Yadagirigutta Tour : ఒకే ఒక్క రోజులో యాదాద్రి ట్రిప్ - కొలనుపాక జైన్ మందిర్ కూడా చూడొచ్చు, 1499కే టూర్ ప్యాకేజీ-telangana tourism yadagirigutta tour package from hyderabad read full details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Yadagirigutta Tour : ఒకే ఒక్క రోజులో యాదాద్రి ట్రిప్ - కొలనుపాక జైన్ మందిర్ కూడా చూడొచ్చు, 1499కే టూర్ ప్యాకేజీ

Yadagirigutta Tour : ఒకే ఒక్క రోజులో యాదాద్రి ట్రిప్ - కొలనుపాక జైన్ మందిర్ కూడా చూడొచ్చు, 1499కే టూర్ ప్యాకేజీ

Maheshwaram Mahendra Chary HT Telugu
May 10, 2024 06:02 PM IST

Hyderabad - Yadagirigutta Tour Package : హైదరాబాద్ నుంచి యాదాద్రికి వెళ్లేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. అతి తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. కొలనుపాకతో సురేంద్రపురి ఆలయాలను కూడా చూడొచ్చు.

హైదరాబాద్ -  యాదాద్రి టూర్ ప్యాకేజీ
హైదరాబాద్ - యాదాద్రి టూర్ ప్యాకేజీ (https://tourism.telangana.gov.in/p)

Yadagirigutta Tour Package : యాదాద్రితో పాటు మరికొన్ని ఆలయాలను చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. అతి తక్కువ ధరలోనే ప్రతి శనివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. https://tourism.telangana.gov.in/p వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.

యాదగిరిగుట్ట టూర్ ప్యాకేజీ వివరాలు…

  • తెలంగాణ టూరిజం YADAGIRIGUTTA PACKAGE TOUR ను ప్రకటించింది.
  • హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.
  • ప్రతి శనివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
  • ఏసీ మినీ కోచ్ లో జర్నీ ఉంటుంది.
  • టికెట్ ధరలు - పెద్దలకు రూ. 1499, పిల్లలకు రూ.1199
  • కేవలం ఒకే ఒక్క రోజులో ఈ ప్యాకేజీ ముగుస్తుంది.
  • ఉదయం 9 గంటలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి స్టార్ట్ అవుతారు.
  • 10:30 గంటలకు కొలనుపాకకు చేరుకుంటారు. పురాతన జైన్ ఆలయాన్ని దర్శించుకుంటారు.
  • 11:30 AM గంటలకు కొలనుపాక నుంచి బయల్దేరుతారు.
  • 12:30 PMకు యాదగిరిగుట్టలోని ఆలయాన్ని సందర్శిస్తారు.
  • 1:30 PM to 2:00 PM హరిత హోటల్ లో భోజనం చేస్తారు.
  • 4:30 PM సురేంద్రపురికి వెళ్తారు. ఇక్కడ ప్రముఖ ఆలయాల సెట్టింగ్ లను చూస్తారు,
  • 9:30 PM గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు.
  • https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుకోవచ్చు.

హైదరాబాద్ - తిరుమల టూర్ ప్యాకేజీ

Telangana Tourism Hyderabad Tirumala Tour : తిరుమల శ్రీవారి భక్తుల కోసం మంచి ప్యాకేజీ వచ్చేసింది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఈ టూర్ ప్యాకేజీ పూర్తి అవుతుంది. దీన్ని తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తుంది. బస్సులోనే వెళ్లాల్సి ఉంటుంది.

ఈ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే పెద్దలకు రూ. 3,700గా ఉంది. ఇక చిన్నారులకు రూ. 2,960గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది.

  • TIRUPATI - TIRUMALA TOUR పేరుతో తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది.
  • హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది.
  • కేవలం ఒకే ఒక్క రోజులోనే తిరుపతి, తిరుమల, తిరుచానూర్ కవర్ అవుతాయి.
  • Day 1 - సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సు బయల్దేరుతుంది. (సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9848540374)
  • Day 2 - ఉదయం 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత స్థానంకంగా ఉండే ఆలయాలను చూస్తారు. ఆ తర్వాత తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది. అనంతరం తిరుపతికి చేరుకుంటారు.
  • తిరుపతిలో ఫ్రెషప్ అవుతారు. సాయంత్రం 5 గంటలకు రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది.
  • Day 3 - ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

మరోవైపు దక్షిణ తెలంగాణలోని జోగులాంబ అమ్మవారి ఆలయంతో పాటు బీచ్ పల్లిలోని ఆంజనేయస్వామి ఆలయానికి దర్శించుకునేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. శని, ఆదివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.