Today Rasi Phalalu: నేడు ఈ రాశి వారు కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.. శుభవార్తలు, ధనంతో పాటు బోలెడు లాభాలు-today rasi phalalu december 25th these zodiac signs will get many benefits including wealth good things new beginnings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేడు ఈ రాశి వారు కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.. శుభవార్తలు, ధనంతో పాటు బోలెడు లాభాలు

Today Rasi Phalalu: నేడు ఈ రాశి వారు కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.. శుభవార్తలు, ధనంతో పాటు బోలెడు లాభాలు

HT Telugu Desk HT Telugu
Dec 25, 2024 04:00 AM IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 25.12.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Today Rasi Phalalu: నేడు ఈ రాశి వారు కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు
Today Rasi Phalalu: నేడు ఈ రాశి వారు కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు

రాశి ఫలాలు (దిన ఫలాలు) : 25.12.2024

yearly horoscope entry point

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: మార్గశిరం, వారం : బుధవారం, తిథి : కృ.దశమి, నక్షత్రం : చిత్ర

మేష రాశి

ఆర్థికంగా బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. కొత్త పనులు చేపడతారు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. భేషజాలకు పోవద్దు. చెల్లింపుల్లో జాగ్రత్త.

వృషభ రాశి

అనుకూలతలు అంతంత మాత్రమే. ఆచితూచి అడుగేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. పిల్లల దూకుడు అదుపుచేయండి. కీలక పత్రాలు అందుకుంటారు. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.

మిధున రాశి

కార్యసాధనకు సంకల్పసిద్ధి ప్రధానం. ధైర్యంగా యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. శనివారం నాడు అపరిచితులతో జాగ్రత్త. అందరితోనూ మితంగా సంభాషించండి. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పత్రాల రెన్యువల్ లో ఏకాగ్రత వహించండి.

కర్కాటక రాశి

అన్ని విధాలా అనుకూలదాయకం. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ధనలాభం ఉంది. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధువులతో సంబంధాలు మరింత బలపడతాయి. ఆదివారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయాన్నీ సమస్యగా పరిగణించవద్దు. ఆత్మీయులతో సంభాషణ కార్యోన్ముఖులను చేస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు.

సింహ రాశి

కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. గుట్టుగా మెలగండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ప్రణాళికాబద్దంగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి.

కన్య రాశి

ఈ వారం కలిసి వచ్చే సమయం. ధైర్యంగా ముందుకు సాగుతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆర్థికపరంగా మంచి ఫలితాలున్నాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. బంధు మిత్రులతో కాలక్షేపం చేస్తారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడికి గురికావద్దు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది.

తుల రాశి

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగుంటుంది. ఆత్మీ యులతో ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి. పరిచయస్తులతో తరచూ సంభాషిస్తారు. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగ వద్దు, ఆరోగ్యం జాగ్రత్త, ఆధ్మాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృశ్చిక రాశి

విశేష ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశావహ దృక్పథంతో మెలగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. రావలసిన ధనం అందుతుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు.. ఒక శుభవార్త గృహంలో సంతోషాన్ని నింపుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.

ధనుస్సు రాశి

శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సంకల్పబలంతో లక్ష్యాన్ని సాధిస్తారు. బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఊహించని ఖర్చులుంటాయి, పొదుపునకు అవకాశం లేదు. సోమ, మంగళవారాల్లో కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. అందరితోనూ మితంగా సంభాషించండి. ఆగ్రహావేశాలకు గురికావద్దు.

మకర రాశి

కార్యసాధనకు ఓర్పు ప్రధానం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అనుమానాలు, అపోహలకు గురికావద్దు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సామరస్యంగా మెలగండి. విమర్శించిన వారే తమ తప్పును తెలుసుకుంటారు. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆప్తులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు.

కుంభ రాశి

రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. చిన్న విషయానికే చికాకుపడతారు. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. పట్టుదలతోనే అనుకున్నది సాధిస్తారు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. దుబారా ఖర్చులు విపరీతం. గురువారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.

మీన రాశి

చక్కని ప్రణాళికలతో ముందుకు సాగుతారు. అంచనాలు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పనులు చురుకుగా సాగుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. గిట్టని వ్యక్తులతో జాగ్రత్త. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆత్మీయులతో తరుచూ సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner