Kaizer OTT: 2 ఓటీటీల్లో జీవితాలను మార్చేసే సరికొత్త సిరీస్ కైజర్.. ఎక్కడ చూడొచ్చంటే?-kaizer series ott streaming on amazon prime and mx player ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kaizer Ott: 2 ఓటీటీల్లో జీవితాలను మార్చేసే సరికొత్త సిరీస్ కైజర్.. ఎక్కడ చూడొచ్చంటే?

Kaizer OTT: 2 ఓటీటీల్లో జీవితాలను మార్చేసే సరికొత్త సిరీస్ కైజర్.. ఎక్కడ చూడొచ్చంటే?

Sanjiv Kumar HT Telugu
Apr 01, 2024 10:36 AM IST

Kaizer Series OTT Release: ఓటీటీలోకి ఎన్నో సినిమాలు, సిరీసులు వస్తుంటాయి. అలా తాజాగా వచ్చిన సరికొత్త వెబ్ సిరీసుల్లో కైజర్ ఒకటి. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆటో డ్రైవర్ల జీవితాన్ని మార్చేసే ఈ వెబ్ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం.

2 ఓటీటీల్లో జీవితాలను మార్చేసే సరికొత్త సిరీస్ కైజర్.. ఎక్కడ చూడొచ్చంటే?
2 ఓటీటీల్లో జీవితాలను మార్చేసే సరికొత్త సిరీస్ కైజర్.. ఎక్కడ చూడొచ్చంటే?

Kaizer Series OTT Streaming: నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ కైజర్. యంగ్ డైరెక్టర్ వికాస్ చిక్బల్లాపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ను సహచారి క్రియేషన్స్ బ్యానర్‌పై రోహన్ కులకర్ణి నిర్మించారు. ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్ డిస్ట్రీబ్యూటర్‌ ఈ సిరీస్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓటీటీలోకి తీసుకొచ్చింది. ఆటో డ్రైవర్ల జీవితాన్ని మార్చేసే ఈ సిరీస్ మార్చి 31 నుంచి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్ అండ్ ఎమ్‌ఎక్స్ ప్లేయర్‌లో మార్చి 31 నుంచి కైజర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్, ఎమ్‌ఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రెస్ మీట్ ద్వారా తెలిపారు మేకర్స్. ఆటో డ్రైవర్ల కష్టాలు ఎలా ఉంటాయి, వారిని ఆదుకోవడానికి రోహాన్ కులకర్ణి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. రోకు యాప్ ఆటో డ్రైవర్లకు ఎలా ఉపయోగపడుతుందో ఈ సిరీస్‌లో అద్భుతంగా చూపించినట్లు డైరెక్టర్ వికాస్ చిక్బల్లాపూర్ వివరించారు.

"ఈ కథను ప్రతీ ఆటో డ్రైవర్‌కు చేరవేయాలని దానికి మీడియా సపోర్ట్ కావాలి. కైజర్ చిత్రం రోహన్ కులకర్ణి రియల్ స్టోరీ. రోకు కాన్సెప్ట్ పైనా సినిమా తీయాలి అనే ఆలోచన వచ్చిన వెంటనే కథను సిద్దం చేసుకోవడం, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా అన్ని పనులు చాలా తొందరగా అయిపోయాయి. సిరీస్‌లో చాలా మంది రియల్ ఆటో డ్రైవర్లను చూపించాము. డైలాగ్స్ రైటర్ ఫనీకి, సీనియర్ యాక్టర్లు కోటేశ్వరరావు, ప్రసాద్, హీరో రవి మహదాస్యమ్ దీనికి పనిచేసిన అందరికీ థ్యాంక్స్" అని డైరెక్టర్ వికాస్ తెలిపారు.

"ఇక సిరీస్‌లో సృజన గోపాల్ కేవలం స్టోరీ, స్క్రీన్ ప్లే నే కాదు అన్ని పనులు తనదే అన్నట్లు చాలా యాక్టీవ్ గా చేశారు. ఇక ఈ సిరీస్‌ను జనాల వద్దకు నేను తీసుకెళ్తా అని ముందుకొచ్చిన ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్ అధినేత రాజీవ్ కు ధన్యవాదాలు" అని డైరెక్టర్ వికాస్ అన్నారు.

"చిన్న కాన్సెప్ట్ ప్రజలకు తెలియాలి అన్నా, చిన్నా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కంటెంట్ ని ముందుకు తీసుకెళ్లే మీడియాకు థాంక్స్. డైరెక్టర్ వికాస్ ఇక నెలలోనే సిరీస్ సినిమాను పూర్తి చేశారు అంటే మాములు విషయం కాదు. దాన్ని వికాస్ సాధించి చూపించారు. రోహన్ రోల్ చేసిన రవి మహాదాస్యం చాలా నాచురల్ గా చేశారు. సుశాంత్ ఆటో డ్రైవర్ గా బాగా చేశారు. ఈ చిన్న చిత్రానికి పేరున్న నటులు కోటేశ్వర రావు, బీహెచ్ఎల్ ప్రసాద్ పెద్ద ఆస్తి. అవకాశం ఇచ్చిన రోహన్ కులకర్ణి, వాల్ల నాన్న దేవ్ కు థ్యాంక్స్" అని రైటర్ సృజన గోపాల్ తెలిపారు.

"స్టోరీ విన్నవెంటనే చాలా బాగుంది చేద్దాం అని ఫిక్స్ అయ్యాను. అయితే ఇంత తొందరగా సిరీస్ అయిపోయి ప్రేక్షకుల ముందుకు వస్తుందని అనుకోలేదు. దానికి మొత్తం క్రెడిట్ డైరెక్టర్ వికాస్‌కే ఇవ్వాలి. ఇక రోహాన్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆయన గురించి తెలుసుకొని చాలా ప్రభావితుడిని అయ్యాను. వారు చాలా సేవలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల కోసం యాప్‌ను తీసుకురావడమే కాదు, వారి పిల్లలను కూడా చదివించడం అంటే మాములు విషయం కాదు. ఈ సిరీస్ తరువాత ఆటో వాళ్లను చూసే విధానం మారిపోతుంది" అని హీరో రవి మహదాస్యమ్ అన్నారు.

Whats_app_banner