సన్నగా ఉన్నవాళ్లు కూడా వ్యాయామం చేయాలా?-benefits of regular exercise ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  సన్నగా ఉన్నవాళ్లు కూడా వ్యాయామం చేయాలా?

సన్నగా ఉన్నవాళ్లు కూడా వ్యాయామం చేయాలా?

HT Telugu Desk HT Telugu
Nov 10, 2022 02:45 PM IST

సన్నగా ఉన్నవాళ్లు ఒళ్లు చేయాలంటే వ్యాయామం తప్పదు. అయితే ఏది పడితే అది కాకుండా.. నిపుణులు పర్యవేక్షణలో వ్యాయమం చేయాలి. ముఖ్యంగా స్ట్రెంత్‌ ట్రైనింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాలి. శరీర దారుఢ్యాన్నిపొందాలంటే క్రంచెస్‌ లాంటివి ఉపయోగపడుతాయి

<p>యోగా</p>
యోగా (soumyapathakyoga)

సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే... వ్యాయామం తప్పనిసరి. మానసిక ప్రశాంతత.. శరీర దారుఢ్యాన్ని పెంచుకోవటానికి రోజులో కనీసం 45 నిమిషాల పాటు వ్యాయమం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలా మంది సన్నగా ఉన్నాం కాబట్టి వ్యాయామం అవసరం లేదని భావిస్తుంటారు. కానీ వ్యాయమం అందరికి తప్పనిసరిని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సన్నగా ఉన్నవాళ్లు ఒళ్లు చేయాలంటే వ్యాయామం తప్పదు. అయితే ఏది పడితే అది కాకుండా.. నిపుణులు పర్యవేక్షణలో వ్యాయమం చేయాలి. ముఖ్యంగా స్ట్రెంత్‌ ట్రైనింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాలి. శరీర దారుఢ్యాన్నిపొందాలంటే క్రంచెస్‌ లాంటివి ఉపయోగపడుతాయి. 20 సార్లు 3 సెట్లతో క్రంచెస్‌ చేస్తే ఫలితం ఉంటుంది.

స్కిప్పింగ్‌‌తో ఆరోగ్యం

రెగ్యులర్ ఎక్సర్‌సైజ్‌లలో స్కిప్పింగ్‌ చేయడం చాలా మంచిది. స్కిప్పింగ్‌ వల్ల కండరాల పటిష్ఠంగా మారుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం అన్ని భాగాలతో ట్యూన్ అవుతుంది. స్కిప్పింగ్ చేయడం వల్ల తల భాగం నుండి కింది కాళ్ల భాగాల వరకు  సమన్వయం పెరుగుతుంది. మీడియం బరువు ఉన్న తాడుతో స్కిప్పింగ్‌ చేయడం మంచిది. రెండు పాదాలతో జంపింగ్ చేస్తుండాలి. 30 సెకన్ల పాటు స్కిప్ చేయాలి. 60 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఆపై 30 సెకన్ల పాటు దూకాలి. ఇలా 9 సార్లు రిపీట్ చేయడం వల్ల శరీరం ఫీట్‌గా మారుతుంది.

నడకతో ప్రయోజనాలు

క్రమంగా తప్పకుండా వాకింగ్‌ చేస్తుండాలి. ఉదయం నడక వల్ల మానసికంగా ఆరోగ్యం మెరుగవుతుంది. ఒత్తిడి తగ్గి. కంగారు వంటి సమస్యలు ఉండవు. వాకింగ్ చేయడం వల్ల మెలటోనిన్ హర్మోన్ ప్రభాతవంతంగా పనిచేస్తుంది. ఇది ప్రశాంతమైన అందించడానికి సహాయపడుతుంది. రోజువారీ షెడ్యూల్‌లో నడకను చేర్చుకోవడం ద్వారా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మతి మరుపు తగ్గి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

Whats_app_banner