Weekend OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో మీరు మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే-weekend ott releases bhimaa lambasingi tantra farrey family aaj kal in netflix sonyliv hotstar prime video aha otts ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Weekend Ott Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో మీరు మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Weekend OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో మీరు మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Hari Prasad S HT Telugu
Apr 04, 2024 07:22 PM IST

Weekend OTT Releases: ఓటీటీల్లో ఈ వీకెండ్ మంచి సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. వీటిలో ఇప్పటికే కొన్ని స్ట్రీమింగ్ అవుతుండగా.. మరికొన్ని శుక్రవారం (ఏప్రిల్ 5) రాబోతున్నాయి.

ఈ వీకెండ్ ఓటీటీల్లో మీరు మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే
ఈ వీకెండ్ ఓటీటీల్లో మీరు మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Weekend OTT Releases: ప్రతి వారం వీకెండ్ వచ్చే సమయానికి ఓటీటీల్లోకి సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ వస్తుంటాయి. అయితే ఈ వారం ప్రారంభం నుంచే రోజుకో కొత్త సినిమా, సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ వీకెండ్ లో ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, సోనీలివ్, జీ5, ఆహాలాంటి ఓటీటీల్లో చూడటానికి చాలానే మూవీస్, సిరీస్ అందుబాటులో ఉండనున్నాయి.

వీకెండ్ ఓటీటీ రిలీజెస్

ఈ వారం తెలుగుతోపాటు మలయాళం, హిందీలాంటి భాషలకు సంబంధించిన సినిమాలు, సిరీస్ లు కూడా వస్తున్నాయి. వాటిలో మిస్ కాకుండా చూడాల్సినవి ఏవో ఇక్కడ చూడండి.

తంత్ర - ఆహా ఓటీటీ

అనన్య నాగళ్ల నటించిన హారర్ మూవీ తంత్ర. గత నెల 15న థియేటర్లలో రిలీజై ఈ మూవీ 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. శుక్రవారం (ఏప్రిల్ 5) నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

కిస్మత్ -ప్రైమ్ వీడియో

నరేష్ అగస్త్య, అభినవ్ గోమటం, విశ్వదేవ్ నటించిన తెలుగు కామెడీ మూవీ కిస్మత్ మంగళవారం (ఏప్రిల్ 2) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైన ఈ కామెడీ థ్రిల్లర్ పెద్ద సక్సెస్ కాలేదు. అయితే రెండు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.

భీమా - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

గోపీచంద్ నటించిన భీమా మూవీ శుక్రవారం (ఏప్రిల్ 5) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 8న రిలీజైన ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

కైజర్ వెబ్ సిరీస్ - ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్

నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ కైజర్ గత ఆదివారం (మార్చి 31) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆటో డ్రైవర్ల జీవితాల్లోని వ్యథలను ఈ సిరీస్ లో చూపించారు.

అదృశ్యం మూవీ - ఈటీవీ విన్

అపర్ణ బాలమురళీ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ అదృశ్యం కూడా ఇప్పటికే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ లో చూడదగిన సినిమాల్లో ఇదీ ఒకటి.

లంబసింగి - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

బిగ్ బాస్ ఫేమ్ దివి ఓ నక్సలైట్ గా నటించిన మూవీ లంబసింగి. థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోపే మంగళవారం (ఏప్రిల్ 2) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హాట్‌స్టార్ లో ఈ మూవీ చూడొచ్చు.

ఫ్యామిలీ ఆజ్ కల్ - సోనీలివ్

ఓ ఫీల్ గుడ్ హిందీ వెబ్ సిరీస్ ఈ ఫ్యామిలీ ఆజ్ కల్. ఈ సిరీస్ బుధవారం (ఏప్రిల్ 3) నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. పూర్తి ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన చక్కటి వెబ్ సిరీస్ ఇది.

యే మేరీ ఫ్యామిలీ 3- మినీటీవీ

యే మేరీ ఫ్యామిలీ కూడా ఓ హిందీ వెబ్ సిరీసే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్.. మూడో సీజన్ వచ్చేసింది. గురువారం (ఏప్రిల్ 4) నుంచే ఈ సిరీస్ అమెజాన్ మినీటీవీలో స్ట్రీమింగ్ అవుతోంది.