Egg Manchurian: సాయంత్రం వేళ వేడి వేడిగా ఎగ్ మంచూరియా తింటే ఆ మజాయే వేరు-egg manchurian recipe in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Manchurian: సాయంత్రం వేళ వేడి వేడిగా ఎగ్ మంచూరియా తింటే ఆ మజాయే వేరు

Egg Manchurian: సాయంత్రం వేళ వేడి వేడిగా ఎగ్ మంచూరియా తింటే ఆ మజాయే వేరు

Haritha Chappa HT Telugu
Dec 21, 2023 03:33 PM IST

Egg Manchurian: పిల్లలకు, పెద్దలకు నచ్చేలా ఎగ్ మంచూరియా రెసిపీ ఎలాగో తెలుసుకుందాం.

ఎగ్ మంచూరియన్ రెసిపీ
ఎగ్ మంచూరియన్ రెసిపీ (desicookingrecipes)

ఎగ్ మంచూరియా రెసిపీ

Egg Manchurian: కోడిగుడ్లతో చేసే ఏ వంటైనా టేస్టీగా ఉంటుంది. ఓసారి ఎగ్ మంచూరియా కూడా ట్రై చేయండి. రుచి అదిరిపోతుంది. పైగా ఎంతో ఆరోగ్యం కూడా. ఎగ్ రెసిపీలలో ఎగ్ మంచూరియా తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటుంది. కోడిగుడ్డుతో చేసిన వంటకాలు ఎన్నో పోషకాలతో ఉంటాయి. కాల్షియం, విటమిన్ డి గుడ్ల నుంచి లభిస్తుంది. మనకు అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలు కలిగిన ఏకైనా ఆహారం గుడ్డు.

ఎగ్ మంచూరియా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

కోడి గుడ్లు - అయిదు

మిరియాల పొడి - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

కార్న్ ఫ్లోర్ - రెండు స్పూన్లు

నూనె - సరిపడా

అల్లం తరుగు - ఒక స్పూను

వెల్లుల్లి తరుగు - ఒక స్పూను

ఉల్లి తరుగు - రెండు స్పూన్లు

పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూన్లు

చిల్లీ సాస్ - ఒక స్పూను

టొమాటో కెచప్ - ఒక స్పూను

సోయా సాస్ - ఒక స్పూను

ఉల్లికాడల తరుగు - రెండు స్పూన్లు

నీళ్లు - సరిపడినన్ని

వెనిగర్ - అరస్పూను

ఎగ్ మంచూరియా రెసిపీ

1. నాలుగు గుడ్లను ఉడికించి పొట్టు తీయాలి. ఆ గుడ్లను ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గుడ్డును కొట్టి వేయాలి. ఆ గుడ్డులో కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. చిటికెడు ఉప్పు కూడా వేసి కలపాలి.

3. ఈ మిశ్రమంలో గుడ్డు ముక్కలను వేసి నిమిషం పాటూ ఉంచాలి.

4. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వెయ్యాలి. నూనె వేడెక్కాక గుడ్డు ముక్కలను వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు స్టవ్ కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి.

6. నూనె వేడెక్కాక అల్లం తరుగు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి.

7. అందులోనే సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో కెచప్ ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్ వేసి కలపాలి.

8. స్టవ్ పెద్ద మంట పెట్టి ముందుగా వేయించుకున్న గుడ్డు ముక్కలను కూడా వేసి వేయించాలి.

9. దించే ముందు ఉల్లి కాడల తరుగును చల్లుకోవాలి.

అంతే టేస్టీ ఎగ్ మంచూరియా రెడీ అయినట్టే. ఇది సాయంత్రం వేళ స్నాక్స్ గా తినవచ్చు. ఎంతో శక్తిని అందిస్తాయి.

గుడ్డు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ చేరుతుందని చాలా మంది అనుకుంటారు. నిజానికి రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల ఎలాంటి చెడు కొలెస్ట్రాల్ చేరదు. ఎప్పడైతే అధికంగా గుడ్లు తింటారో అప్పుడు కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. అధికబరువుతో బాధపడే వారు వారానికి నాలుగు నుంచి అయిదు గుడ్లు మాత్రమే తినాలి. గుడ్డులో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. వాటిని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నిజానికి అన్నింటికన్నా ఉడికించిన గుడ్డు తినడమే ఆరోగ్యమే. ఎప్పుడూ అదే తినలేరు కాబట్టి ఇలా ఎగ్ మంచూరియా వంటివి చేసుకుని తిన్నా టేస్టీగా ఉంటుంది.

Whats_app_banner