Siddharth Roy: సిద్ధార్థ్ రాయ్ డైరెక్టర్‌పై రచయిత ఫైర్.. సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావంటూ!
Siddharth Roy Director Yashaswi: సిద్ధార్థ్ రాయ్ వంటి సినిమాతో సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావంటూ డైరెక్టర్ యశస్వీపై పాటల రచయిత లక్ష్మీ భూపాల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తెలిపారు. అందుకు సంబంధించిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Lyricist Lakshmi Bhupala About Siddharth Roy: తెలుగులో బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దీపక్ సరోజ్ (Deepak Saroj). ఎన్నో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అలరించిన దీపక్ సరోజ్ ఎక్కువగా మహేశ్ బాబు అతడు మూవీలో బ్రహ్మానందం కొడుకుగా ట్రైన్ సీన్‌తో బాగా గుర్తుకు వస్తాడు. బాల నటుడిగా పాపులర్ అయిన దీపక్ సరోజ్ కొంత గ్యాప్ తర్వాత హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. దీపక్ సరోజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా సిద్దార్థ్ రాయ్.
మొదటి సినిమాతోనే బోల్డ్ కంటెంట్‌తో దీపక్ సరోజ్ రావడం ఇండస్ట్రీలో విశేషంగా మారింది. దీంతో సిద్ధార్థ్ రాయ్‌లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాకు హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి స్టార్ డైరెక్టర్స్ వద్ద పనిచేసిన వి యశస్వీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి యశస్వీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యూత్‌ను అట్రాక్ట్ చేసే ప్రోమోలతో సిద్ధార్థ్ రాయ్ ఇప్పటికే మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. టీజర్, పాటలకు అదిరిపోయే స్పందన వచ్చింది.
ముఖ్యంగా జనవరి 23న విడుదలైన సిద్ధార్థ్ రాయ్ మూవీ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అంతా అర్జున్ రెడ్డి తరహాలో ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, సిద్ధార్థ్ రాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బేబి డైరెక్టర్ సాయి రాజేష్ వంటి ప్రముఖులు సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సిద్ధార్థ్ రాయ్‌లో చూపించినట్లు డైరెక్టర్ యశస్వీ క్యారెక్ట్ అలాంటిది కాదని చెప్పారు. ఇదే ఈవెంట్‌లో డైరెక్టర్ యశస్వీపై కోప్పడినట్లు గేయ రచయిత లక్ష్మీ భూపాల చెప్పుకొచ్చారు.
"మా దర్శకుడు యశస్వీ.. సిద్ధార్థ్ రాయ్ కథ చెప్పినపుడు ఫస్ట్ హాఫ్ విని ఇలాంటి కథతో సమాజానికి ఏం చెప్పదలచుకుంటున్నావ్ అని కోప్పడ్డాను. సెకండ్ హాఫ్ విని.. తనని హాగ్ చేసుకున్నాను. విలన్ లేకుండా హీరో ఉండడు. ఫస్ట్ హాఫ్ విలన్ అయితే సెకండ్ హాఫ్ హీరో. ఈ కథ అలా అనిపించింది. చాలా అద్భుతంగా సినిమాని తీర్చిదిద్దారు. సినిమా బ్లాక్ బస్టర్ అయి తీరుతుంది. ఈ కథకు ఏ కథతోనూ పోలికలు లేవు. అంత అద్భుతమైన కథ, క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశారు. ట్రైలర్ అదిరిపోయింది. సినిమాని బిగ్ స్క్రీన్ పై చూడటానికి ఎదురుచూస్తున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్" అని రచయిత లక్ష్మీ భూపాల తెలిపారు.
"సిద్ధార్థ్ రాయ్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ట్రైలర్ కూడ అదే ప్రేమ చూపిస్తారనే నమ్మకం ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నా క్యారెక్టర్‌ని అద్భుతంగా మలిచి ఈ ప్రయాణంలో ప్రతి క్షణం సపోర్ట్ చేసిన మా డైరెక్టర్ గారికి థాంక్స్. ఫణి గారు కంటెంట్‌ని నమ్మే నిర్మాత. మా సహా నిర్మాతలకు ధన్యవాదాలు. తన్వి చాలా అద్భతంగా నటించింది. ఇందులో ఫిమేల్ క్యారెక్టరైజేషన్ ఆర్క్ చాలా గొప్పగా ఉంటుంది. ఇందులో 'సిద్ధార్థ్ రాయ్' పాత్ర గురించి, ఈ పాత్రని ఎందుకు చేశానో తర్వాతి వేడుకల్లో మాట్లాడతాను. ఫిబ్రవరిలో థియేటర్స్‌లో కలుద్దాం" హీరో దీపక్ సరోజ్ చెప్పుకొచ్చాడు.