Varun Tej: నాకు 12 మంది ఫ్రెండ్స్ ఉన్నారు.. ఆరోజు థియేటర్లలో జాతరే.. హీరో వరుణ్ తేజ్ కామెంట్స్-varun tej about niharika konidela movie committee kurrollu release in pre release event varun tej latest comments ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Varun Tej: నాకు 12 మంది ఫ్రెండ్స్ ఉన్నారు.. ఆరోజు థియేటర్లలో జాతరే.. హీరో వరుణ్ తేజ్ కామెంట్స్

Varun Tej: నాకు 12 మంది ఫ్రెండ్స్ ఉన్నారు.. ఆరోజు థియేటర్లలో జాతరే.. హీరో వరుణ్ తేజ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Aug 07, 2024 01:25 PM IST

Varun Tej About Committee Kurrollu In Pre Release Event: ఆరోజున థియేటర్లలో జాతర ఉండనుందని హీరో వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన చెల్లెలు నిహారిక కొణిదెల సమర్పిస్తున్న కమిటీ కుర్రోళ్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.

నాకు 12 మంది ఫ్రెండ్స్ ఉన్నారు.. ఆరోజు థియేటర్లలో జాతరే.. హీరో వరుణ్ తేజ్ కామెంట్స్
నాకు 12 మంది ఫ్రెండ్స్ ఉన్నారు.. ఆరోజు థియేటర్లలో జాతరే.. హీరో వరుణ్ తేజ్ కామెంట్స్

Varun Tej Latest Comments Viral: ఇటీవల హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా సినిమాతో బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా తన చెల్లెలు, మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పించిన సినిమా కమిటీ కుర్రోళ్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరు అయ్యాడు వరుణ్ తేజ్.

ఈ కార్యక్రమంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు వరుణ్ తేజ్. "కమిటీ కుర్రోళ్లు చిత్రాన్ని నేను చూశాను. ఇలాంటి చిత్రం చూసి చాలా ఏళ్లు అయింది. ఈ చిత్రంలో ఉన్నట్టే నాకు ఓ 12 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ మూవీ చూసినప్పుడు నాకు పాత రోజులు గుర్తొచ్చాయి. ప్రతీ కుర్రాడికి ఈ కథ నచ్చుతుంది. చాలా చోట్ల కన్నీరు పెట్టేసుకున్నాను. ఆడియెన్స్‌కి కూడా అలాంటి ఫీలింగ్ కలుగుతుందనిపిస్తుంది" అని వరుణ్ తేజ్ తెలిపాడు.

"అసలు ఈ చిత్రంలో పన్నెండు పాటలున్నాయని నాకు అనిపించలేదు. అనుదీప్ మంచి పాటలు ఇచ్చారు. అన్వర్ ఎడిటింగ్ కూడా బాగుంది. అనది కనిపిస్తుంది. కెమెరామెన్ రాజు గారు మంచి విజువల్స్ ఇచ్చారు. సినిమా టీం అంతా కలిసి అద్భుతంగా పని చేసింది. డైరెక్టర్ వంశీకి ఆల్ ది బెస్ట్. ఆగస్ట్ 9న థియేటర్లలో జాతరగా ఉండబోతోంది" అని వరుణ్ తేజ్ ఆసక్తికరంగా మాట్లాడాడు.

"కమిటీ కుర్రోళ్లు సినిమాలో అందరూ అద్భుతంగా నటించారు. అందరికీ అద్భుతమైన డెబ్యూ దొరికింది. అందరి పేర్లు ఇండస్ట్రీలో వినిపిస్తాయి. కష్టపడి, క్రమశిక్షణతో ఉంటే ఈ ఇండస్ట్రీలో అందరికీ స్థానం ఉంటుంది. ఇంత మంది టాలెంటెడ్ ఆర్టిస్టులను అందిస్తున్న మా చెల్లి నిహారికను చూస్తుంటే గర్వంగా ఉంది. ఆగస్ట్ 9న థియేటర్లలో ఈ చిత్రం దద్దరిల్లబోతోంది" అని వరుణ్ తేజ్ కామెంట్స్ చేశాడు.

కాగా నిహారిక కొణిదెల సమర్పిస్తోన్న ఈ సినిమాను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్‌పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిర్మించారు. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు కాగా ఇందులో అంతా కొత్త నటీనటులు యాక్ట్ చేశారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో అట్రాక్ట్ చేసిన కమిటీ కుర్రోళ్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఘనంగా జరిగింది.

కమిటీ కుర్రోళ్లు సినిమాను మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాకపోయినప్పటికీ చిరంజీవి వీడియో సందేశాన్ని ప్లే చేశారు. వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. "మా నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఆగస్ట్ 9న రాబోతోంది. ఆల్రెడీ నేను ఈ చిత్రాన్ని చూశాను. చాలా బాగుంది. మా నిహారిక మల్టీటాలెంట్. మంచి చిత్రాలు నిర్మిస్తూ తన అభిరుచిని చాటుకుంటోంది" అని తెలిపారు.

"మంచి కథ, కొత్త కాన్సెప్ట్ చిత్రాలను తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ చిత్రం గోదావరి చుట్టు పక్కల ప్రాంతాల్లో జరుగుతుంది. యదు వంశీ గారికి ఇది మొదటి చిత్రం. అందరూ కొత్త వాళ్లు నటించారు. మంచి విజువల్స్ ఉంటాయి. అనుదీప్ సంగీతం బాగుంది. ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్" అని చిరు ప్రశంసించారు.