Gandeevadhari Arjuna Trailer: గాండీవధారి అర్జున ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయిన యాక్షన్: చూసేయండి
Gandeevadhari Arjuna Trailer: గాండీవధారి అర్జున ట్రైలర్ రిలీజ్ అయింది. వరుణ్ తేజ్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. యాక్షన్‍తో నిండిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.
Gandeevadhari Arjuna Trailer: మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన 'గాండీవధారి అర్జున' చిత్రం ట్రైలర్ వచ్చేసింది. ఈ యాక్షన్ మూవీకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఆగస్టు 25వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ తరుణంలో గాండీవధారి అర్జున సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ నేడు (ఆగస్టు 10) రిలీజ్ చేసింది. వివరాలివే..
గాండీవధారి అర్జున ట్రైలర్ యాక్షన్ సీక్వెన్స్‌లతో అదిరిపోయింది. యాక్షన్ సీన్లు, కారు చేజింగ్‍లతో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. యాక్షన్ మోడ్‍లో హీరో వరుణ్ తేజ్ ఆకట్టుకున్నాడు. “డిసెంబర్ 2020లో దేవుడి మీద మనిషి గెలిచాడంట. జస్ట్ పాతిక వేల సంవత్సరాల్లో మనిషి చేసిన వస్తువులు దేవుడు చేసిన వాటిని మించేశాయంట.. ఎలాగో తెలుసా” అంటూ సీనియర్ యాక్టర్ నాజర్ చెప్పే డైలాగ్‍తో గాండీవధారి అర్జున ట్రైలర్ మొదలైంది. ఈ సినిమాలో పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి పాత్రను నాజర్ పోషించారు. ఆయన క్రిమినళ్లకు టార్గెట్‍గా ఉంటారు. ఆయనను కాపాడే బాధ్యతను ఓ ఏజెన్సీ తరఫున అర్జున్ (వరుణ్ తేజ్) చేపడతారు. ఆ తర్వాత యాక్షన్లు సీన్లు ట్రైలర్‌లో సూపర్‌గా ఉన్నాయి. దేశం కోసం మరో మిషన్‍ను, టాస్కును హీరో అర్జున్‍కు నాజర్ అప్పగిస్తారు. ట్రైలర్‌లోని అంశాలన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ సాక్షి వైద్య కూడా యాక్షన్ పాత్రలోనే కనిపించింది. మిక్కీ జే మేయర్ బ్యాక్‍గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు తగ్గట్టే ఇంటెన్స్‌గా ఉంది.
డైరెక్టర్ 'ప్రవీణ్ సత్తారు' మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గాండీవధారి అర్జున చిత్రం ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో విమలా రామన్, వినయ్ రాయ్, రోషిణి ప్రకాశ్, మనీశ్ చౌదరీ, అభినవ్ గోమఠం, రవి వర్మ, కల్పలత, బేబి వేద కీలక పాత్రల్లో నటించారు.
గాండీవధారి అర్జున సినిమాను శ్రీ వేంకటేశ్వర్ సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‍ఎన్ ప్రసాద్ నిర్మించారు. జీ ముకేశ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేశారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ చేశారు.