తెలుగు న్యూస్ / ఫోటో /
Anant Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లిలో టాలీవుడ్ స్టార్లు.. మహేశ్, రామ్‍చరణ్, వెంకటేశ్, రానా, అఖిల్ ఫొటోలు చూసేయండి
- Anant Ambani Radhika Merchant: అనంత్ అంబానీ, రాధికా మెర్చంట్ వివాహం ముంబైలో అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకకు టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
- Anant Ambani Radhika Merchant: అనంత్ అంబానీ, రాధికా మెర్చంట్ వివాహం ముంబైలో అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకకు టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 6)
ప్రముఖ వ్యాపారవేత్త, బిలీనియర్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం.. రాధికా మెర్చంట్‍తో నేడు (జూలై 12) వైభవంగా జరుగుతోంది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుక సాగుతోంది. ఈ వివాహానికి టాలీవుడ్ సెలెబ్రిటీలు కొందరు హాజరయ్యారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రతా షిరోద్కర్, కూతురు సితార ఆ వేడుకలో పాల్గొన్న ఫొటో ఇది.
(2 / 6)
బ్లాక్‍కలర్ ట్రెడిషనల్ ఔట్‍ఫిట్‍లో మహేశ్ బాబు లుక్ అదిరిపోయింది. లాంగ్ హెయిర్‌తో మరింత హ్యాండ్‍సమ్‍గా, కొత్తగా ఉన్నారు సూపర్ స్టార్.
(3 / 6)
మెగాపవర్ స్టార్ రామ్‍చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు వెళ్లారు. ఆయన రాగానే అక్కడి వారు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. రామ్‍చరణ్ దంపతులు సంప్రదాయ దుస్తుల్లో పెళ్లిలో పాల్గొన్నారు.
(4 / 6)
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ వైట్ కలర్ షేర్వాణీ ధరించి ట్రెడిషనల్ లుక్‍తో ఈ వివాహానికి హాజరయ్యారు.
(5 / 6)
టాలీవుడ్ హల్క్, హీరో దగ్గుబాటి రానా తన భార్య మిహికాతో కలిసి అనంత్ అంబానీ - రాధికా మెర్చంట్ వివాహ వేడుకలో పాల్గొన్నారు.
ఇతర గ్యాలరీలు