WeightLoss: సూప్ తాగుతూ వారంలో మూడు కిలోలు తగ్గిన వ్యక్తి, ఎలాగో వివరించిన అతని డైటీషియన్-a man who lost three kilos in a week drinking soup his dietician explained how ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weightloss: సూప్ తాగుతూ వారంలో మూడు కిలోలు తగ్గిన వ్యక్తి, ఎలాగో వివరించిన అతని డైటీషియన్

WeightLoss: సూప్ తాగుతూ వారంలో మూడు కిలోలు తగ్గిన వ్యక్తి, ఎలాగో వివరించిన అతని డైటీషియన్

Haritha Chappa HT Telugu
Oct 01, 2024 04:30 PM IST

WeightLoss: బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన ఆహారం తినాలని మీకు ఇప్పటికే తెలుసు. కానీ బరువు తగ్గడానికి మీకు సహాయపడే వంటకాలను ప్రయత్నించేటప్పుడు పరిగణించవలసిన అనేక ఇతర విషయాలు ఉన్నాయి.

బరువు తగ్గించే సూప్ రెసిపీ
బరువు తగ్గించే సూప్ రెసిపీ (Pixabay)

మీరు వేగంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. ఒక వ్యక్తి వారంలో మూడు కిలోలు తగ్గాడు. కేవలం ఏడు రోజుల్లో మూడు కిలోలు తగ్గడమంటే మామూలు విషయం కాదు, ఆహారంలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా, వ్యాయామం చేయడం ద్వారా బరువు సులువుగా, త్వరగా తగ్గవచ్చు. ఒక వ్యక్తి ఏడు రోజుల్లో మూడు కిలోలు ఎలా తగ్గాడో అతని డైటీషియన్ సోషల్ మీడియాలో వివరించింది.

వెయిట్ లాస్ సూప్

1.4 మిలియన్లకు పైగా యూట్యూబ్ సబ్ స్క్రైబర్లను కలిగి ఉన్న డైటీషియన్ నటాషా మోహన్. ఇటీవల తన ఫాస్ట్ వెయిట్ లాస్ డిన్నర్ రెసిపీ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. 'నా క్లయింట్ రోజూ దీన్ని తినేవాడు. 7 రోజుల్లో 3 కిలోల బరువు తగ్గారు’ అని చెప్పింది. ఆ సూప్ ను అందరితో ఆమె పంచుకుంది.

ఈ వీడియోలో, పనీర్ ముక్కలను ఎండబెట్టారు. క్యారెట్, గ్రీన్ బీన్స్, పాల కూర, పుట్టగొడుగులను ముక్కలు చేసి పెట్టారు. ఓట్స్ నీటిలో వేసి ఉడుకుతున్నప్పుడే ఈ కూరగాయలను కూడా అందులో వేసి ఉడికించింది. తరిగిన వెల్లుల్లిని పైన చల్లింది. రుచికి సరిపడా ఉప్పును వేసింది. మిరియాల పొడి, సోయా సాస్, తాజా కొత్తిమీర ఆకుల తరుగు వేసి కలిపింది. అంతే వేడి వేడి సూప్ రెడీ అయిపోతుంది. దీన్ని ప్రతిరోజూ రాత్రి లేదా బ్రేక్ ఫాస్ట్ లో తినడం అలవాటు చేసుకుంటే మంచిది. దీని వల్ల బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంది.

ఈ సూప్‌ను డిన్నర్లో తింటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే 90 కిలోలకు పైగా బరువు ఉన్నవారు ఈ సూప్ వల్ల వారంలోనే మూడు కిలోలు బరువు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే వారి శరీరంలో ఉండే నీరు కోల్పోతారు. కానీ ఆ వ్యక్తి బరువు 70 కిలోలు అనుకుంటే, అతను వేగంగా బరువు తగ్గలేడు. వారంలో బరువు తగ్గడం కూడా చాలా కష్టం. డిన్నర్ లో ఈ సూప్ తీసుకోవడం ద్వారా వెంటనే బరువు తగ్గకపోయినా కొన్ని రోజుల్లో ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు. బరువు తగ్గడం వ్యక్తి ప్రస్తుత బరువు, ఎత్తు, జీవక్రియ రేటుపై ఆధారపడి ఉంటుంది. స్థూలకాయం ఉన్నవారితో పోలిస్తే ఎక్కువ కండర ద్రవ్యరాశి ఉన్నవారు వేగంగా బరువు తగ్గుతారు. వారిలో కొవ్వు పేరుకుపోతుంది.

కేలరీల తీసుకోవడం తగ్గించడం ద్వారా, వేగంగా బరువును తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇది కాకుండా, మీ భోజన సమయాలు కూడా ప్రతిరోజూ ఒకేలా పాటించడం ముఖ్యం. రాత్రి పూట ఏడుగంటలకే భోజనాన్ని పూర్తిచేయడం చాలా మంచిది.

టాపిక్