Alu dosa: క్రిస్పీ ఆలూ దోశ.. నిమిషాల్లో సిద్దం..-alu dosa making detailed recipe in simple steps ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Alu Dosa: క్రిస్పీ ఆలూ దోశ.. నిమిషాల్లో సిద్దం..

Alu dosa: క్రిస్పీ ఆలూ దోశ.. నిమిషాల్లో సిద్దం..

HT Telugu Desk HT Telugu
Jun 27, 2023 06:30 AM IST

Alu dosa: బంగాళ దుంపతో రుచికరమైన దోశలు ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో చూసేయండి. రుచిలో చాలా బాగుంటుంది.

క్రిస్పీ ఆలూ దోశ
క్రిస్పీ ఆలూ దోశ

దోశెల్లో చాలా రకాలుంటాయి. ఎప్పుడూ రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం. ఒకసారి ఈ బంగాళదుంపతో చేసే దోశ కూడా రుచి చూసేయండి. పిండి పులియబెట్టాల్సిన పని లేకుండా వెంటనే ఈ దోశ వేసుకోవచ్చు. తయారీ కూడా సులభమే.

yearly horoscope entry point

కావాల్సిన పదార్థాలు:

4 ఉడికించిన బంగాళదుంపలు

కప్పు బియ్యం పిండి

పావు కప్పు సన్నం రవ్వ

తగినంత ఉప్పు

రెండు చెంచాల సన్నని ఉల్లిపాయ ముక్కలు

రెండు చెంచాల కొత్తిమీర తరుగు

2 పచ్చిమిర్చి సన్నని ముక్కలు

సగం చెంచా జీలకర్ర

రెండు చెంచాల నూనె

తయారీ విధానం:

  1. మిక్సీ జార్ లో ఉడికించిన బంగాళదుంపల ముక్కలు వేసుకుని మెత్తని ముద్దలాగా చేసుకోవాలి. అవసరమైతే కప్పు నీళ్లు పోసుకుని మెత్తగా పట్టుకోవాలి.
  2. ఈ మిశ్రమాన్ని పెద్ద గిన్నెలోకి తీసుకుని బియ్యం పిండి, రవ్వ, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇందులో నాలుగున్నర నుంచి 5 కప్పుల నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  3. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చి మిర్చి ముక్కలు, జీలకర్ర కూడా వేసుకుని కలుపుకోవాలి.
  4. పదినిమిషాలయ్యాక ఈ పిండిని మరోసారి కలుపుకుని దోశలు వేసుకోవాలి. పెనం పెట్టుకుని సన్నని దోశలాగా వేసుకోవాలి. అంచుల వెంబడి నూనె వేసుకుని కాల్చుకోవాలి.
  5. రెండు వైపులా క్రిస్పీగా కాల్చుకున్నాక మీకిష్టమైన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలు.

Whats_app_banner