Bhimaa OTT: ఓటీటీలోకి కాస్త ముందుగానే పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-bhimaa ott release on disney plus hotstar bhimaa ott streaming gopichand ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bhimaa Ott Release On Disney Plus Hotstar Bhimaa Ott Streaming Gopichand

Bhimaa OTT: ఓటీటీలోకి కాస్త ముందుగానే పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Apr 01, 2024 12:42 PM IST

Gopichand Bhimaa OTT Release: తెలుగు చిత్రపరిశ్రమలో మ్యాచో హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ నటించిన లేటెస్ట్ పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ మూవీ భీమా. ఈ సినిమా థియేటర్లలో విడుదలై నెల కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరి భీమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడనే వివరాల్లోకి వెళితే..

ఓటీటీలోకి ముందుగానే పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి ముందుగానే పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Bhimaa OTT Streaming Date: టాలీవుడ్‌లో మాచో స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో గోపీచంద్. ఇటీవల ఆయన వరుసగా ఫ్లాప్స్ చూడాల్సి వస్తుంది. పక్కా కమర్షియల్ యావరేజ్ టాక్ రాగా దాని తర్వాత చేసిన రామబాణం డిజాస్టర్‌గా మిగిలింది. ఇక నెలకు ముందు థియేటర్లలో విడుదలైన భీమా సినిమా కూడా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో మరోసారి గోపీచంద్ పవర్ ఫుల్ ఆఫీసర్ రోల్ చేశాడు.

ఇంతకుముందు పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన గోలీమార్ సినిమాలో పోలీస్‌గా అదరగొట్టిన గోపీచంద్ మరోసారి మాస్ పోలీస్ అవతార్‌తో భీమాలో కనిపించాడు. అయితే గోపీచంద్‌కు ఎంత టాలెంట్ ఉన్న టేకింగ్, స్క్రీన్ ప్లే, కథ ఇలా అనేక అంశాలతో ఆయన సినిమాలు అంతగా వర్కౌట్ కావట్లేదు. ఇక పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా వచ్చిన భీమాకు కన్నడ డైరెక్టర్ ఏ హర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టారు.

గత నెల మార్చి 8న మహా శివరాత్రి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదలైన భీమా సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేయనుంది. అయితే నెలకు మూడు రోజుల ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తోంది గోపీచంద్ భీమా సినిమా. భీమా సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. ఇప్పుడు ఏప్రిల్ 5న భీమా సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

అయితే, భీమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏప్రిల్ 3 లేదా 4 తేదిల్లో భీమా ఓటీటీ విడుదలపై సదరు ప్లాట్‌ఫామ్ అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఓటీటీలోకి రానున్న ఈ పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయితే చూసేయండి.

ఇదిలా ఉంటే, భీమా చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భీమా శాటిలైట్ రైట్స్‌ను బుల్లితెర టీవీ ఛానెల్ స్టార్ మా (Star Maa Channel) చేజిక్కుంచుకుంది. ఓటీటీ అండ్ శాటిలైట్ హక్కులు అన్ని కలిపి మొత్తంగా రూ. 20 కోట్ల వరకు అమ్ముడు పోయినట్లు సమాచారం. అయితే భీమా ఓటీటీ పార్టనర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అని సినిమా ఎండ్ టైటిల్ కార్డ్స్ ద్వారా తెలిసింది.

కాగా, భీమా సినిమాలో గోపీచంద్ సరసన మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా చేశారు. అయితే భీమాలో గోపీచంద్ రెండు పాత్రలు పోషించినట్లుగా తెలుస్తోంది. వీరితోపాటు సినిమాలో ముఖేష్ తివారి, వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్, నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సలార్, కేజీఎఫ్ మూవీస్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. అలాగే స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, రమణ వంక ప్రొడక్షన్ డిజైన్, తమ్మిరాజు ఎడిటర్ బాధ్యతలు చేపట్టారు.

WhatsApp channel