Sudden Weight Gain : అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నారా? అయితే కారణాలు ఇవే..-5 reasons why you have suddenly started gaining weight here is the reasons ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sudden Weight Gain : అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నారా? అయితే కారణాలు ఇవే..

Sudden Weight Gain : అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నారా? అయితే కారణాలు ఇవే..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 03, 2022 02:37 PM IST

Sudden Weight Gain : ఒక్కోసారి ఎంత కేర్ తీసుకున్నా.. బరువు పెరిగిపోతూ ఉంటాము. అదేంటి నేను మంచి ఫుడ్ తీసుకుంటున్నాను.. జిమ్​కి వెళ్తున్నాను.. కేలరీలు బర్న్ చేస్తున్నాను.. ఇంత శ్రద్ధ తీసుకుంటున్నా ఎందుకు బరువు పెరుగుతామో అని ఆలోచిస్తున్నారా? అయితే దానికి కారణాలు లేకపోలేదు. అవేంటో మీరే ఇప్పుడు తెలుసుకోండి.

అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నారా?
అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నారా?

Sudden Weight Gain : బరువు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. అదే బరువు పెరగడం చిటికెలో జరిగిపోతుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం నిరాశ, గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఆరోగ్యంగా తింటాము, వ్యాయామం చేస్తాము.. మంచి జీవనశైలిని కొనసాగిస్తాము.. ఇవన్నీ చేసినా మీరు బరువు పెరుగుతున్నారా? అయితే మీరు చింతించకండి. మీరు బరువు పెరగడం వెనుక ఈ కారణాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి. వాటిని అదుపులో ఉంచితే.. మీరు మళ్లీ బరువు తగ్గవచ్చు. ఫిట్​గా మారవచ్చు.

ఎంత తింటున్నారు..

ఆరోగ్యానికి మంచిదని ఫుడ్ తీసుకుంటున్నారు కరెక్టే. కానీ ఎంత మోతాదులో ఆ ఫుడ్ తీసుకుంటున్నారనేది చెక్ చేసుకోండి. ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తీసుకుంటే.. అది మీకు ఇబ్బందులను ఇస్తుంది. దానిలో బరువు పెరగడం కూడా ఒకటి. ఆరోగ్యంగా తినడం అనేది చాలా ముఖ్యం. అయితే మీరు ఎంత తింటున్నారో అనేదానిపై శ్రద్ధ వహించండి.

అవకాడోస్, వోట్మీల్, క్వినోవా, డార్క్ చాక్లెట్, నట్స్, బటర్ వంటి అనేక పోషకమైన ఆహారాల్లో.. కేలరీలు దట్టంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే.. బరువు పెరుగుతారు. అలాగే మీరు ఆరోగ్యంగా ఉండాలనే తపనతో.. రుచిలేని ఆహారాన్ని ఎక్కువగా తింటుంటే.. మీరు ఎక్కువ ఫుడ్ కోరికలకు లోనవుతారు.

వర్కవుట్ తర్వాత అతిగా తింటే..

వర్కవుట్ చేసినా బరువు ఎందుకు పెరుగుతున్నారని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు వ్యాయామం చేయడానికి వెచ్చించే సమయం దీనికి కారణం కావొచ్చు. ఎక్కువ కష్టపడి ఎక్కువ కేలరీలు ఖర్చు చేస్తున్నాము అనుకుంటాము కానీ.. ఎక్కువ అలసి పోయి.. తెలియకుండానే ఎక్కువ ఫుడ్ తీసేసుకుంటాము. లిమిటెడ్​గా జిమ్​ చేయండి. లిమిటెడ్​గా ఫుడ్ తీసుకోండి.

తగినంత నీరు తాగక..

ప్రతి భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం అధ్యయనం కనుగొంది. కాబట్టి తగినంత నీరు తాగకపోతే.. మీ బరువుపై వ్యతిరేక ప్రభావం వస్తుంది. తగినంత నీరు తాగడం వలన మీ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. కాబట్టి మీరు మీ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ తినరు.

బ్రేక్​ఫాస్ట్ సరిగ్గా తినకపోతే..

ఉదయం తగినంత ఆహారం తీసుకుంటే.. రాత్రిపూట అతిగా తినకుండా ఉంటాము. మనం భోజనానికి కూర్చునే వరకు రోజంతా ఎంత ఆకలితో ఉన్నామో.. మనకు తెలియకపోవడం తరచుగా జరుగుతుంది.

రాత్రిపూట అధికంగా తింటే కచ్చితంగా బరువు పెరుగుతాము. కాబట్టి ఉదయం కరెక్ట్​గా ఫుడ్ తీసుకుంటే.. రాత్రి తక్కువగా తీసుకుంటాము. దీనివల్ల బరువు అదుపులో ఉంటుంది.

అధిక ఉప్పు మరోకారణం

చాలా మంది సిఫార్సు చేసిన దానికంటే.. గరిష్ట స్థాయిలో ఉప్పును ఎక్కువగా తీసుకుంటారు. ఉప్పులో ఉండే సోడియం నీటిని నిలుపుకునేలా చేస్తుంది. కడుపు ఉబ్బరం కలిగిస్తుంది. మీ గట్ నీటిని నిల్వ చేస్తుంది. మీ కడుపులో అకస్మాత్తుగా బరువు పెరిగినట్లు అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఇది నీటి బరువు. మీ సోడియం తగ్గించుకోవడానికి ఎక్కువ నీరు తీసుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం