Nude Boat Trip : బట్టలు లేకుండా 11 రోజులు న్యూడ్ బోట్ ట్రిప్.. నగ్నంగా ఉంటేనే అనుమతి!-big nude boat journey enjoy 11 days trip without dress to caribbean islands ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nude Boat Trip : బట్టలు లేకుండా 11 రోజులు న్యూడ్ బోట్ ట్రిప్.. నగ్నంగా ఉంటేనే అనుమతి!

Nude Boat Trip : బట్టలు లేకుండా 11 రోజులు న్యూడ్ బోట్ ట్రిప్.. నగ్నంగా ఉంటేనే అనుమతి!

Anand Sai HT Telugu
May 12, 2024 06:30 PM IST

Nude Boat Journey : ఏదైనా టూర్‌కు వెళితే చక్కగా రెడీ అయి వెళ్తాం. కానీ ఓ ట్రిప్‌కి వెళితే మాత్రం నగ్నంగా వెళ్లాల్సి ఉంటుందట. ఇప్పుడు ఆ న్యూస్ వైరల్ అవుతుంది. బిగ్ న్యూడ్ బోట్ ట్రిప్‌తో ఇది ప్లాన్ చేశారు. బట్టలు లేకుండా వెళ్లడం ఏంట్రా బాబు అనుకుంటున్నారా?

నగ్నంగా బోట్ ట్రిప్
నగ్నంగా బోట్ ట్రిప్ (Instagram)

బిగ్ న్యూడ్ బోట్ ప్రయాణించేందుకు సిద్ధమైంది. దీనికోసం బుక్ చేసుకోవడానికి క్యూ కడుతున్నారు. 11 రోజుల పర్యటనలో అందరూ నగ్నంగా ఉంటారట. మీరు కూడా ఈ పడవలో ప్రయాణించాలనుకుంటే మీరు నగ్నంగా ఉంటే మాత్రమే అనుమతి.

నేకెడ్ పార్టీతో సహా అనేక దేశాల్లో వివిధ సంప్రదాయాలు, పండుగలు నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు బేర్ బోట్ ప్రయాణం కోసం నగ్న ట్రిప్ ప్లాన్ చేసింది. బోట్ ద్వారా 11 రోజులు టూర్ ప్లాన్ చేశారు. ప్రైవేట్ రిసార్ట్, ద్వీపం, విశ్రాంతితో సహా అనేక ప్రాంతాలను సందర్శించడం వంటి అనేక విషయాలు ఉన్నాయి. ఈ పడవలో నగ్నంగా రావడమే షరతు. బిగ్ న్యూడ్ బోట్‌లో 11 రోజుల పాటు నగ్నంగా ప్రయాణించవచ్చు.

968 అడుగుల నార్వేజియన్ పెర్ల్ బోట్ ఇందుకు సిద్ధంగా ఉంది. ఈ పడవ ప్రయాణం అమెరికా తీరంలో భాగమైన మియామీ నుంచి కరేబియన్ ఐస్ లాండ్ కు బయలుదేరుతుంది. మొత్తం 11 రోజులు టూర్. బేర్ నెసెసిటీ అన్నో ట్రావెల్ కంపెనీ ఈ న్యూడ్ ట్రావెల్ నిర్వహిస్తోంది. ఈ కొత్త ప్రయాణానికి జనం షాక్ అవుతున్నారు.

నగ్నంగా విహారయాత్రను ఆస్వాదించడానికి సమూహంగా, జంటగా లేదా ఒంటరిగా వెళ్లవచ్చు. ప్రకృతి అందాలను సహజంగా ఆస్వాదించేందుకు ట్రావెల్ కంపెనీ ఈ ప్లాన్ చేసింది. నార్వేజియన్ క్రూయిజ్ షిప్ అయిన బేర్ నెసెసిటీ భాగస్వామ్యంతో క్రూయిజ్ ఈ ప్లాన్ చేసింది.

11 రోజుల ఈ పర్యటనలో కొన్ని ప్రైవేట్ ఐలాండ్, ప్రైవేట్ బీచ్ రిసార్ట్ సహా పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని ప్లాన్ చేశారు. ఇది కాకుండా బోట్‌లో కొన్ని కార్యకలాపాలు, కరేబియన్ పార్టీ, సంగీత వినోదంతో సహా అనేక వినోద కార్యక్రమాలు ఉంటాయి.

ఈ యాత్ర కోసం సిద్ధం చేసిన బోట్‌కు ది బిగ్ న్యూడ్ బోట్ జర్నీ అని పేరు పెట్టారు. బుకింగ్ జరుగుతోంది. 11 రోజుల పర్యటన వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని బేర్ నెసెసిటీ తెలిపింది.

ఈ టూర్ ధర కూడా భారీగానే ఉంది. బిగ్ న్యూడ్ బోట్ ట్రిప్ కోసం 2 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని విలాసవంతమైన సౌకర్యాలు కావాలంటే.. 33 వేల డాలర్లకు పైగా ఉంది.

అయితే ఇలాంటి ట్రిప్ ఉందని తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. బట్టలు లేకుండా టూర్ ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఇది ఒక మంచి అనుభవమని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నగ్నంగా ఉంటే మంచి అనుభూతిని కలిగిస్తుందని కొందరు అంటున్నారు.