Siddharth Roy: అర్జున్ రెడ్డి యానిమల్‌లా మూడో మూవీ సిద్దార్థ్ రాయ్.. సందీప్ రెడ్డి క్యారెక్టర్ కనిపిస్తుందంటూ!-siddharth roy another arjun reddy animal in trailer launch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Siddharth Roy: అర్జున్ రెడ్డి యానిమల్‌లా మూడో మూవీ సిద్దార్థ్ రాయ్.. సందీప్ రెడ్డి క్యారెక్టర్ కనిపిస్తుందంటూ!

Siddharth Roy: అర్జున్ రెడ్డి యానిమల్‌లా మూడో మూవీ సిద్దార్థ్ రాయ్.. సందీప్ రెడ్డి క్యారెక్టర్ కనిపిస్తుందంటూ!

Sanjiv Kumar HT Telugu
Jan 24, 2024 09:22 AM IST

Siddharth Roy Trailer Launch: అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు నచ్చేవారి కోసం వస్తున్న మూడో సినిమానే సిద్ధార్థ్ రాయ్ అని డైరెక్టర్ వీరశంకర్ తెలిపారు. చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా నటించిన సిద్ధార్థ్ రాయ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్స్ ఆసక్తికర విషయాలు చెప్పారు.

అర్జున్ రెడ్డి యానిమల్‌లా మూడో మూవీ సిద్దార్థ్ రాయ్.. సందీప్ రెడ్డి క్యారెక్టర్ కనిపిస్తుందంటూ!
అర్జున్ రెడ్డి యానిమల్‌లా మూడో మూవీ సిద్దార్థ్ రాయ్.. సందీప్ రెడ్డి క్యారెక్టర్ కనిపిస్తుందంటూ!

Siddharth Roy After Arjun Reddy Animal: పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ (అతడు మూవీలో బ్రహ్మానందం కొడుకుగా) దీపక్ సరోజ్ (Deepak Saroj) హీరోగా తెరంగేట్రం చేస్తున్న సినిమా సిద్ధార్థ్ రాయ్. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల దగ్గర పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ బ్యానర్‌లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

యువతను ఆకట్టుకునే ప్రోమోలతో ఇప్పటికే సిద్ధార్థ్ రాయ్ హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటీవల జనవరి 23న సిద్ధార్థ్ రాయ్ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ , దర్శకులు సాయి రాజేష్, వీరశంకర్, లక్ష్మీ భూపాల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సిద్ధార్థ్ రాయ్ మూవీ గురించి పలు కామెంట్స్ చేశారు.

"దర్శకుడు యశస్వీ తను నమ్మిందే బలంగా తీసే క్రియేటర్. 'సిద్ధార్థ్ రాయ్' లాంటి సినిమా ఇంతవరకు తెలుగులోనే కాదు ఏ భాషలోనూ రాలేదు. ప్రతి మనిషిలో రెండు కాన్‌‌ఫిక్ట్‌లు ఉంటాయి. ఇలాంటి కాన్సెప్ట్ తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇలాంటి సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. హీరో, హీరోయిన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. సంగీతం, కెమరా వర్క్ చాలా బాగుంది. అనుకున్న బడ్జెట్‌కి రెండు రెట్లు ఎక్కువ పెట్టి తీశారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్" అని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తెలిపారు.

"'సిద్ధార్థ్ రాయ్' కథ వినగానే చాలా ఆశ్చర్యపోయాను. ఇలాంటి కథ తీయాలంటే గట్స్ కావాలి. ఇలాంటి పాత్ర చేయాలన్నా చాలా గట్స్ ఉండాలి. ఈ పాత్ర చేసిన దీపక్ చాలా లక్కీ. ట్రైలర్ అద్భుతంగా ఉంది. దీపక్ ఎక్స్‌ట్రార్డినరిగా పెర్ఫార్మ్ చేశాడు. అర్జున్ రెడ్డిలో సందీప్ రెడ్డి వంగా క్యారెక్టర్ తెరపై కనిపిస్తుంది. కానీ, ఈ చిత్ర దర్శకుడి క్యారెక్టర్ అది కాదు. కానీ, తెరపై చూస్తున్నపుడు అలాంటి ఇంటెన్సిటీ కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత పెద్ద సౌండ్ చేస్తుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్" అని బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ అన్నారు.

"అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి చిత్రాల కోసం ఆకలితో ఎదురుచూసే ప్రేక్షకులకు ఇప్పుడు మూడో చిత్రం 'సిద్ధార్థ్ రాయ్' అవుతుంది. వి యశస్వీ ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే దర్శకుడు అవుతాడు. సినిమా విడుదల కాకముందే సుకుమార్ లాంటి దర్శకుల దగ్గర మరో అవకాశం అందుకోవడం మామూలు విషయం కాదు. ఈ చిత్రంలో నేను కూడా రెండు సన్నివేశాల్లో నటించాను. చాలా అద్భుతమైన టీం ఈ సినిమా కోసం పని చేసింది. అందరికీ ఆల్ ది బెస్ట్" అని డైరెక్టర్ వీరశంకర్ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే సిద్ధార్థ్ రాయ్ మూవీలో దీపక్ సరోజ్‌కు జోడీగా తన్వీ నేగి హీరోయిన్‌గా నటించింది. ఇక సిద్ధార్థ్ రాయ్ మూవీని ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే సిద్ధార్థ్ రాయ్ మూవీ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను ఇంకా ప్రకటించలేదు.

IPL_Entry_Point