Rashmika Mandanna on Pushpa 2: పుష్ప 2 ఆ రోజే రిలీజ్ అవుతుందా?: రష్మిక ఇచ్చిన అప్డేట్‌తో కొత్త సందేహాలు
Rashmika Mandanna on Pushpa 2: పుష్ప 2 రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఎన్నిసార్లు హామీ ఇచ్చినా కొత్త కొత్త సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తాజాగా రష్మిక మందన్నా ఇచ్చిన అప్డేట్ కూడా మరోసారి అలాంటి ఆలోచనలకే తావిస్తున్నాయి.
Rashmika Mandanna on Pushpa 2: రష్మిక మందన్నా.. ప్రస్తుతం వరుస టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్. ఈ మధ్యే తన కెరీర్లో 22వ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు ఆమె చెప్పింది. ఈ సందర్భంగా తన నెక్ట్స్ బిగ్ ప్రాజెక్ట్ పుష్ప 2 మూవీపై కూడా కీలకమైన అప్డేట్ ఇచ్చింది. యానిమల్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
పుష్ప 2పై రష్మిక అప్డేట్ ఇది..
ఈ ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా తాను నటిస్తున్న పుష్ప 2 మూవీ గురించి వెల్లడించింది. ఆగస్ట్ 15న ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పారు. అయితే మూవీ షూటింగ్ ఇంకా చాలానే మిగిలి ఉందంటూ తరచూ వార్తలు వస్తున్నాయి. తాజాగా రష్మిక కూడా అదే విషయం చెప్పింది.
"పుష్ప 2 షూటింగ్ బాగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50కిపైగా రోజులు చేశాం. ఇంకా చాలా చేయాల్సి ఉంది. కానీ ప్రేక్షకులకు నేను ఎప్పుడూ చెబుతున్నట్లే ఇప్పుడూ చెబుతున్నాను. ఇది గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉండబోతోంది. ఈ సినిమా కోసం చాలా శ్రమిస్తున్నాం. ప్రతి చిన్న విషయంపై జాగ్రత్తగా దృష్టి సారిస్తున్నాం. ప్రతి పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. అదే గొప్ప విషయం" అని రష్మిక చెప్పింది.
అయితే సినిమా షూటింగ్ ఇంకా చాలా మిగిలే ఉందంటూ ఆమె చేసిన కామెంట్స్ తో మరోసారి పుష్ప 2 రిలీజ్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మేకర్స్ చెబుతున్నట్లే ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డేకే ఈ మూవీ వస్తుందా లేదా అన్నది చూడాలి.
తన కెరీర్‌పై రష్మిక ఏమన్నదంటే..
తాను ఈ మధ్యే 22వ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు రష్మిక చెప్పింది. "నేను ఈ మధ్యే నా 22వ సినిమా పూర్తి చేసుకున్నాను. నేను ఇవాళ ఈ స్థితిలో ఉండటానికి 22 సినిమాలు అవసరమయ్యాయి. ఇది చాలా శ్రమతో కూడిన అద్భుతమైన ప్రయాణం. కానీ ఇవాళ నా కోసం స్టోరీలు రాస్తూ, నాపై విశ్వాసం ఉంచి పెద్ద సినిమాలు చేసే అవకాశం మేకర్స్ కు దక్కింది. ఇప్పుడు నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను" అని రష్మిక చెప్పింది.
ఇక నార్త్ వెర్సెస్ సౌత్ చర్చపైనా ఆమె స్పందించింది. "ఇక నుంచి మనం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా పిలవాల్సిన టైమ్ వచ్చింది. ఎందుకంటే మనమంతా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం. ఒకే దేశంలో ఉన్నాం. అందుకే ఒక దేశంలో ఉన్న అన్ని ఇండస్ట్రీలు ఒక్కటే అని గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు సరిహద్దులు చెరిగిపోతుండటం కూడా చాలా బాగా అనిపిస్తోంది" అని రష్మిక అభిప్రాయపడింది.
గతేడాది రిలీజైన యానిమల్ మూవీ సక్సెస్ తర్వాత ప్రస్తుత రష్మిక పుష్ప 2 మూవీతోపాటు రెయిన్‌బో, ది గర్ల్‌ఫ్రెండ్, చావాలాంటి సినిమాలతో బిజీగా ఉంది. సౌత్, నార్త్ అన్నదానితో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఈ నేషనల్ క్రష్ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది.