Vijay Deverakonda: ఫ్యామిలీస్టార్ నాకు మరో అర్జున్ రెడ్డి అవుతుంది: విజయ్ దేవరకొండ-vijay deverakonda says family star character for him like another arjun reddy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Deverakonda Says Family Star Character For Him Like Another Arjun Reddy

Vijay Deverakonda: ఫ్యామిలీస్టార్ నాకు మరో అర్జున్ రెడ్డి అవుతుంది: విజయ్ దేవరకొండ

Hari Prasad S HT Telugu
Mar 29, 2024 10:27 PM IST

Vijay Deverakonda: ఫ్యామిలీస్టార్ మూవీలోని పాత్ర తనకు అర్జున్ రెడ్డిలాంటిదే అవుతుందని విజయ్ దేవరకొండ అన్నాడు. ఈ సినిమాపై ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో అతడు స్పందించాడు.

ఫ్యామిలీస్టార్ నాకు మరో అర్జున్ రెడ్డి అవుతుంది: విజయ్ దేవరకొండ
ఫ్యామిలీస్టార్ నాకు మరో అర్జున్ రెడ్డి అవుతుంది: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: చాలా రోజులుగా ఓ హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీపై అతడు భారీ ఆశలే పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమాలో తనకు లభించిన పాత్ర తన అదృష్టమని అన్నాడు. కెరీర్ మొదట్లోనే అర్జున్ రెడ్డితోపాటు కొన్ని మంచి పాత్రలు తనకు లభించాయని అతడు చెప్పాడు.

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్

సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పుడో వచ్చినా.. అర్జున్ రెడ్డి మూవీతోనే విజయ్ దేవరకొండ పేరు అందరికీ తెలిసింది. ఆ సినిమాలో అతని బోల్డ్ క్యారెక్టర్ యువతను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ పాత్ర కూడా అలాంటిదే అని అతడు చెప్పాడు. గలాటా ప్లస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడాడు.

"నా కెరీర్ మొదట్లోనే అదృష్టం కొద్దీ మంచి పాత్రలు లభించాయి. ఆ పాత్రలను చాలా రోజుల వరకూ గుర్తుంచుకుంటారు. సందీప్ తో అర్జున్ రెడ్డి అలాంటిదే. ఇక ఫ్యామిలీ స్టార్ లో నేను పోషించిన పాత్ర కూడా నాకు అలాంటి మరో బ్లెస్సింగ్ అని చెప్పగలను" అని విజయ్ అన్నాడు. అయితే అర్జున్ రెడ్డితో దీనికి ఎలాంటి పోలిక లేదని కూడా స్పష్టం చేశాడు.

"ఇదేమీ అర్జున్ రెడ్డిలాగా ఉండదు. పూర్తిగా భిన్నమైనది. పరశురామ్, నేను గీత గోవిందంలో కలిసి పని చేశాం. కానీ ఫ్యామిలీ స్టార్ లో ఈ పాత్ర గురించి నేను విన్నప్పుడు ప్రతి నటుడికీ ఇలాంటి పాత్ర ఓ మంచి అవకాశం అనిపించింది తొలి నిమిషం నుంచి చివరికి వరకూ అద్భుతంగా ఈ పాత్రను చెక్కారు. అతడు తన వ్యక్తిగత జీవితం, అనుభవాల నుంచి దీనిని రాసుకున్నాడు" అని విజయ్ తెలిపాడు.

ఈ పాత్ర మనందరిది: విజయ్

విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి గతంలో పరశురామ్ తో గీత గోవిందం చేసిన విషయం తెలిసిందే. తాను ఫ్యామిలీ స్టార్ పాత్రతో బాగా కనెక్ట్ అయినట్లు విజయ్ చెప్పాడు. "ఆ స్టోరీని అతడు నాకు నెరేట్ చెప్పినప్పుడు నా టీనేజ్, యవ్వన దశలు గుర్తుకొచ్చాయి. ఆ వయసులో మనం చేసే చిలిపి పనులే అవి.

ఇక ఇందులోని సీరియస్ విషయాలు నేను మా నాన్నలో చూశాను. అప్పుడే ఇది ఓ గ్రేట్ స్టోరీ, గ్రేట్ క్యారెక్టర్ అనిపించింది. ఫ్యామిలీ స్టార్ లో నా పాత్ర మనందరి ఎక్స్‌ట్రీమ్ వెర్షన్. నేను అతనిలాగా కాదు. అతడు మనందరి ఎక్స్‌ట్రీమ్ సినిమాటిక్ వెర్షన్ లాగా కనిపిస్తాడు" అని విజయ్ స్పష్టం చేశాడు.

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి గత సంక్రాంతికే వస్తుందని భావించినా.. ఆలస్యమైంది. ఈ మధ్యే మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇది మూవీపై అంచనాలను పెంచేసింది. లైగర్, ఖుషీలాంటి ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండకు ఈ ఫ్యామిలీ స్టార్ హిట్ ఎంతో ముఖ్యమని చెప్పొచ్చు. మరి విజయ్, పరశురామ్ కాంబినేషన్ మరో గీత గోవిందం అందిస్తుందేమో చూడాలి.

IPL_Entry_Point