Sankranthiki Vasthunnam: టైటిల్‌కి తగినట్లుగానే రిలీజ్ డేట్ ప్రకటించిన వెంకటేశ్.. అనిల్ రావిపూడి మ్యాజిక్ చేస్తారా?-venkatesh new movie sankranthiki vasthunnam release date announced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sankranthiki Vasthunnam: టైటిల్‌కి తగినట్లుగానే రిలీజ్ డేట్ ప్రకటించిన వెంకటేశ్.. అనిల్ రావిపూడి మ్యాజిక్ చేస్తారా?

Sankranthiki Vasthunnam: టైటిల్‌కి తగినట్లుగానే రిలీజ్ డేట్ ప్రకటించిన వెంకటేశ్.. అనిల్ రావిపూడి మ్యాజిక్ చేస్తారా?

Galeti Rajendra HT Telugu

Sankranthiki Vasthunnam release date: వచ్చే ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్, నందమూరి బాలకృష్ణ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే.. పండగ రేసులో వెంకటేశ్ కూడా నిలవబోతున్నట్లు రోజు తేలిపోయింది.

సంక్రాంతికి వస్తున్నాం టీమ్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ హీరో వెంకటేశ్ నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా టైటిల్‌కి తగినట్లుగానే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌కాబోతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన బుధవారం వెలువడింది.

ఎఫ్-2 మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?

అనిల్ రావిపూడి - వెంకటేశ్ కాంబినేషన్‌లో ఇప్పటికే ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలురాగా.. మూడోసారి ఈ జంట సంక్రాంతికి అలరించేందుకు సిద్ధమవుతోంది. ట్రయాంగిల్ క్రైమ్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో వెంకటేశ్‌కి జోడీగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. ఇటీవల పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్..తాజాగా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది.

సంక్రాంతి బరిలో ఇప్పటికే పెద్ద సినిమాలు

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో కొన్ని పెద్ద సినిమాలు వచ్చే అవకాశం ఉన్నా.. జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ థియేటర్లలోకి రాబోతోంది. ఈ మూవీకి బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎఫ్-2 సినిమాలో వెంకటేశ్‌ను కొత్తగా చూపించిన అనిల్ రావిపూడి.. ఈ సినిమాలో ఇంకెలా కొత్తగా చూపిస్తారో చూడాలి. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, నందమూరి బాలకృష్ణ నటించిన డాగు మహారాజ్ కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే.

మీనాక్షి చౌదరి వరుస సినిమాలు

మీనాక్షి చౌదరి ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోంది. అమె నటించిన మూవీ లక్కీ భాస్కర్ ఇటీవల విడుదలై హిట్‌గా నిలిచింది. కానీ.. ఆ వెంటనే మట్కా సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. అయినప్పటికీ ఈ అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. విశ్వక్ సేన్‌తో ఒక సినిమా చేయగా.. అది ఈ నవంబరులోనే థియేటర్లలోకి రానుంది. అలానే అక్కినేని నాగచైతన్యతో ఒక సినిమా కోసం సంతకం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఐశ్వర్య రాజేష్ మాత్రం ఇటీవల టాలీవుడ్‌లో పెద్దగా కనిపించడం లేదు.