలుపు రంగులో ఉన్న ఈ అవుట్ ఫిట్స్ మంచి ట్రెండీ లుక్ తీసుకొచ్చాయి. వీటిలో ఒక లుక్ కోసం ఆమె ఫ్లేర్డ్ డెనిమ్ జీన్స్ కు జతగా నిట్టెడ్ స్వెటర్ ధరించారు. ఈ లుక్ సౌకర్యంతో పాటూ ఫ్యాషన్ వైబ్స్ తెచ్చిపెట్టింది. మరో లుక్ కోసం షిమ్మర్ ఓపెన్ బ్లేజర్ వేసుకుంది దీపిక. దానికి జతగా లూజ్ ప్యాంట్ వేసుకుంది. ఇక లుక్ అందం రెట్టింపు చేయడానికి తేలికైన, పలుచని వస్త్రాలు ఆమె ఎంచుకుంది.

ఒక లుక్ లో దీపికా నలుపు రంగు బట్టల్లో మెరిసిపోతూ అందాలను ఆరబోసింది. ఈ దుస్తులు హై నెక్ లైన్, బెలూన్ స్లీవ్స్ కలిగి ఉన్నాయి. ఫ్లోయింగ్ బాటమ్తో అదనపు అందం తోడైతంది. మరో స్టైలిష్ డ్రెస్ కోసం బాడీకాన్ ఫిట్ డ్రెస్ ఎంచుకుంది దీపిక. దీంట్లో దీపిక బేబీ బంప్ హత్తుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. సహజ మేకప్ లుక్ వచ్చేలా లూజ్ వేవీ హెయిర్ స్టైల్ లో దీపిక అందంగా కనిపించారు. దీపిక ఎలాంటి లుక్ అయినా అదరగొడుతుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ ఫొటోషూట్ లోనూ అటు బోల్డ్ గానూ, సరదాగానూ ఉన్న ఈ ఫొటోలు అందరికీ నచ్చేస్తున్నాయి.

దీపికా పదుకొణె ప్రెగ్నెన్సీ గురించి

దీపికా పదుకొణె, రణ్ వీర్ సిం‌గ్‌లు తమ మొదటి బిడ్డ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరిలో ఆమె గర్భం దాల్చిన విషయాన్ని వారు వెల్లడించారు. సెప్టెంబర్లో తమ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. బేబీ షూస్, దుస్తులు ఉన్న ఫోటోను ఈ పోస్టులో పెట్టారు. "సెప్టెంబర్ 2024" అని దీనికి క్యాప్షన్ పెట్టారు. 38 ఏళ్ల దీపికా, రణ్ వీర్ 2018లో ఇటలీలోని లేక్ కోమోలో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు.