Asus Zenbook S 13 OLED । ప్రీమియం ఫీచర్లతో ఏసుస్ నుంచి స్టైలిష్ ల్యాప్‌టాప్‌లు
టెక్ కంపెనీ Asus భారత మార్కెట్లో మూడు ప్రీమియం ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. వీటి ధరలు రూ. 54 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. మిగతా వివరాల కోసం ఈ స్టోరీ చదవండి.
తైవాన్‌కు చెందిన టెక్ దిగ్గజం ASUS భారత మార్కెట్‌లో Zenbook S 13 OLED పేరుతో ఒక కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ జెన్‌బుక్ S 13 మార్కెట్‌లో అత్యంత సన్నని, తేలికైన ల్యాప్‌టాప్ అని కంపెనీ పేర్కొంది. జెన్‌బుక్‌తో పాటు కొత్త కంపెనీ Vivobook Pro 14 OLED అలాగే Vivobook అనే మరో రెండు ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది.
ఇవి ప్రీమియం ల్యాప్‌టాప్‌లు కాబట్టి వీటి ధర ఎక్కువగానే ఉంటుంది. అలాగే ధరకు తగినట్లుగా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉంంటాయి.
భారత మార్కెట్లో Asus ZenBook S 13 OLED ధరలు రూ. 99,990/- నుంచి ప్రారంభమవుతుంది. ఇక Vivobook 14 Pro OLED ధరను రూ. 59,990/- గా నిర్ణయించగా VivoBook 16X ధరలు రూ. 54,990 /- నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ మూడు ల్యాప్‌టాప్‌లు ఏసుస్ ఇ-షాప్, ఏసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు, క్రోమా, వయాయ్ సేల్స్, రిలయన్స్ డిజిటల్ సహా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. ఒక్కొక్క ల్యాప్‌టాప్‌లో గల కీలక ఫీచర్లు, స్పెసిఫికేషన్లను ఇక్కడ తెలుసుకోండి.
ASUS ZENBOOK S13 OLED స్పెసిఫికేషన్‌లు
ZenBook S 13 2.8K రిజల్యూషన్‌తో 13.3-అంగుళాల OLED టచ్‌స్క్రీన్ ప్యానెల్‌ను కలిగి ఉంది. 89 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ సరికొత్త AMD Ryzen 6000 U సిరీస్ CPUల ద్వారా ఆధారంగా సమర్థవంతంగా పని చేస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో డ్యూయల్ స్పీకర్‌లు ఉన్నాయి. 16GB RAM, అలాగే 1TB వరకు SSD స్టోరేజ్ ఉంది. 65W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కలిగిన 67Whr బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ లో 720p HD కెమెరా, మూడు USB టైప్-C పోర్ట్‌లతో పాటు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఇచ్చారు.
Vivobook 14 Pro OLED స్పెసిఫికేషన్‌లు
ఈ ల్యాప్‌టాప్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 14-అంగుళాల 2.8K రెసల్యూషన్ ఉన్న డిస్‌ప్లేను కలిగి ఉంది. Ryzen 5 5600H CPU ఆధారంగా పనిచేస్తుంది. 16GB RAM అలాగే 512GB స్టోరేజ్ ఇచ్చారు. ఇందులో 90W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కలిగిన 50Whr బ్యాటరీతో నడుస్తుంది. మిగతావి 1 USB-A పోర్ట్, 2 USB టైప్-C పోర్ట్‌లు, HDMI పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ , మైక్రో SD కార్డ్ స్లాట్ ఉన్నాయి.
Vivobook 16X స్పెసిఫికేషన్‌లు
Vivobook 16X ల్యాప్‌టాప్ లో 16-అంగుళాల స్క్రీన్ ఉంటుంది. AMD Ryzen 7 5800H గేమింగ్-గ్రేడ్ CPU, 16GB RAM.. 512GB స్టోరేజ్, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఆకట్టుకునే 50 WHr బ్యాటరీని ఇచ్చారు.
సంబంధిత కథనం