Banned foods in India: గోవాలో గోబీ మంచూరియన్ బ్యాన్, మనదేశంలో ఎక్కడెక్కడ ఏ ఆహారాలు నిషేధించారంటే
Banned foods in India: గోవాలో గోబీ మంచూరియాను నిషేధించారు. గోవాలోని మపూసా అనే ప్రాంతంలోని ఈ నిషేధం విధించారు. ఇకపై అక్కడి ప్రజలు గోబీ మంచూరియాను రుచి చూడలేరు. అలాగే మన దేశంలోని పలుచోట్ల కొన్ని రకాల ఆహార పదార్థాలను నిషేధించారు.
Banned foods in India: గోవాలోని మపూసా ప్రాంతంలో గోబీ మంచూరియాను అధికంగా తింటారు. అక్కడ నాయకుడైన కౌన్సిలర్ తారక్ అరోల్కర్ గోబీ మంచూరియన్ తయారీని చూసి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో వాడే రంగులు, పదార్థాలను చూసి దానిపై నిషేధాన్ని విధించాలని ఆయన సూచించారు. ప్రజలు కూడా మద్దతు పలకడంతో మపూస ప్రాంతంలో గోబీ మంచూరియా కనుమరుగైపోయింది. అందులో సింథటిక్ కలర్స్ వాడడం, పరిశుభ్రంగా పోవడం వల్ల గోబీ మంచూరియన్ నిషేధించారు. కేవలం గోబీ మంచూరియా మాత్రమే కాదు మన దేశంలో చాలా చోట్ల కొన్ని రకాల ఆహార పదార్థాలను బ్యాన్ చేశారు. ఎక్కడెక్కడ ఏ ఆహారాలు బ్యాన్ చేశారో ఒకసారి తెలుసుకుందాం.
పూర్తి శాకాహార పట్టణం
గుజరాత్ లోని పాలిటానా జైనులకు ఒక పుణ్యక్షేత్రం. జైనులు శాఖాహారులు కాబట్టి స్థానిక ప్రభుత్వం ఆ పట్టణంలో మాంసం, చేపలు వంటి నాన్ వెజ్ ఆహారం అమ్మడాన్ని పూర్తిగా నిషేధించింది.ఆ నగరాన్ని పూర్తి శాకాహార జోన్ గా ప్రకటించింది.
నో జంక్ ఫుడ్
ఫాస్ట్ ఫుడ్స్ అనారోగ్యకరమని అందరికీ తెలుసు. అయినా సరే పిజ్జాలు, బర్గర్లు, కూల్డ్రింకులు తాగే వారి సంఖ్య అధికంగా ఉంది. ఈ జంక్ ఫుడ్ ను తగ్గించడానికి పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని పాఠశాలలు, కళాశాలల దగ్గర పిజ్జాలు, బర్గర్లు, కూల్డ్రింక్స్ విక్రయించడానికి పూర్తిగా నిషేధించారు. ఆ కళాశాలలు, పాఠశాలల పరిసరాలలోని ఏ దుకాణాల్లో కూడా ఇవి కనిపించకూడదు. ఆ రాష్ట్రాల మహిళ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ నిషేధాన్ని విధించింది.
కుందేలు మాంసం
ఇప్పటికీ చాలాచోట్ల కుందేలు మాంసాన్ని అధికంగా తింటూ ఉంటారు. అయితే కేరళలో మాత్రం కుందేళ్లను చంపి వండుకొని తినడంపై పూర్తిగా నిషేధం విధించారు. అక్కడి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ నిషేధాన్ని జారీ చేసింది. రాష్ట్రంలోని హోటళ్లలో కుందేలు మాంసాన్ని వండకూడదని ఆదేశించింది.
మనదేశంలో అధికంగా తాగే లేదా తినే ఆహారాలు బయట కొన్ని దేశాల్లో నిషేధానికి గురయ్యాయి.
రెడ్ బుల్
మనం ఇక్కడ రెడ్ బుల్ ను అధికంగానే తాగుతున్నాం. ఎనర్జీ డ్రింక్ అయిన రెడ్ బుల్ ఫ్రాన్స్, డెన్మార్క్, లిథువేనియా దేశాల్లో నిషేధానికి గురైంది. అయితే లిథువేనియాలో 18లోపు వయసు పిల్లలు మాత్రమే దీన్ని తాగకూడదు. అంతకన్నా పెద్ద వయసు వారు తాగచ్చు. కానీ ఫ్రాన్స్, డెన్మార్కులలో మాత్రం ఎవరూ రెడ్ బుల్ తాగకూడదు. దీనివల్ల గుండె సమస్యలు, డిప్రెషన్, హైబీపీ వంటివి వచ్చే అవకాశం ఉన్నట్టు అక్కడి ప్రభుత్వాలు నిషేధం విధించాయి.
కిండర్ జాయ్
కిండర్ జాయ్ అంటే మన పిల్లలకు ఎంత ఇష్టమో. అది కనిపిస్తే చాలు కొనే వరకు గోల పెడతారు. కానీ కిండర్ జాయ్ ను అమెరికాలో పూర్తిగా నిషేధించారు. అందులో ఉండే చాక్లెట్ బాల్స్ వల్ల పిల్లలకు ఊపిరి సమస్యలు వచ్చే అవకాశం ఉందని అక్కడ ప్రభుత్వం నిషేధించింది.
చీజ్ మాక్రోనీ
మాక్రోని వాడకం మన దేశంలో ఎక్కువే. చీజ్ సంగతి చెప్పక్కర్లేదు... దోశ దగ్గర నుంచి పిజ్జా వరకు అన్నిటి పైన చీజ్ చల్లుకొని తింటున్నారు. అయితే నార్వే, ఆస్ట్రేలియాలో మాత్రం మాక్రోని, చీజ్ ఈ రెండూ నిషేధమే. వీటిలో వాడే రంగు కారణంగా వీటిని నిషేధించినట్టు ఆ ప్రభుత్వాలు చెప్పాయి.
టాపిక్