Dear Nanna OTT: ఒక్క రోజు గ్యాప్‌లో ఓటీటీలో టాలీవుడ్ హీరో రెండు సినిమాలు రిలీజ్ - డియ‌ర్ నాన్న స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-chaitanya rao dear nanna movie to stream on aha ott from june 14th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dear Nanna Ott: ఒక్క రోజు గ్యాప్‌లో ఓటీటీలో టాలీవుడ్ హీరో రెండు సినిమాలు రిలీజ్ - డియ‌ర్ నాన్న స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Dear Nanna OTT: ఒక్క రోజు గ్యాప్‌లో ఓటీటీలో టాలీవుడ్ హీరో రెండు సినిమాలు రిలీజ్ - డియ‌ర్ నాన్న స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Jun 12, 2024 06:03 AM IST

Dear Nanna OTT:30 వెడ్స్ 21 ఫేమ్ చైత‌న్య‌రావు హీరోగా న‌టించిన డియ‌ర్ నాన్న మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. జూన్ 14 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

డియ‌ర్ నాన్న ఓటీటీ
డియ‌ర్ నాన్న ఓటీటీ

Dear Nanna OTT: 30 వెడ్స్ 21 ఫేమ్ చైత‌న్య‌రావు హీరోగా న‌టించిన డియ‌ర్ నాన్న మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా జూన్ 14 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. తండ్రీ కొడుకుల అనుబంధం నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో చైత‌న్య‌రావుతో పాటు సీనియ‌ర్ యాక్ట‌ర్ సూర్య కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ప్రేమ‌, జీవితం, వార‌స‌త్వం అనే అంశాల చుట్టూ సాగే సెంటిమెంట్ మూవీ ఇద‌ని, తండ్రీ కొడుకుల ఎమోష‌న్స్‌తో హార్ట్ ట‌చింగ్‌గా ఉంటుంద‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు.

తండ్రీకొడుకుల అనుబంధం...

ఇందులో తండ్రి పాత్ర‌లో సూర్య క‌నిపించ‌బోతుండ‌గా...అత‌డి కొడుకుగా చైత‌న్య‌రావు క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. డియ‌ర్ నాన్న ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేయ‌డంతో పాటు మేక‌ర్స్ ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో చైత‌న్య‌రావు, సూర్య క‌నిపిస్తోన్నారు. వారి వెనుక‌షాడోలో మెడిక‌ల్ షాప్‌ను చూపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

తండ్రి మెడిక‌ల్ షాప్‌...కొడుకు చెఫ్‌....

ఓ మెడిక‌ల్ షాప్‌ను ర‌న్ చేసే వ్య‌క్తి త‌న కొడుకును కూడా ఫార్మ‌సిస్ట్‌గానే చూడాల‌ని కోరుకుంటాడు. తాను ర‌న్ చేసే మెడిక‌ల్ షాప్ బాధ్య‌త‌ల‌ను కొడుకుకు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. మెడిక‌ల్ షాప్ ఓన‌ర్‌ కొడుకు మాత్రం చెఫ్ కావాల‌ని క‌ల‌లు కంటాడు. భిన్న మ‌న‌స్త‌త్వాలు, ఆలోచ‌న‌ల కార‌ణంగా తండ్రి, కొడుకుల మ‌ధ్య ఎలా దూరం పెరిగింది? తండ్రి కోరిక‌ను కొడుకు నెర‌వేర్చాడా? కొడుకు క‌ల‌ల‌నుతండ్రి అర్థం చేసుకున్నాడా? అనే పాయింట్‌తో డియ‌ర్ నాన్న మూవీ తెర‌కెక్కింది.

ఒక్క రోజు గ్యాప్‌లోనే ఓటీటీలో చైత‌న్య‌రావు న‌టించిన రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. చైత‌న్య‌రావు హీరోగా న‌టించిన పారిజాత ప‌ర్వం మూవీ బుధ‌వారం ఆహా ఓటీటీలో రిలీజైంది. శుక్ర‌వారం నుంచి ఆహా ఓటీటీలోనే అత‌డి మూవీ డియ‌ర్ నాన్న కూడా స్ట్రీమింగ్ కాబోతోంది.

30 వెడ్స్ 21 సిరీస్‌తో...

30 వెడ్స్ 21 వెబ్‌సిరీస్‌తో ఫేమ‌స్ అయ్యాడు చైత‌న్య‌రావు. యూట్యూబ్‌లో రిలీజైన ఈ కామెడీ వెబ్‌సిరీస్ మిలియ‌న్ల‌లో వ్యూస్‌ను ద‌క్కించుకున్న‌ది. 30 వెడ్స్ 21 వెబ్‌సిరీస్ త‌ర్వాత చైత‌న్య‌రావు సినిమా ఛాన్స్‌లు పెరిగాయి. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యాడు.

ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి...

చైత‌న్య‌రావు హీరోగా న‌టించిన ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి. మూవీ ఇటీవ‌లే థియేట‌ర్ల‌లో రిలీజైంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ మూవీలో మిడిల్ క్లాస్ యువ‌కుడిగా నాచుర‌ల్ యాక్టింగ్‌తో చైత‌న్య‌రావు మెప్పించాడు. త‌రుణ్ భాస్క‌ర్ కీడాకోలాలో డ‌బ్బు కోసం ఆశ‌ప‌డి క‌ష్టాల్లో ప‌డే యువ‌కుడిగా త‌న కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు.

ఈ సినిమాల‌తో పాటు పారిజాత ప‌ర్వం, అన్న‌పూర్ణ ఫొటో స్టూడియో, వాలెంటైన్స్ నైట్స్ సినిమాల్లో హీరోగా క‌నిపించాడు చైత‌న్య‌రావు. తిమ్మ‌రుసుతో పాటు మ‌రికొన్ని తెలుగు సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేశాడు. ప్ర‌స్తుతం హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు9 మ‌రికొన్ని సినిమాలు చేస్తున్నాడు.

WhatsApp channel