Winter Healthcare : చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. పసుపును మీ డైట్లో కలిపేయండి..
Winter Healthcare : శీతాకాలం వచ్చిందంటే చాలు.. దగ్గు, జలుబు, జ్వరం వంటివి మేము వచ్చేస్తున్నాం అంటాయి. ఈ సమయంలో రోగ నిరోధక శక్తి కచ్చితంగా పెంచుకోవడం అవసరం. పసుపు రోగనిరోధకశక్తిని పెంచే బూస్టర్ అని మన అందరికీ తెలుసు. మరి దానివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందగలమో ఇప్పుడు తెలుసుకుందాం.
Winter Healthcare : చలికాలంలో అనారోగ్యాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. మనలోని ఇమ్యూనిటీ సిస్టమ్ ఈ కాలంలో త్వరగా దెబ్బతింటుంది. అందుకే మనం రోగనిరోధక శక్తిని పెంచే.. ఆహారాలపై దృష్టి పెట్టడం చాలా అవసరం. దానిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పసుపు. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అని మనందరికీ తెలుసు. దీనిని ఆహారంతో కలిపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు. ఇది రోగనిరోధక శక్తిని పెంచి.. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్ గా పని చేస్తుంది. మరి ఏయే సమస్యలకు పసుపు పని చేస్తుందో.. ఇప్పుడు తెలుసుకుందాం.
నొప్పి, ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం
సైనస్ సమస్యలు, ఇన్ఫెక్షన్ల నుంచి పసుపు ఉపశమనం ఇస్తుంది. మీరు తక్షణ ఉపశమనం కోసం పాలు, టీ వంటి పానీయాలలో కొద్దిగా పసుపును కలిపి తీసుకోవచ్చు.
బ్లడ్ షుగర్ నియంత్రిస్తుంది
పసుపును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది. పసుపు వంటి యాంటీ ఆక్సిడెంట్ శరీరం లోపలి నుంచి బ్లడ్ షుగర్ స్థాయిలు పెరగకుండా సహాయం చేస్తుంది. తీవ్రమైన చలికాలాన్ని తట్టుకోవడానికి లిపిడ్లు, ప్రొటీన్లు అధికంగా ఉండే భోజనం తీసుకోవాలి.
చర్మ ప్రయోజనాలు
జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. పసుపుతో కూడిన ఆహారాన్ని తినడం వల్ల మీ శరీరం కాలుష్య కారకాలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇది మీ చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపును ఇస్తుంది.
ఫ్లూ నుంచి ఉపశమనం
ఫ్లూ సీజన్ అధికారికంగా శీతాకాలం ప్రారంభంతో ప్రారంభమవుతుంది. అయితే పసుపు పాలను చాలామంది సహజ నివారణగా తీసుకుంటారు. ఒక కప్పు పసుపు పాలు తీసుకోవడం వల్ల మీ శ్వాసకోశానికి ఎటువంటి ఇబ్బందులు కలగవు.
గర్భిణీ స్త్రీలు
గర్భిణీ స్త్రీలకు స్వల్ప అనారోగ్యం వచ్చినప్పుడు ఓదార్పు కోసం పసుపు పాలను ఆశ్రయిస్తారు. పసుపు గొంతు నొప్పిని తగ్గిస్తుంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నిర్మూలనలో సహాయపడుతుంది.
సహజ యాంటీ ఆక్సిడెంట్
ఆయుర్వేదం, భారతీయ వంటకాల్లో పసుపును ఉపయోగిస్తారు. పసుపు అద్భుతమైన వైద్య ప్రభావాలను కలిగి ఉంది. ఇది సహజమైన యాంటీఆక్సిడెంట్ అనేది వాస్తవం. ఇది మీ శరీరం నుంచి టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది.
దీర్ఘకాలిక ప్రయోజనాలు
రక్తాన్ని పల్చగా మార్చడం, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం, అల్జీమర్స్ వ్యాధికి చికిత్స చేసే సామర్థ్యం పసుపులో ఉంది. దీనిని మీ డైట్లో చేర్చుకునేప్పుడు వైద్యుని సలహా కచ్చితంగా తీసుకోండి.
సంబంధిత కథనం
టాపిక్