Alcohol - Alzheimer’s Disease | మత్తు ఎక్కువైతే మతిమరుపు పెరుగుతుందట!-a new study founds alcohol consumption may increase risk of alzheimers disease ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  A New Study Founds Alcohol Consumption May Increase Risk Of Alzheimers Disease

Alcohol - Alzheimer’s Disease | మత్తు ఎక్కువైతే మతిమరుపు పెరుగుతుందట!

HT Telugu Desk HT Telugu
Feb 19, 2023 10:30 AM IST

Alcohol - Alzheimer’s Disease: అతిగా మద్యం చేసినా, మితంగా సేవించినా, ఒక్కసారిగా ఆపేసినా అన్ని రకాలుగా మద్యపానం నష్టాలను కలిగిస్తుంది. తాజా పరిశోధనలో అల్కాహాల్ మతిమరుపు వ్యాధికి కారణం అవుతుందని తేలింది.

Alcohol - Alzheimer’s Disease
Alcohol - Alzheimer’s Disease (Freepik)

Alcohol - Alzheimer’s Disease: కొంత మంది వ్యక్తులు రాత్రి అల్కాహాల్ సేవించి చాలా విషయాలు మాట్లాడుతారు, ఉదయానికల్లా అవన్నీ మర్చిపోతారు. రాత్రి మాట్లాడినవి గుర్తు చేసినా కూడా వారికేమి గుర్తుండవు, అవునా? నిజంగా నేను అలా అన్నానా అంటూ గజినీలా ప్రవర్తిస్తారు. వారు మద్యపానం మానేయకపోతే నిజంగా గజినీలు అయిపోయే అవకాశం ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

అతిగా అల్కాహాల్ సేవించే వారిలో సినైల్ డెమెన్షియా వ్యాధికి కారణం అవుతుంది. దీనినే అల్జీమర్స్ అని కూడా అంటారు. ఇది వ్యక్తుల్లో చిత్తవైకల్యాన్ని కలిగిస్తుంది. వేక్ ఫారెస్ట్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, దాదాపు 60 నుండి 80 శాతం అల్జీమర్ కేసుల్లో ఆల్కాహాల్ వినియోగం వలన సంభవించినవే. తక్కువ మొత్తంలో మద్యం సేవించడం కూడా మెదడు క్షీణతను పెంచుతుందని అధ్యయనం తెలిపింది. ఆల్కాహాల్ మెదడులోని కణాలను నాశనం చేసి, వాటి స్థానంలో విషపూరిత ప్రోటీన్లు అయిన అమిలాయిడ్ ఫలకాల సంఖ్యను పెంచుతుంది. దీనివలన మెదడు పనితీరు దెబ్బతింటుంది.

Alcohol Causes Alzheimer's- ఆల్కాహాల్ అల్జీమర్స్‌కు కారకం

అల్జీమర్స్ వ్యాధికి సంబంధించిన పాథాలజీ కోసం శాస్త్రజ్ఞులు ఎలుకలపై ప్రయోగం చేశారు. మద్యపానం ప్రభావాలకు సంబంధించి ఈ పరీక్ష నమూనాలు మానవ ప్రవర్తనను అనుకరిస్తాయి. ఇందులో భాగంగా ఎలుకలు కొన్నింటికి 10 వారాల పాటు నీటిని అందించగా, మరికొన్నింటికి మద్యాన్ని అందించారు. ఈ పరిశోధనలో ఆల్కహాల్ తీసుకోవడం వలన ఆరోగ్యకరమైన మెదడు పనితీరును ఎలా మార్చిందో, అల్జీమర్స్ వ్యాధి ప్రారంభ దశలతో సంబంధం ఉన్న పాథాలజీని తనిఖీ చేశారు.

ఆసక్తికరంగా, ఆల్కహాల్ మెదడులో అమిలాయిడ్-బీటా స్థాయిలను పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు, ఇది అల్జీమర్స్ వ్యాధి సంభవించినపుడు మెదడులో కనిపించే కీలకమైన ప్రోటీన్. ఆల్కాహాల్ కారణంగా ఎక్కువ సంఖ్యలో చిన్న ఫలకాలతో సహా అమిలాయిడ్ ఫలకాల సంఖ్య పెరిగింది. ఈ ఫలకాలు దశల వారీగా మరింత విస్తరిస్తాయి, ఫలితంగా మెదడు కుచించుకుపోతుంది. అతిగా ఆల్కాహాల్ అందించి ఒక్కసారిగా ఆపివేయడం వలన దీని పెరుగుదల ఎక్కువగా ఉన్నట్లు కూడా పరిశోధకులు గుర్తించారు. అల్జీమర్స్ ప్రారంభ దశలో మతిమరుపును కలుగజేస్తుంది, ఆ తర్వాత మానసిక స్థితిని దెబ్బతీసే తీవ్రమైన అనారోగ్య పరిస్థితి.

తాజా అధ్యయనంలో, మితమైన మద్యపానం కూడా రక్తంలో చక్కెరను పెంచుతుందని, ఇది ఇన్సులిన్ నిరోధకత లక్షణాలను తీవ్రతరం చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు, అంటే ఆల్కాహాల్ కేవలం అల్జీమర్స్ వ్యాధికి మాత్రమే కాకుండా, టైప్ 2 డయాబెటిస్, Alcohol Cardiomyopathy వంటి హృదయ సంబంధ వ్యాధులు, ఇతర వ్యాధులకు కూడా ప్రమాదాన్ని పెంచుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం