(1 / 5)
ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్లలో భాగంగా మూవీ టీమ్ నేడు (మార్చి 25)హైదరాబాద్‍లో ప్రజలతో కలిసి హోలీ వేడుకలు జరుపుకుంది. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, నిర్మాత దిల్‍రాజుతో పాటు మరికొందరు ఈ వేడుకలకు హాజరయ్యారు.
(2 / 5)
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ పరస్పరం రంగులు పూసుకున్నారు. టీమ్ సభ్యులు కూడా రంగులు జల్లుకున్నారు. ప్రజలతో కలిసి సంబరాలు చేసుకున్నారు.
(3 / 5)
ఈ హోలీ సెలెబ్రేషన్లలో స్టేజీపై విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ డ్యాన్స్ చేశారు. ఫ్యామిలీ స్టార్ మూవీలోని ‘కల్యాణి వచ్చా.. వచ్చా’ పాటకు హుషారుగా చిందేశారు.
(4 / 5)
హోలీ సంబరాల్లో పాల్గొన్న ప్రజలతో ఫొటోలు దిగారు ఫ్యామిలీ స్టార్ మూవీ టీమ్ సభ్యులు. ప్రేక్షకులతో హీరో విజయ్ దేవరకొండ సెల్ఫీ తీసుకున్న దృశ్యమిది.
(5 / 5)
ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి ‘మధురము కదా’ అనే మూడో పాట నేడు (మార్చి 25) వచ్చింది.
గీతగోవిందం తర్వాత విజయ్ - పరశురాం కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది.
ఇతర గ్యాలరీలు