ASUS Vivobook 14 । ఏసస్ టచ్ స్క్రీన్ ల్యాప్‌టాప్.. ధర కూడా అందుబాటులోనే!
ఏసస్ కంపెనీ ASUS Vivobook 14 అనే ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఇది టచ్ స్క్రీన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి, ధర ఎంత తదితర వివరాలను చూడండి.
తైవాన్‌కు చెందిన టెక్ దిగ్గజం ASUS, తాజాగా భారత మార్కెట్‌లో Vivobook 14 touch (X1402) పేరుతో ఒక సరికొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్ టచ్ స్క్రీన్ సామర్ధ్యంతో వస్తుంది. బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం ప్రత్యేక ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా అసాధారణమైన బ్యాటరీ లైఫ్, అద్భుతమైన పనితీరుతో మల్టీ టాస్కింగ్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. యువతకు, పని చేసే నిపుణుల కోసం ఈ ల్యాప్‌టాప్ చాలా అనుకూలంగా ఉంటుంది. పూర్తి-నిడివి గల బ్యాక్‌లిట్ చిక్లెట్ కీబోర్డ్‌ను కలిగి ఉన్నందున ఎక్కువ సమయం పాటు సౌకర్యంగా పని చేసుకోవచ్చు.
ASUS Vivobook 14 ల్యాప్‌టాప్ కాంపాక్ట్ స్టైల్ డిజైన్‌తో వచ్చింది. ఇది 19.9mm మందంతో కేవలం 1.4kg బరువును కలిగి ఉన్న ఒక తేలికపాటి పరికరం, అయినప్పటికీ కఠినమైనదే. ఇది MIL-STD 810H పారామితులతో మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేట్ పొందింది.
ASUS Vivobook 14 ల్యాప్‌టాప్ క్వైట్ బ్లూ, ఐస్‌లైట్ సిల్వర్ అనే రెండు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. అయితే ఇది ర్యామ్, స్టోరేజ్ పరంగా ఏకైక కాన్ఫిగరేషన్లో అందుబాటులో ఉంటుంది.
సౌకర్యవంతమైన వైడ్ 178 డిగ్రీల వీక్షణ కోణంతో డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి మెరుగైన కంప్యూటింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది.ఇంకా ఈ ల్యాప్‌టాప్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత మొదలగు వివరాలను ఇక్కడ చూడండి.
ASUS Vivobook 14 ల్యాప్‌టాప్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 14 అంగుళాల ఫుల్ HD IPS LCD డిస్‌ప్లే
- 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- 12వ తరం ఇంటెల్ కోర్ i5-1240P ప్రాసెసర్
- Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్
- 42 WHrs బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్
కనెక్టివిటీ కోసం అవసరమైన అన్ని I/O పోర్ట్‌లను కలిగి ఉంది. ఇందులో భాగంగా USB 3.2 Gen 1 (Type-C), 2 x USB 3.2 Gen 1 (Type-A), USB 2.0, పూర్తి-పరిమాణ HDMI 1.4, 3.5mm ఆడియో జాక్, Wi-Fi 6 ఉన్నాయి.
ASUS Vivobook 14 ల్యాప్‌టాప్ ధర, రూ. 49,990/- నుండి ప్రారంభం అవుతుంది. ఇది ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.
సంబంధిత కథనం