Ayurveda Tips For Sleeping : ఇలా పడుకోగానే.. అలా నిద్ర పట్టే ఆయుర్వేద చిట్కాలు-ayurveda tips for sleeping bath oils for healthy sleep in summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ayurveda Tips For Sleeping : ఇలా పడుకోగానే.. అలా నిద్ర పట్టే ఆయుర్వేద చిట్కాలు

Ayurveda Tips For Sleeping : ఇలా పడుకోగానే.. అలా నిద్ర పట్టే ఆయుర్వేద చిట్కాలు

HT Telugu Desk HT Telugu
Apr 04, 2023 08:00 PM IST

Ayurveda Tips For Sleeping : ఈ కాలంలో నిద్ర అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. ఎంత ట్రై చేసినా నిద్రపట్టదు. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే.. త్వరగా పడుకోవచ్చు.

నిద్ర సమస్యలు
నిద్ర సమస్యలు

ఇలా పడుకోగానే.. కొంతమందికి అలా నిద్రపడుతుంది. వాళ్లు నిజంగా అదృష్టవంతులు. కొందరు.. దిండు మీద తల పెట్టిన 5 నిమిషాలకు గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఇలా జరిగేది.. కొందరికే. కానీ చాలా మంది మాత్రం నిద్ర సమస్యల(Sleeping Problems)తో బాధపడుతున్నారు. నిద్ర లేకుండా అల్లాడుతున్నారు. అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టదు. తెల్లవారుజామున కాస్త నిద్ర వస్తుంది.

ఈ కారణంగా తగినంత నిద్ర సరిపోదు. నిద్ర తక్కువగా ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు(Health Problems) కూడా పెరుగుతాయి. మనకు నిద్ర లేనప్పుడు, మనం అలసిపోతాం. పనిపై దృష్టి పెట్టలేం. శరీరంలో హార్మోన్లు మారుతాయి. అందుకోసమే.. నిద్ర చాలా ముఖ్యం. రోజులో 8 గంటల నిద్ర(8 Hours Sleep) పోవాలి. మీరు రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే కింద చెప్పేవి మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతాయి.

నల్పమరది తైలం.. మీకు ఆయుర్వేద(Ayurveda) దుకాణాల్లో దొరుకుతుంది. స్నానానికి ముందు ఈ నూనెను రాసుకుని గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ నూనె మాయిశ్చరైజర్ చర్మాన్ని రక్షిస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. సన్‌ టాన్‌(Sun Tan)ని తొలగించగలదు.

నీలభృంగాది తైలం.. తలకు పట్టించి మర్దన చేస్తే తల చల్లబడుతుంది. ఈ నూనెను అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. మాయిశ్చరైజర్ శిరోజాలను రక్షిస్తుంది. చుండ్రు(Dandruff)ను నివారిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. హెయిర్ రూట్‌ను బలోపేతం చేయడం వల్ల జుట్టు దట్టంగా పెరుగుతుంది. ఈ నూనెతో మసాజ్ చేస్తే మంచి నిద్ర కూడా వస్తుంది.

లావెండర్ ఆయిల్ నిద్రలేమి సమస్యను(Sleeping Disorder) నివారిస్తుంది. కాటన్ బాల్‌పై రెండు చుక్కల లావెండర్ ఆయిల్ వేసి మీ దిండు దగ్గర ఉంచండి, దాని సువాసన మీకు వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. చందనం నూనె.. ఇది మీకు మంచి నిద్రను కూడా ఇస్తుంది. మీ అరచేతి లేదా గుడ్డపై గంధపు నూనె చుక్క వేయండి. దాని వాసన మీ కళ్ళు త్వరగా నిద్రపోయేలా చేస్తుంది.

నిద్రలేమి చికిత్సలో యూకలిప్టస్ ఆయిల్ కూడా చాలా సహాయపడుతుంది. ఒక దూదిపై 2 చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి దిండు దగ్గర ఉంచితే మంచి నిద్ర వస్తుంది. వేసవిలో(Summer) మీరు మీ తలపై అప్లై చేసే నూనెలో పటిక కలపండి. మీ తలను చల్లబరుస్తుంది. మీరు త్వరగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది.

గమనిక : పైన చెప్పిన సమాచారం.. మాకు దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఏదైనా కొత్తగా ప్రయత్నించే ముందు నిపుణులను సంప్రదించండి.

WhatsApp channel

సంబంధిత కథనం