OTT: ఓటీటీలోకి రెండ్రోజుల్లో అర్జున్ రెడ్డి లాంటి సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-arjun reddy kind of movie siddharth roy ott release on amazon prime video siddharth roy digital premiere ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Arjun Reddy Kind Of Movie Siddharth Roy Ott Release On Amazon Prime Video Siddharth Roy Digital Premiere

OTT: ఓటీటీలోకి రెండ్రోజుల్లో అర్జున్ రెడ్డి లాంటి సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Mar 27, 2024 02:17 PM IST

Siddharth Roy OTT Streaming: తెలుగులోకి అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమా సిద్ధార్థ్ రాయ్ థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. చైల్డ్ ఆర్టిస్డ్ దీపక్ సరోజ్ హీరోగా అరంగ్రేట్రం చేసిన ఈ సినిమా మరో రెండ్రోజుల్లో ఓటీటీలోకి వచ్చేయనుంది. మరి ఏ ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్ స్ట్రీమింగ్ కానుందో చూద్దాం.

ఓటీటీలోకి రెండ్రోజుల్లో అర్జున్ రెడ్డి లాంటి సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి రెండ్రోజుల్లో అర్జున్ రెడ్డి లాంటి సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Siddharth Roy OTT Release: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మొదటి సినిమా అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ మాత్రమే కాకుండా యూత్‌లో ఒక రకమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దాంతో అలాంటి సినిమాలకు ఫుల్ క్రేజ్ వచ్చినట్లయింది. ఈ క్రమంలోనే కొంచెం అటు ఇటుగా అర్జున్ రెడ్డి లాంటి సినిమానే ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అర్జున్ రెడ్డి తరహాలో థియేటర్లలోకి వచ్చిన రీసెంట్‌ మూవీ సిద్ధార్థ్ రాయ్. టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పాపులర్ అయిన దీపక్ సరోజ్ హీరోగా అరంగేట్రం చేసిన సినిమానే సిద్ధార్థ్ రాయ్. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అతడు సినిమాలో బ్రహ్మానందంకు కొడుకుగా నటించిన బాల నటుడు గుర్తుండే ఉంటాడు. అందులో తన కోసం ట్రైన్ తీసుకొచ్చాని బ్రహ్మానందం చెబితే సంతోషంగా పరుగెత్తుకుంటూ వెళ్లే సీన్ చాలా మందికి గుర్తుండిపోతుంది.

అలా బాల నటుడుగా పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్న దీపక్ సరోజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్ రాయ్ మూవీ ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా బాగానే బజ్ క్రియేట్ చేసుకుంది. కానీ, థియేటర్లలో మాత్రం ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ అందుకోలేకపోయిందనే చెప్పాలి. టీజర్, ట్రైలర్ చూసి సేమ్ అర్జున్ రెడ్డి లాగే ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు.

అయితే, సిద్ధార్థ్ రాయ్ మూవీ విడుదలైన వారం రోజుల వరకు బాగానే ఆడిన తర్వాత ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకోలేదని తెలుస్తోంది. కానీ, ఈ మూవీకి ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎమ్‌డీబీ ఏకంగా 9.3 రేటింగ్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ మంచి ధర వెచ్చించి దక్కించుకుంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల రోజులకు సినిమాలను ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తారని తెలిసిందే. అయితే, నెల దాటిన కొన్నిరోజులకు సిద్ధార్థ్ రాయ్ మూవీని డిజిటల్ ప్రీమియర్ చేయనున్నారు.

సిద్ధార్థ్ రాయ్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో మార్చి 29 అంటే ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. అంటే, ఈ సినిమా మరో రెండ్రోజుల్లో ఓటీటీలోకి వచ్చేయనుంది. అయితే, దీనిపై ఎలాంటి

అధికారిక ప్రకటన రాలేదు. కానీ, మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఒకటి, లేదా రెండ్రోజుల ముందు అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ చేస్తారు. కాబట్టి తర్వలో సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, సిద్ధార్థ్ రాయ్ సినిమాలో దీపక్ సరోజ్‌కు జోడీగా తన్వి నేగి హీరోయిన్‌గా నటించింది. వీరితోపాటు సినిమాలో కల్యాణి ఎన్, మాథ్యూ వర్గీస్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు వి యశస్వీ డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఆయన ఇంతకుముందు డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి, హరీశ్ శంకర్ వద్ద వర్క్ చేశారు.

IPL_Entry_Point