Weekend OTT Releases: ఓటీటీల్లో ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే-weekend ott releases movies and web series to watch on ott netflix prime video disney plus hotstar aha zee5 ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Weekend Ott Releases: ఓటీటీల్లో ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Weekend OTT Releases: ఓటీటీల్లో ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Hari Prasad S HT Telugu
Jun 14, 2024 04:46 PM IST

Weekend OTT Releases: ఓటీటీల్లో ఈ వీకెండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ చూడొచ్చు. వీటిలో హారర్ థ్రిల్లర్స్ తోపాటు వివిధ జానర్లకు సంబంధించిన కంటెంట్ అందుబాటులో ఉంది.

ఓటీటీల్లో ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే
ఓటీటీల్లో ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Weekend OTT Releases: వీకెండ్ వచ్చేసింది. ఓటీటీలు ఎప్పటిలాగే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ తో సిద్ధంగా ఉన్నాయి. పైగా ఈసారి ఫాదర్స్ డే కూడా ఉండటంతో వినోదం రెట్టింపు కానుంది. మరి ఈ వీకెండ్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ఆహా, జీ5 లాంటి ఓటీటీల్లో అందుబాటులో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ ఏవో ఇక్కడ చూడండి.

వీకెండ్ ఓటీటీ రిలీజెస్

డియర్ నాన్న - ఆహా ఓటీటీ

చైతన్య రావు నటించిన డియర్ నాన్న మూవీ శుక్రవారం (జూన్ 14) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సండే (జూన్ 16) ఫాదర్స్ డే ఉండటంతో ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

యక్షిణి వెబ్ సిరీస్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ఓ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ శుక్రవారం (జూన్ 14) ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సిరీస్ పేరు యక్షిణి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ జానర్ ఇష్టపడే వాళ్లు ఈ సిరీస్ తప్పకుండా చూడండి.

పరువు వెబ్ సిరీస్ - జీ5 ఓటీటీ

చిరంజీవి కూతురు సుష్మిత ప్రొడ్యూస్ చేసిన వెబ్ సిరీస్ పరువు. నివేదా పేతురాజ్ నటించిన ఈ సిరీస్ జీ5 (zee5) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం (జూన్ 14) నుంచే ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది.

పారిజాతపర్వం - ఆహా ఓటీటీ

చైతన్య రావు నటించిన మరో మూవీ పారిజాతపర్వం. ఈ సినిమా గత బుధవారం (జూన్ 12) నుంచే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రైమ్ కామెడీ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి - నెట్‌ఫ్లిక్స్

విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేయడం విశేషం. మే 31న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు శుక్రవారం (జూన్ 14) నుంచే నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

గాంత్ వెబ్ సిరీస్ - జియో సినిమా

గాంత్ ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. జియో సినిమాలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓ మూకుమ్మడి ఆత్మహత్య కేసును ఓ సైకియాట్రికన్ ఇంటర్న్ తో కలిసి ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా పరిష్కరించాడన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు.

మహరాజ్ - నెట్‌ఫ్లిక్స్

ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటించిన మూవీ మహరాజ్. అతని తొలి సినిమా ఇదే. ఈ మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. దేశానికి స్వతంత్రం రాక ముందు 19వ శతాబ్దంలోని ఓ ధైర్యవంతుడైన జర్నలిస్టు కథే ఈ మహరాజ్.

లవ్ కీ అరేంజ్ మ్యారేజ్ - జీ5 ఓటీటీ

అవ్ కీ అరేంజ్ మ్యారేజ్ ఓ రొమాంటిక్ కామెడీ డ్రామా. ఈ హిందీ మూవీలో అన్నూ కపూర్, సుప్రియా పాఠక్, రాజ్‌పాల్ యాదవ్ లాంటి సీనియర్ నటీనటులు నటించారు. ఈ సినిమా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.

WhatsApp channel