Ways to befriend stress: స్ట్రెస్‌తో దోస్తీ చేసేందుకు 4 మార్గాలు
ways to befriend stress: స్ట్రెస్‌తో మరింత ఆందోళన చెందే బదులు, దానికి మీరు స్పందించాల్సిన తీరును తెలుసుకోవడం మంచిందంటున్నారు మానసిక వైద్య నిపుణులు.
స్ట్రెస్ ఎలా ఎదర్కోవాలి? దాని నుంచి ఎలా బయటపడాలి? అన్న ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నారా? ఉద్యోగంలో ఒత్తిళ్లు, ఆర్థికపరమైన ఒత్తిళ్లు, వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్య సమస్యలు వంటి వల్ల మీరు స్ట్రెస్ ఎదుర్కొంటున్నట్టయితే.. ఈ విషయంలో ఇలా ఇబ్బంది పడుతున్నది మీరు ఒక్కరే కాదని గమనించాలి. స్ట్రెస్ అంత చెడ్డదేం కాదని, ఒకరకంగా అత్యంత శక్తిమంతమైనదని, కొన్ని మార్పులను, తీసుకోవాల్సిన చర్యలను స్ట్రెస్ సూచిస్తుందని మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
యోగా ఇమ్మోర్టల్స్ ఫౌండర్ శివానంద్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్ట్రెస్ గురించి మాట్లాడారు. స్ట్రెస్‌తో మీరు వ్యవహరించే తీరులోనే అంతా ఉంటుంది. స్ట్రెస్ రావడాన్ని మనం కంట్రోల్ చేయలేకపోవచ్చని, అయితే అది వచ్చినప్పుడు దాని పట్ల మనం ప్రతిస్పందన ఎలా ఉండాలన్నదే అత్యంత ముఖ్యమైందని వివరించారు. స్ట్రెస్‌తో డీల్ చేస్తూ చాలా కఠినమైన పరిస్థితుల నుంచి కోలుకున్న వారు నాకు తెలుసు..’ అని చెప్పారు.
‘స్ట్రెస్‌ను ఎదుర్కొనే మార్గాలను తెలుసుకునే బదులు.. స్ట్రెస్‌తో మీ హెల్తీ రిలేషన్ నిర్మించుకునేందుకు ఒక సొంత వ్యవస్థను నిర్వచించుకోండి. ఇది మీ భావోద్వేగాలను సమర్థవంతంగా వ్యక్తీకరించడానికి, అనూహ్య పరిస్థితులను ఎదుర్కొనడానికి ఉపయోగపడుతుంది..’ అని వివరించారు.
యోగా ఆధారిత ధ్యాన పద్ధతులు పాటించండి
ధ్యాన పద్ధతులు మానసిక ఆరోగ్య పరిస్థితులను కుదుటపరచడమే కాకుండా జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా సింపథెటిక్, పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థలను సక్రియం చేయడం, శ్వాసక్రియ, శరీర స్పృహ, ఎంపిక ప్రక్రియపై అవగాహన, విజువలైజేషన్ వంటి పద్ధతులతో అనుసంధానితమై ఉన్న ధ్యాన పద్ధతులు ఆచరించాలి. 4 నుంచి 6 వారాలు ఈ పద్ధతులు ఆచరిస్తే యాంగ్జైటీ, డిప్రెషన్, నిద్రలేమిని తిప్పికొట్టవచ్చని అధ్యయనాలు నిరూపించాయి.
2. జర్నల్ రాయండి
మీలో సానుకూల విశ్వాస వ్యవస్థలను బలోపేతం చేయడానికి, మీ అత్యున్నత సామర్థ్యాన్ని వెలికితీయడంలో మీకు సహాయపడే న్యూరోపాత్‌వేలను రూపొందించడానికి ప్రతిరోజూ ఒక డైరీలాగా జర్నల్ రాయడం ఒక అద్భుతమైన మార్గం. సానుకూల ఉద్దేశాలు, సానుకూల భావోద్వేగాలతో ప్రతిరోజూ మీ తక్షణ, మధ్య-కాల, దీర్ఘకాలిక లక్ష్యాల వివరాలను విజువలైజ్ చేసి జర్నల్‌లో రాయండి.
3. కృతజ్ఞతా భావాన్ని తరచుగా వ్యక్తపరచండి
కృతజ్ఞత భావోద్వేగానికి నయం చేసే శక్తి ఉంటుంది. పగటిపూట మీరు అనుభవించిన చిన్న చిన్న విషయాలకు, మీరు నేర్చుకోవడంలో, ఎదగడంలో, అభివృద్ధి చెందడంలో మీకు సహాయపడే అన్నింటి పట్ల, అందరి పట్ల కృతజ్ఞతతో వ్యవహరించండి. ఇది మీ సొంత బలాన్ని, సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి తోడ్పడుతుంది.
4. అవగాహన తెచ్చుకోండి
మీ ఆలోచనలు, మాటలు, చర్యల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు కూర్చున్నప్పుడు, తిన్నప్పుడు లేదా మాట్లాడేటప్పుడు కూడా ధ్యాస ఉంచండి. పూర్తి ధ్యాసతో రోజులో కనీసం ఒక కార్యకలాపం చేయండి. వర్తమానంపై శ్రద్ధ పెట్టండి. మీ జీవితంలో చురుకైన చోదక శక్తిగా ఉండండి. లక్ష్యంతో కూడిన జీవితాన్ని గడపండి. ఏదోలా కాలం గడిపేయకండి.
టాపిక్